Posts

Showing posts from March, 2025

Akkana Sarai Gadi Mohalla | Maheshwaram | Hyderabad | Telangana

Image
  ఇది ఒక చారిత్రక కట్టడం. ఇది మన తెలుగువారికోసం కట్టించడం జరిగినది. ఈ ప్రాంతాన్ని అక్కన సరాయి అని పిలుస్తారు. అంటే విశ్రాంతి ప్రదేశం అని అర్ధం. పూర్వం ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశాన్నికి ప్రయాణించాలి అంటే గురప్పూ బండ్లు , ఎడ్ల బండ్లు వంటి వి మాత్రమే వాడుకలో ఉండేవి. వాటికి మరియు మనకి విశ్రాంతి తీసుకోవడం కొరకు గాడి మోహల్లా అని పేరుతో నిర్మించారు.  వీటిని నిర్మించినది మన తెలుగు వ్యక్తి. అతనే అక్కన్న మాదన్న మంత్రులు. వీరు అస్సలు వరంగల్ , హనుమకొండ వాసులు అని చరిత్ర. అంచెలు అంచెలుగా ఏది చివరకి గోల్కొండలోని కుతుబ్ రాజు కి మంత్రులుగా ఎదిగినరు. వీరి గురించి ఇప్పటికి గోల్కొండ కోటలోని భక్తరామదాసు ని బంధించిన చెరసాలు ని చూడవచ్చు. వీరు అప్పటి కాలం వ్యక్తులు. అప్పటి కాలం రాజుల కాలంలో కూడా మన వారికోసం విశ్రాంతి గదులని నిర్మించారు. కానీ వీటిని సరిగ్గా పాటించుకొకపోవడం వల్ల నేడు శిధిలావస్థ కి చేరుకున్నది. ఇది ఇప్పటికి శ్రీశైలం వెళ్ళే దారిలో మహేశ్వరం వద్ద చూడవచ్చు. హైదరాబాద్ నుంచి కేవలం  15కి. మీ దూరంలోనే ఈ ప్రాంతం ఉన్నది. అప్పటిలో ఇక్కడ చిన్న చిన్న గుడులు కూడా ఉండేవి అని చరిత్ర.  #Akk...

Jannayya Guta Chatragiri Shree Lakshmi Narasimhaswamy Temple | Jannayya Guta | Raviralla | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయాన్ని మనం మొత్తం గుట్టతో నిండి ఉంటుంది. ఈ ఆలయం మొత్తం 3 అంతస్తులో ఉంటుంది. ఈ దేవాలయం జన్నాయి గుట్టఅనే గ్రామం లో రావిర్యాల మండలం మహేశ్వరం నియోజకవర్గం లో ఉన్నది. ఈ ఆలయానికి orr 13 మరియు 14 విరమణ కి దగ్గరలో ఉంటుంది.  ఈ ఆలయాన్ని సుమారు 400 సం || క్రితమే నిర్మించారు. మరియు ఈ ఆలయం శ్రీశైలం వెళ్ళే దారిలో ఉంటుంది. పూర్వం ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు శ్రీశైలం వెళ్ళే సమయంలో ఈ దేవాలయాన్ని దర్శించుకొని వెళ్ళేవారు అని చరిత్ర. ఈ ఆలయం చాలా పెద్దగ ఉంటుంది. ప్రతి మాసంలోని స్వాతి నక్షత్రం రోజున స్వామి వారికి విశేష పూజలు నిర్వహిస్తారు.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 06:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి 07 :45  స్వామివారికి సుదర్శన పూజలు మరియు  వైకుంఠ ఏకాదశి రోజున పండుగలు , ఉత్సవాలు , గ్రహాల సమయం లో ఆలయ దర్శన సమయం లలో మార్పులు ఉంటాయి, భక్తులు గమనించగలరు.  #Jannayya Guta Chatragiri Shree Lakshmi Narasimhaswamy Temple  #Jannayya Guta  #Raviralla  #Hyderabad 

Sri Lakshmi Narasimha Swamy Temple | Kongarakalan | Hyderabad | Telangana

Image
  ఈ ఆలయం అత్యంత పురాతన ఆలయం. ఈ ఆలయాన్ని సుమారు 800 సం || క్రితమే నిర్మించారు అని చరిత్ర. ఈ ఆలయం పూర్తిగా వైష్ణవ సంప్రదాయం ప్రకారం పూజలు చేస్తారు. ఈ ఆలయం హైదరాబాద్ నుంచి కేవలం 22కి. మీ దూరంలోనే ఉన్నది. ఈ ఆలయం హైదరాబాద్ లోని కొంగర కలాన్ వద్ద ఉంటుంది.  ఈ ఆలయంలో స్వామి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి లక్ష్మీ దేవి తో కుడి ఉంటారు. ఈ ఆలయంలో వైకుంఠ ఏకాదశి రోజున మరియు ప్రతి ఏకాదశి రోజున రద్దీ అధికంగా ఉంటుంది. ఈ రోజులలో స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు మరియు పూజలు నిర్వహిస్తారు. భక్తులు వారు పాల్గొనదల్చున్న వారు మొదట టోకెన్ తీసుకొని కేవలం సంప్రదాయ దుస్తులలో వస్తే మాత్రమే ఆలయంలోని ప్రవేశం చేస్తారు.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి 08:00  పండుగలు , ప్రత్యేక రోజులలో మరియు స్వామి వారికి ఉత్సవాలు , రధయాత్ర,  నిర్వహించే సమయంలో గ్రహాల  సమయంలో ఆలయ దర్శన సమయంలో మార్పులు ఉంటాయి గమనించగలరు.  #Sri Lakshmi Narasimha Swamy Temple  #Kongarakalan  #Hyderabad  #Telangana

Sri Veerabadra Swamy | Bonthapally | Hyderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయంలో మనకి శివుడు వీరభద్ర స్వామిగా మరియు అమ్మవారు శ్రీ భద్రకాళి గా దర్శనం ఇస్తారు. ఈ ఆలయం హైదరాబాద్ నుంచి 35 కి.మీ దూరంలో బొంతపల్లి అనే గ్రామంలో కలదు. ఈ ఆలయం చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ చాలా పెద్ద ద్వి చక్ర , త్రీ చక్ర , మరియు బస్ , కార్ వంటి వాహనాలు కూడా ఇక్కడ పార్కింగ్ చేసుకునే సౌకర్యం కలదు.  ఈ ఆలయం పూర్వం ఒక వ్యక్తి కి నడుచుకుంటూ వెళుతూ ఉండగా అతనిని ఎవరు వెనుక నుంచి పిలిచి నట్టు అనిపించగానే వెనుకకి తీరిగీ చూసాడు. కానీ అక్కడ ఎవరు లేరు. మరుసటి రోజు సరిగ్గా ఇలానే జరిగినది. ఈ విషయం అందరికీ చెప్పగా అందరూ వచ్చి చూశారు. తాను చెప్పిన చోట తవ్వి చూడగా ఇక్కడ స్వామి భూమి లోపల నుంచి విగ్రహాన్ని తీసి మరి యొక్క చుట్టుకి తరలించి పెద్ద ఆలయం నిర్మించారు. ఇక్కడ శివలింగం కూడా ఉన్నది. మరియు పెద్ద కోనేరు కూడా ఉన్నది. శివరాత్రి మరియు సోమవారం రోజు మరియూ శుక్రవారం రోజు అధిక రద్దీ ఉంటుంది.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 12:30  మధ్యాన్నం : 12:30 నుంచి 04:30 బ్రేక్  సాయంత్రం : 04:30 నుంచి 07:30 వరకు  పండుగలు మరియు ప్రత్యేక పూజలు , ప్రత్యేక అభిషేక...

Sri Bhramaramba Mallikarjuna Swamy Temple | Nizampet | Hyderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం పేరు శ్రీ శ్రీ శ్రీ భ్రమరాంభ సమేత మల్లికార్జున స్వామి దేవాలయం. ఈ ఆలయం మనకి శ్రీశైలం మరియు కోమరవేల్లి మల్లన్న స్వామి తో కలిసి ఉంటారు. ఈ ఆలయం తెలంగాణాలోని నిజాంపేట్ కి కొద్ది దూరంలోనే ఉన్నది.  ఈ అలయాంలో మనకి మొదట ధ్వజ స్తంభం ఆది దాటుకొని కొంచం ముందుకు  వెళితే రావి చెట్టు తో కుడి ఉన్న నాగ దేవత మూర్తిలు తర్వాత ధ్యాన శివుడు బయట అభిషేకం చేసుకువళి అని అనుకునే వారికి చిన్న శివ లింగం తరువాత ప్రధాన ఆలయంలోకి ప్రయాణం  చేయాలి. ఇక్కడ శివుడు లింగాన్ని చూడగానే మనస్సు ఇట్టే లగేసుకుంటుంది. పెద్ద లింగం కి అభీషేకం చేపించుకోవాలి అని అనుకునే వారు మొదట టోకెన్ తీసుకోవాలి. వారి వారి గోత్ర నామాల మీద పేరుతో అభిషేకం చేస్తారు. తరువాత ప్రసాదం ఇస్తారు. ప్రతి సోమవారం మరియు శివరాత్రి సమయంలో రద్దీ అధికంగా ఉంటుంది. ఈ శివలింగం వెనుకనే మనకి కోమరవేల్లి దర్శనం ఇస్తారు.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 07:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 05:00  సాయంత్రం : 05:00 నుంచి 07:30  ప్రత్యేక రోజులలో మరియు పండుగ సమయంలలో ఆలయ దర్శన సమయంలలో మార్పులు ఉంటాయి. భక్తులు గమనించగలరు.  #S...

Kakatiya Trikuteshwara Temple | Mutharam | Bhimadevarpalli | Hanumakonda | Telangana

Image
   ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ దేవాలయాన్ని మనం కాకతీయుల కాలం నాటిది అని చరిత్ర . ఈ దేవాలయం వరంగల్ నుంచి కేవలం 35కి.మీ దూరంలో ఉన్నది. మరియు హనుమకొండ నుంచి భీమదేవరపల్లి ముత్తారం అనే గ్రామానికి దగ్గరలోనే ఉన్నది. అప్పటి ప్రభుత్వలు ఈ ఆలయాన్ని సరిగ్గా అభివృద్ది చేయకపోవడం వల్ల శిధిలావస్థ కి చేరుకున్నది.  ఈ ఆలయంలో ప్రధానంగా 3 శివాలయాలు ఉన్నయి. మొదటిది శ్రీ సురేశ్వర ఆలయం,  రెండవది మహామృత్యుంజయ ఆలయం, మూడు వాసుదేవ ఆలయం. ఈ ఆలయం పూర్తిగా వరంగల్ లోని వేయి స్తంభాల ఆలయంన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయం లో ప్రతి సం || శివరాత్రి ఉత్సవాలు భారీ ఎత్తున జరుగుతాయి. రాత్రి 12 గంటలకి లింగోద్భవం , రుద్రాభిషేకం , అష్ట లక్ష్మీ పూజలు నిర్వహించి మరుసటి రోజు ఉదయ అభీషేక ప్రత్యేక పూజల తరువాత ఆన్నదాన వితరణ ఉంటుంది.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 04:45 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి 07:00  ఈ ఆలయం చాలా చిన్న ఆలయం. కానీ చాలా పురాతన ఆలయం. కేవలం శివరాత్రి మరియు ఇతర పండుగ రోజులలో రద్దీ అధికంగా ఉంటుంది. ఆ సమయంలలో ఆలయ దర్శన సమయంలలో మార్పులు ఉంటాయి అని గమనించగలర...

Nallagutta Sri Laxmi Narasimha Temple | Gajularamaram | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఇక్కడ స్వామి స్వయంభూ స్వామి. ఈ ఆలయంలో మనం పాత యాదగిరిగుట్ట వద్ద గల హనుమాన్ ఆలయం వద్ద గల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పాదాలు ఎలా ఐతే దర్శిస్తామో ఇక్కడ కూడా సరిగ్గా అలానే దర్శించవచ్చు స్వామి పాదాలను కూడా. ఈ ఆలయం హైదరాబాద్ లోని గాజులరామారం వద్ద ఉన్నాది.  ఈ ఆలయంలో స్వామి మనకి గుట్టలో నుంచి దర్శనం ఇస్తారు. ఇక్కడ స్వామి ని దర్శించాలని అంటే మొదట మనం గణపతి స్వామి ని మరియు శివయ్యని మరియు శని భాగవణుడుని, శ్రీ ఆంజనేయస్వామి ని దర్శించుకున్న తరువాత, ఇంకా లోపలికి వెలితే ఇక్కడ పెద్ద శ్రీ నాగదేవత పుట్ట ఉంటుంది. పిల్లలు పేరు వారు ఇక్కడ ప్రత్యేక పూజలు చేపించుకుంటారు. తరువాత గుట్ట లోపలికి వెళితే అక్కడ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం ఇస్తారు. ఇక్కడ శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం , స్వామి కి కళ్యాణం మరియు ఇతర పూజలు నిర్వహిస్తారు.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి 07:45 వరకు  పండుగలు , స్వామి వారికి ప్రత్యేక రోజులలో జరిగే కళ్యాణం , వ్రతాలు ఇతర పెద్ద పండుగ సమయం లలో ఆలయ దర్శనం స...

Sri Lakshmi Narasimha Swamy Temple | Mamillapalli | Telangana | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాల పురాతన ఆలయం. ఈ దేవాలయంలో స్వామి స్వయంభూ స్వామి. ఈ ఆలయం 11వ శతాబ్దం కి చెందిన ఆలయం. హైదరాబాద్ నుంచి ఈ దేవాలయం సుమారు 120 కి. మీ దూరంలో ఉంటుంది. ఈ ఆలయం లో వెలిసిన స్వామి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి.  ఈ ఆలయం లో పూర్వం ఇక్కడ ఒక పొలం ఉండేది. ఒక వ్యక్తి తన పొలం లో సాగు చేస్తూ ఉండగా తన నాగలి కి స్వామి విగ్రహం తగిలి చప్పుడు అవ్వడం తో చూడగానే స్వామి విగ్రహం కొంచం మాత్రమే కనిపించినది. ఈ విషయం అందరికీ చెప్పగానే అందరూ మరుసటి రోజు విగ్రహానికి ఎటువంటి హాని కలగకుండా బయటికి తీశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరియు ప్రతి రోజు ఇక్కడ స్వామి అభిషేకాలు పూజలు జరుగుతాయి. ఇక్కడ వారం రోజుల పాటు దివ్యమైన జాతర జరుగుతుంది. జాతర చివరి రోజున గిత్తలు , ఆవుల బండ్ల పోటీలు , ఊరేగింపులు , స్వామి వారి యాత్ర జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి రోజు రద్దీ అధికంగా ఉంటుంది.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 06:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి 07:45 వరకు  ప్రత్యేక రోజులలో మరియు పండుగలలో , జాతర సమయంలలో ఆలయ దర్శన సమయంలలో మార్పులు ఉంటాయి.  #sri lakshmi na...

Sri Nagadevatha Devalayam Temple | Tirumalagiri | Secunderabad | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా ప్రసిద్ద ఆలయం. ఎవరికి ఐతే నాగదోషం, సర్ప దోషం వంటివి ఉంటారో వారికి ఈ ఆలయం ఖచ్చితంగా దర్శించాలి. ఈ  ఆలయం తెలంగాణా లోని సికింద్రాబాద్ వద్ద గల తిరుమలగిరి గ్రామంలో శ్రీ నాగదేవత దేవాలయం పేరుతో ఈ ఆలయం ఉన్నది.  ఈ ఆలయంలో శ్రీ నాగదేవత, శ్రీ నారాయణస్వామి , శ్రీలశ్రీజయలక్ష్మి , శ్రీ శశి అమ్మ , గురుస్థానం తో ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయం సుమారు బ్రిటిష్ కాలం నాటి నుంచి ఉన్నది అని చరిత్ర. పూర్వం బ్రిటిష్ వారు ఈ ఆలయం పక్కేన ఉన్న రోడ్డు మార్గం నుంచి వెళుతూ తీరిగీ సాయంత్రం వచ్చే సమయంలో మార్గం మధ్యలో ఈ ఆలయం గురించి చర్చ జరిపి ఈ ఆలయని ధ్వంసం చేయాలి అని వ్యూహ రచన చేశారు. కానీ ఇక్కడ అమ్మవారికి కోపానికి వారు ఆలయ గెట్ వద్దకి రాగానే అందరూ కళ్ళు తిగిరి పడిపోయారు. ఆ రోజు నుంచి వాళ్ళు మళ్ళీ ఈ ఆలయం గురించి చర్చ జరుపలేదు. పిల్లలు లేని వారు ఈ ఆలయంలో మొక్కుకొని అమ్మవారిని మనస్సు పూర్తిగా మొక్కుకొని విగ్రహ ప్రతిష్ట చేస్తే వాళ్ళకి పిల్లలు కలుగుతారు అని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో శివాలయం మరియు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంటాయి.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 06:00 నుంచి 12:00  మధ్యాన్నం :  ...

Sri Umamaheshwara swamy temple | Suraram | Hyderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం పెద్ద ఆలయం. బయటి నుంచి చిన్నగా కనిపించిన లోపల కొంచం పెద్దగానే ఉంటుంది. ఈ ఆలయం తెలంగాణా లోని హైదరాబాద్ లో సూరారం వద్ద ఉంటుంది. ఈ ఆలయం లో ప్రధాన దేవత మూర్తి శివుడు. ఇక్కడ ప్రతి రోజు శివుడుకి ఉదయం అభిషేకం చేస్తారు.  ఈ ఆలయంలో మనకీ గణపతి తొండం లో లోపలికి ప్రవేశించాలి. ఈ ఇక్కడి నుంచి లోపలికి వెళుతూ ఉంటే స్వరంగం మార్గంతో వెళుతూ ఉన్నట్టు ఉంటుంది. ఇక్కడ మనకి గణపతి , ఆంజనేయ స్వామి శివుడు ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. శివరాత్రి రోజు రద్దీ చాలా అధికంగా ఉంటుంది. ఇక్కడ ఆ రోజు రాత్రి 11:00 నుంచి 12:00 వరకు లింగోద్భవం సమయం లో ప్రత్యేక అభిషేకం చేస్తారు.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 11:30  మధ్యాన్నం : 12:00 నుంచి 05:00  సాయంత్రం : 05:00 నుంచి 07:45  #Sri Umamaheshwara swamy temple  #Suraram  #Hyderabad  #Hindu Temples Guide 

Gouthameshwara Temple | Manthani | Peddapalli | Telangana | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం పైన ఫోటోలో చూస్తేనే తెలుస్తుంది. అంత్యంత పురాతన ఆలయం అని. ఈ ఆలయం తెలంగాణా లోని పెద్దపల్లి జిల్లా మంధని గ్రామంలో గౌతమేశ్వర ఆలయం పేరుతో పిలుస్తారు. ఈ ప్రాంతాన్ని పూర్వం మంధని మంత్రపుట పురం అని పిలిచేవారు. ఈ ఆలయ నిర్మాణ శైలిని బట్టి ఈ ఆలయం కాకతీయుల కాలం నాటిది అని చరిత్ర .  ఈ ఆలయని కాకతీయుల సైన్య అధికారి ప్రతాప రుద్రుడు 11 వ శతాబ్దం లో నిర్మించాడు. ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శివుడు. ఆలయ ప్రారంభం లోనే గణపతి స్వామి ని దర్శించుకోవచ్చు. ఆలయం బయట పురాతన పూర్తిగా శిదిలా వస్తకి చేరుకున్నది. పక్కనే పునః నిర్మాణం చేసిన మారియొక్క ఆలయం ఉన్నది. శివరాత్రి రోజు ఈ ఆలయంలో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికి ప్రతి రోజు స్వామీ వారికి నిత్య అభిషేకం చేస్తున్నారు. ఆలయం లోపల మనకి పురాతన గోపురాలు దర్శించవచ్చు.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 11:00  మధ్యాన్నం : 11:00 నుంచి 05:00 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి 07:30    #Gouthameshwara Temple  #Manthani  #Peddapalli  #Telangana  #Hindu Temples Guide 

Someshwar Temple | Someshwarwada | Sangareddy | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా శక్తివంతమైన ఆలయం. ఈ ఆలయాన్ని మనం దర్శించుకోవాలి అంటే 6 నెలలు వైట్ చేయాలి. ఎలాగ ఐతే కేదారేశ్వర స్వామి ఆలయం కేదారనాథ్ లో 6 నెలలు మంచుతో  కప్పి ఉండడం వల్ల 6 నెలలు ఆలయం దర్శనం అపుతారో ఈ ఆలయం కూడా 6 నెలలు నీతో నిండి మునిగి ఉంటుంది ఈ ఆలయం. వర్ష కాలం లో చూస్తే అస్సలు ఇక్కడ ఆలయం ఉన్నది అని కూడా మనకు అనిపించదు. ఈ ఆలయం తెలంగాణా లోని సంగారెడ్డి వద్దగల సోమేశ్వర ఆలయం ఈ దేవాలయం పేరు. చాలా చిన్న ఆలయం.  ఈ ఆలయాన్ని చలి మరియు ఎండ కాలంలో మాత్రమే దర్శించుకుంటాం. ఇక్కడ ప్రధాన దేవత మూర్తి మహా శివుడు. 6 నెలలులో  ప్రతి స్వామీ వారికి అభిషేకం చేస్తారు. ఇక్కడ ప్రక్కనే కోనేరు ఉన్నది. మన దేశాన్ని ముస్లింలు పరిపాలించే సమయంలో ఇక్కడ చాల విగ్రహాలు మరియు నంది విగ్రహాలని ధ్వంసం చేశారు. ఇక్కడ చాలా రాతి శాసనాలు కూడా మనం గమనించవచ్చు. ఈ శాసనాల ప్రకారం ఈ ఆలయం కాకతీయుల కాలం నాటిది అని చెప్పవచ్చు. ఈ ఆలయం లో శివుడు ఇక్కడ చాలా ప్రసిద్దమైన దేవుడు. తప్పకుండా ఎటువైపు వస్తే అందరూ దర్శించుకోవాలి.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 06:00 నుంచి 11: 00  మధ్యాన్నం : 11:00 నుంచి 05:00 బ్రేక్  సా...

Prasanna Venkateswara Swamy Temple | Anjaneya Nagar | AGI Colony | Moosapet | Hyderabad

Image
  ఈ దేవాలయం చాలా ప్రసిద్దమైన ఆలయం. ఇక్కడ స్వామి పేరు శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి దేవలాయం అనే పేరు మీద ఈ ఆలయం ఉన్నది. ఈ దేవలయాన్నికి చేరుకోవడం చాలా సులువు. హైదరాబాద్ లోని మోసాపేట ఆంజనేయ నగర్ ఏఐజి కాలనీ వద్ద ఉంటుంది. ఇక్కడ స్వామి వారికి ప్రత్యేకంగా అభిషేకం చేసే సమయంలో చూస్తే చాలా బాగా కనిపిస్తారు.  ఈ ఆలయంలోని స్వామి వారిని అలా చూస్తూ ఉండిపోవచ్చు. స్వామి వారి మనోహర రూపం సరిగ్గా తిరుపతిలో స్వామి ని దర్శించుకున్న అనుభూతి కలుగుతుంది. మొదట ఈ దేవలాయం చాలా చిన్నగా ఉండేది. భక్తుల సహకారం అందురు కలిసి ఈ దేవలయాన్ని అభివృద్ది చేస్తున్నారు. ఇప్పడు ఆలయ కొంచం పెద్దగానే ఉన్నది. ఇంతకు ముందు స్వామి వారు రేకుల ఆలయంలో ఉండేవారు. ఇప్పుడు చక్కగా పెద్ద ఆలయం నిర్మించుకున్నారు. వైకుంఠ ఏకాదశి , శనివారం , ఉగాది , ఇతర పండుగలలో రద్దీ అధికంగా ఉంటుంది.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 06:00 నుంచి 11:30  మధ్యాన్నం : 11:30 నుంచి 05:30 బ్రేక్  సాయంత్రం : 05:30 నుంచి 08:00 వరకు  #Prasanna Venkateswara Swamy Temple, #Anjaneya Nagar, #AGI Colony, #Moosapet, #Hyderabad 

Sri Sri Sri Kedareshwara Temple | Padamashali Puram | Kattedan | Rajendhra Nagar | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయాన్ని సుమారు 30 సం || క్రితం నుంచే ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయం హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ వద్ద గల పద్మశాలి పురం గ్రామం లో ఉన్నది. ఇక్కడ శివలింగం శ్రీ శ్రీ శ్రీ కేదారేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయం ప్రక్కనే ప్రతి సం || ఒక కమిటీ సభ్యులు వినయక చవితి రోజున గణపతి స్వామి వారిని కూడా పెట్టి 9 రోజులు పూజలు , సాంస్కృతిక కార్యక్రమాలు , పిల్లలతో భరతనాట్యం వంటి కార్యక్రమాలు నిర్వహించి పిల్లలకి ప్రైజ్ లు కూడా ఇస్తారు.  ఈ ఆలయం చాలా చిన్న ఆలయం. ఒక కొండ మీద ఉంటుంది. చిన్న ఆలయం ఐన కూడా చాలా శక్తివంతమైన ఆలయం. అందుకే ఇక్కడ ఈ ఆలయంలో నూతనంగా పెళ్లి చేసుకునే వారికి కూడా ఇక్కడ సౌకర్యం ఉన్నది. 27 సం || క్రితం ఈ ప్రాంతం అంతా రాళ్ళతో పెద్ద పెద్ద చెట్లతో ఉండేది. ఇక్కడి గ్రామ వాసులు అందరూ కలిసి దిన దినాభివృద్ది చేస్తూ ఆలయ అభూవృద్ది కి తొడపడుతూ అందరూ కలిసి కట్టుగా ఆలయ పనులలో పలుపంచుకుంట్టు అభివృద్ది కి వారివంతు సహాయం చేస్తున్నారు. ఇక్కడి నుంచి చాలా మంది మాఘ మాసంలో అనగా శివరాత్రి కి ముందు స్వామి దర్శనం చేసుకొని పాద యాత్రగ వెళ్ళి వారు మరియు కొందరు బస్ ...

Sri Laxmi Narasimha swami | Varadapasam | Beerpur | Peddagutta | Telangana

Image
  ఇక్కడ స్వామి చాలా శక్తివంతమైన స్వామి. ఇక్కడ ఒక కొండ గుట్టకే పూజలు నిర్వహిస్తారు. ఈ స్వామి కొండ మీద నుంచి చూస్తే మనకి గోదావరి నది కనిపిస్తుంది. అంత పెద్దది మరియు ఎత్తైన కొండ ఈ ఆలయం చేరుకోవాలియ అంటే ప్రాణాలతో చెలగాటం అడుకోవాడమే అని కూడా అనుకోవచ్చు. అందుకు గల కారణం ఇక్కడ కొండ మీదకి చేరుకోవడానికి ఎటువంటి మెట్లు లేవు. ట్రెకింగ్ చేసుకుంటా వెళ్ళినట్టు వెళ్ళాలి. ఈ కొండ తెలంగాణా రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా బీరపూర్ పెద్దగుట్ట వద్ద కలదు.   ఈ కొండ కి రెండు నీటి గూండాలు ఉన్నాయి. వాటిని ఎవరు నిర్మించలేదు. స్వయంగా వచ్చాయి. వాటిలో నీరు ఉంటుంది. గుట్టకే  స్వామి వారి ఆకృతి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. స్వామి వారికి ఈ నీటితో అభిషేకం నిర్వహిస్తారు. దీనినే ఇక్కడ వరదప్రసాదం అని అంటారు. ఇంత పెద్ద కొండ మీదకి అందరూ వర్ష కాలం ప్రారంభం లో వచ్చి స్వామి వారికి పూజలు చేసిన తారువత నుంచే గ్రామం అంతా వర్షం కురుస్తుంది. ఇప్పటికి ఈ ఆచారం జరుగుతుంది. కానీ ఏ మాత్రం కాలు తేడా గా జారిన కింద పడిపోవడం ఖాయం. ఇక్కడ కొండ మీదకి అందరూ వచ్చి స్వామి వారికి అక్కడే వంటలు చేసి నైవేద్యం పెట్టి అందరూ తింటారు. ట్రెకి...

Mallana Swami Temple | Peddapur | Jadityala | Telangana

Image
  తెలంగాణాలోని సమ్మక సారక్క జాతర తరువాత ఆది పెద్ద అయినట్టువంటి జాతర ఈ మల్లన జాతర. ఈ ఆలయం జగిత్యాల జిల్లాలోని పెద్దాపూర్ గ్రామంలో ఈ ఆలయం ఉన్నది. ప్రతి సం || హోలీ కి వచ్చే మొదటి ఆదివారం ఈ జాతర నిర్వహిస్తారు. హైదరాబాద్ నుంచి ఈ ఆలయానికి 190కి. మీ దూరంలో ఉంటుంది. ఈ ఆలయం కొంచం చిన్నగా ఉంటుంది. చిన్న గ్రామంలో ఉంటుంది. కానీ పురాతన ఆలయం.  ఈ ఆలయానికి కేవలం ఈ జాతరకోసం ప్రక్క గ్రామాల నుంచి కాకుండా వివిధ జిల్లాల నుంచి కూడా ఈ జాతరకి జనాలు వస్తారు. ఆడవారు బోనాలు అధిక సంఖ్యలో స్వామి కి బోనం సమర్పించడం ఆనవాయితీ.  ఇక్కడ మారియొక్క ప్రత్యేకత పోతారాజుల ఆటపాటలు మరియు రంగం ఆట మారియొక్క ఆకర్షణ.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 07:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి 08:00 ప్రత్యేక రోజులలో ఆలయ దర్శన సమయంలో మార్పులు గమనించగలరు.  #mallana swami temple #peddapur #jadityala #telangana 

Naina Gullu Caves | Adavi Somanpalli | Jayashankar Bhupalapalli | Telangana

Image
  ఇది చాలా పురాతన ప్రాంత ఆలయం. ఇక్కడ ఆది మానవుల కాలం నాటి శిలలు మరియు వారు నిర్మించుకున్న సహజ సిద్ద గుహలు ఇప్పటికి మనం దర్శించవచ్చు. ఈ ప్రాంతం తెలంగాణాలోని జయశంకర భూపాలపల్లి మానేరు అడువులలో నైనా గుహలు అడవి సోమనపల్లి వద్ద కలవు. హైదరాబాద్ నుంచి ఈ ప్రాంతానికి సుమారు 260కి. మీ దూరంలో ఈ గుహలు కలవు.  ఇక్కడ వారు అడవి జంతువుల భారీ నుంచి తప్పించుకోవడానికి రాళ్ళను ఏవిధంగా ఉపయోగించుకున్నారో ఇప్పటికి వాటి ఆయుధాల చిన్న చిన్న ముక్కలను గమనించవచ్చు. మరియు పక్కనే మానేరు నది ప్రవాహం కూడా చూడవచ్చు. ఇది చాలా లోపలికి ఉంటుంది. వీటిని చూడాలి అనే చాలా ధైర్యం కావాలి. దానికి కారణం చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం కనీసం మంచి నీరు కూడా ఇవ్వడానికి అక్కడ ఎవరు ఉండరు. ఆది మానవుల తరువాత కొందరు రాజులు వీటిని స్వాధీనం చేసుకొని కొన్ని సం || వారి రహస్య స్థావరాలుగా ఉపయోగించుకున్నారు అని చరిత్ర. తరువాత వీటిని అన్నలు కూడా ఉపయోగించుకున్నారు. ఇప్పడు ఇక్కడ ఎవ్వరూ లేకపోవడం వల్ల శిధిలావస్థకి చేరుకున్నది. ట్రెక్కింగ్ చేయాలి అని అనుకునే వారికి ఈ ప్రాంతం ఒక అద్భుతం. కొత్త ధనం కోరుకునే వారికి ఇది మంచి ప్రాంతం.  దర్శన సమయం...

Sri Renuka Yellamma Temple | Karnanpalli | Medak | Telangana

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం లోని అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు. ఇక్కడ అమ్మవారు స్వయంభూ అమ్మవారు. ఈ ఆలయాన్ని మనం హైదరాబాద్ నుంచి మొదట మెదక్ వద్ద గల కారాన్న్ పల్లి గ్రామంలో ఉన్నది. ఈ ఆలయం హైదరాబాద్ నగర బోర్డర్ వద్ద కలదు. ఈ ఆలయం హైదరాబాద్ నుంచి సుమారు 85 కి. మీ దూరంలో ఉన్నది.  ఈ ఆలయంలో అమ్మవారు చాలా పెద్ద విగ్రహం తో ఉంటారు. ఈ గ్రామం చుట్టూ పక్కల నుంచే కాకుండా వివిధ గ్రామాల నుంచి కూడా అమ్మవారి దర్శనం కోసం వస్తారు. అమ్మవారి ఎదురుగా ఒక పుట్ట ఉంటుంది. అక్కడ కూడా అమ్మవారు ఉంటారు. ఆ పుట్టలోనే పాముని కూడా అమ్మవారి స్వరూపం గా భావిస్తారు. పిల్లల కోసం ఇక్కడ నాగదేవతకు పూజలు ఎక్కువ చేస్తారు. ఎదురుగా శ్రీ మాతా ఆలయం కూడా ఉంటుంది. ప్రధాన ఆలయంలో అమ్మవారి పరివారం అంతా ఉంటుంది. కొద్దిగా రాష్ లేని సమయంలో లోపల అంతా చూడవచ్చు. ప్రతి ఆదివారం , మంగళవారం , శుక్రవారం రోజులలో రద్దీ చాలా ఎక్కువగ ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి జాతర కూడా జరిపిస్తారు. అప్పుడు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 0...

Sri Siddi Vinaya Temple | Ganesh Gadda | Rudraram | Patancheruvu | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా పురాతన మరియు శక్తివంతమైన ఆలయం. ఈ ఆలయం మనకి చూడడానికి ముంబైలోని శ్రీ సిద్ది వినయక స్వామి వలె పోలి ఉంటుంది. సరిగ్గా అటువంటి ఆలయం మన తెలంగాణ లో కూడా ఉన్నది. ఈ ఆలయం తెలంగాణాలోని పటాన్ చెరువు వద్ద గల రుద్రారం , గణేష్ గడ్డ గ్రామంలో కలదు. ఈ ఆలయంలోని స్వామి స్వయంభూ స్వామి.  మనకి చిలకురు బాలాజీ లో మొదట ఒక కోరిక కోరుకున్న తరువాత 11 ప్రదక్షిణలు చేస్తారు. కోరిక తీరిన తరువాత 108 ప్రదక్షిణలు చేయాలి. ఇక్కడ స్వామి వారికి నిత్యం హోమం మరియు అభిషేకం జరుగుతూనే ఉంటుంది. నవగ్రహ మండపం కూడా ఉన్నది. ప్రతి మంగళ , బుధవారం మరియు శనివారం &  ఆదివారం రద్దీ చాలా అధికంగా ఉంటుంది.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి 08:00  #Sri Siddi Vinaya Temple  #Ganesh Gadda  #Rudraram  #Patancheruvu  #Hyderabad 

Hanuman Temple | Vivekanada Nagar | Kuketpally | Hyderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం హైదరాబాద్ లోని కుకెట్పల్లి వివేకానందా నగర్ కాలనీ ప్రధాన రోడ్డు నుంచి కొంచం 1కి. మీ దూరంలోనే ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయానికి సరియైన పార్కింగ్ సౌకర్యం లేదు. కనీసం ద్విచక్రం బండి నిలపడానికి కూడా సౌకర్యం లేదు. కానీ ఆలయం పెద్దగానే ఉంటుంది.  ఈ ఆలయంలో ప్రధాన ఆకర్షణ హనుమాన్ విగ్రహం. ఈ హనుమాన్ విగ్రహం 64 అడుగుల ఎత్తులో ఉంటుంది. మరియు ఈ ఆలయంలో శ్రీ సీత రామచంద్ర స్వామి లక్ష్మణ స్వామి కూడా ఉంటారు. శ్రీ రామాయణం సమయంలో జరిగిన ప్రతి సన్నివేశం ఇక్కడ చూపించబడుతుంది. ప్రతి సం || ఈ ఆలయంలో శ్రీ రామ నవమి మరియు హనుమాన్ జయంతి చాలా వైభవంగా నిర్వహిస్తారు. కుకెట్ పల్లిలో తప్పకుండా చూడవలసిన ఆలయాలలో ఈ ఆలయం ఒకటి.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 11:45  మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి 08:00  #Hanuman Temple  #Vivekanada Nagar  #Kuketpally  #Hyderabad  #Hindu Temples Guide 

Sri Liladri Narasimha Swamy Temple | Tulsi nagar | Allwyn colony | Jaggadirgutta | Hyderabad

Image
  ఈ ఆలయంలోని స్వామి స్వయంభూ స్వామి. సాధారణంగా మనకి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాలు అని కూడా కొండ మీద దర్శనం ఇస్తాయి. ఈ ఆలయం కూడా మనకి స్వామి కొండ మీద ఒక గుహలో దర్శనం ఇస్తారు. ఈ ఆలయం హైదరాబాద్ లోని తులసి నగర్ , ఆల్విన్ కాలనీ జగ్గదిర్ గుట్ట లో కలదు.  ఈ ఆలయంలో స్వామి చేరుకొనే మొదట గణపతి మరియు శివయ్య పక్క పక్కనే కనిపిస్తారు. మరియు వేరియొక్క కొండ లో స్వామి దర్శనం ఇస్తారు. స్వామి ఇక్కడ కొండలో స్వామి స్వయంభూ గా దర్శనం ఇస్తారు. పక్కనే స్వామి కళ్యాణం కూడా చేస్తారు. ఆది కూడా ప్రత్యేక రోజులలో మాత్రమే. అలాయం బయట కి వచ్చి పక్కనే నుంచి ఇంకా పైకి వెళితే శ్రీ నాగదేవత పుట్ట కనిపిస్తుంది. మరియు పక్కనే యగశాల మండపం కూడా ఉంటాయి.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 11:45  మధ్యాన్నం : 12:00 నుంచి 04:45 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి 07:45  #Sri Liladri Narasimha Swamy Temple  #Tulsi nagar  #Allwyn colony  #Jaggadirgutta  #Hyderabad 

Sri Shiridi Sai Baba Temple | Jagadir Gutta | Beside Salasar Hanuman Temple | Hyderabad

Image
  ఈ ఆలయం లోని సాయి బాబా చాలా పాత ఆలయం. అని ఆలయాల్లో వలె కాకుండా ఇక్కడ కొంచం కొత్తగా మనకి ఈ సాయి బాబా కనిపిస్తారు. ఈ ఆలయం హైదరాబాద్ లోని జగ్గదిర్గుట్ట లోని సలాసర్ హనుమాన్ ఆలయం పక్కనే ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయం చాలా చిన్నగా మరియు ఒక షెడ్డు లో ఉంటుంది.  పూర్వం ఈ అలయా స్థలని కూడా కబ్జా చేయాలి అని కొందరు ప్రయత్నించారు. కానీ ఇక్కడి ప్రజలు స్వామి వారికి వారికి ఉన్న అంతలో అందరూ కలిసి ఇక్కడి సాయి బాబా స్థలం లోనే స్వామి కి చిన్న రేకుల షెడ్డులో ఆలయాన్ని అందరూ కలిసి నిర్మించుకున్నారు.  ఈ ఆలయంలో మనకి మొదట శ్రీ గణపతి మరియు శ్రీ దుర్గా దేవి, మరియు ఇతర దేవతలు దర్శించవచ్చు. అని ఆలయలలో కాకుండా ఇక్కడ స్వామి వారికి నాగ దేవత మూర్తినే కిరీటం గా దరించుతారు. కానీ ఇతర ఆలయలలో స్వామి వారి తలకి కిరీటం పేడుతారు. ప్రతి గురువారం ఇక్కడ రద్దీ కొంచం అధికంగా ఉంటుంది.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 11:30  మధ్యాన్నం : 11:45 నుంచి 04:45 బ్రేక్  సాయంత్రం : 04:45 నుంచి 07:30 వరకు  #Sri Shiridi Sai Baba Temple  #Jagadir Gutta #Beside Salasar Hanuman Temple  #Hyderabad 

Parushauram temple | Jagadirgutta | Hyderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా సం || నుంచే కలదు. ఈ ఆలయాన్ని మనం హైదరబాద్ లోని జగ్గదిర్ గుట్ట ప్రధాన బస్ స్టాప్ నుంచి కేవలం 01 కి.మీ. దూరంలో కలదు. జగ్గదిర్ గుట్ట బస్ స్టాప్ నుంచి ఆటోలు ఈ ఆలయానికి చేరుకుంటాయి. ఈ ఆలయం ఒక గుట్ట మీద ఉంటుంది. ఇది కొంచం చిన్న ఆలయం.  ఇలాంటి ఆలయాలు మనకి చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈ ఆలయంలో మనకి ప్రారంభంలోనే శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకోవచ్చు. ఆలయం లోపలికి వెళ్ళగానే పెద్ద కడప కనిపిస్తుంది. ఆది దాటుకొని వెల్లగానే ప్రధాన ఆలయం వరకు వెళ్లిపోవచ్చు. గండ్ర గొడ్డలితో శ్రీ పరశురామ స్వామి ని దర్శించుకోవచ్చు. ఇక్కడ ధ్యానం చేసే అలవాటు ఉన్న వారికి ఈ ఆలయం ఒక అద్భుతమైన ఆలయం. దర్శనం తరువాత ఆలయం బయటికి వచ్చిన తరువాత మనకి నవగ్రహ మండపం దర్శించుకోవచ్చు. పక్కనే శివాలయం కూడా ఉంటుంది. ఇక్కడ మన చేతులతో మనమే స్వయంగా స్వామి వారికి అభిషేకం చేసుకునే అవకాశం ఈ ఆలయం వారు కల్పిస్తున్నారు.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 11:30  మధ్యాన్నం : 11:30 నుంచి 05:00 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి 07:45 వరకు  #Parushauram temple #Jagadirgutta  #Hyderabad  #Hindu Temples Guide...

Hari Hara Devalayam | Nagisheety Palli | Shamerpet | Telangana | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం నూతనంగా నిర్మించిన ఆలయం కానీ పూర్వం ఇక్కడ చాలా చిన్న ఆలయం ఉన్నది అని ఇక్కడి వల్ల మాట. ఈ ఆలయం లో మనకి చాలా విశేషాలు కనిపిస్తాయి. ఈ ఆలయం తెలంగాణా లోని షామీర్ పేట లోని నాగిశెట్టి పల్లి గ్రామంలో కలదు. బయటి నుంచి చిన్నగా కనిపించిన లోపల మాత్రం కొంచం పెద్దగానే కనిపిస్తుంది. ఈ ఆలయం పూర్తిగా రాతితో నిర్మించారు.  ఈ ఆలయంలో ప్రధానంగా శ్రీ సీతరామ లక్ష్మణ స్వామి మరియు పక్కనే శ్రీ శివయ్య తండ్రి మరియు తల్లి పార్వతి దేవి దర్శనం చేసుకోవచ్చు. మరియు మనకి మొదట ఆలయంలో ప్రవేశించగానే రెండు రాతి ధ్వజ స్తంబలు కనిపిస్తాయి. పైన ఫోటోలో గమనించవచ్చు. మరియు ఈ ఆలయంలో ప్రత్యేకత మనం సాధారణంగా శ్రీ రామల వారికి ఎదురుగా శ్రీ ఆంజనేయ స్వామి ని దర్శించుకుంటాము. కానీ ఈ ఆలయంలో మాత్రం పక్కనే ప్రత్యేక ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామిని చూడవచ్చు. మరియు ఈ ఆలయంలో మనకి యగశాల కూడా చూడవచ్చు. వీటితో పాటుగా మనం నవగ్రహ మండపం కూడా చూడవచ్చు. ఆలయం చూడడానికి కొంచం చిన్నగా ఉన్న కూడా ఎంతో ప్రశాంతమైనా వాతావరణం మనం చూడవచ్చు. ప్రతి సం || శ్రీ రామ నవమి మరియు శివరాత్రి సమయంలలో రద్దీ అధికంగా ఉంటుంది.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుం...

Bheema Lingeshwara Swami Temple | Sangam | Yadadri | Bhuvanagiri | Hindu Temples Guide

Image
  ఇది ఒక్క విచిత్రమైన ఆలయం. కానీ ఇక్కడ శివయ్య కి మాత్రం ఆలయం ఉండదు. కానీ అందరూ మాత్రం భీమలింగేశ్వర ఆలయం అని అంటారు. ఈ ఆలయాన్ని తెలంగాణా లోని భువనగిరి జిల్లా సంగం అనే గ్రామంలో ఈ ఆలయం శతాబ్దాల నుంచి ఉన్నది.  సంగం అనే గ్రామం వద్ద పెద్ద కాలువ సుడి గుండాల నీరు వచ్చి గ్రామంమొత్తం ముంచెత్త కుండ ఉండాలి అని ఆ శివయ్య స్వామి ఇక్కడ లింగ రూపంలో దర్శనం ఇస్తారు. ఈ కాలువ ఈ ఆలయం నుంచి మూడు పాయలు గా మారి కొన్ని వందల కి.మీ ప్రయాణం చేస్తుంది. ఎంత పెద్ద వరద వచ్చిన ఈ శివలింగం మీద నుంచి మాత్రం నీరు వెళ్ళాదు.  శివరాత్రి రోజు రద్దీ అధికంగా ఉంటుంది. పూర్వం ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకొని మొక్కు తిరుచుకొని మట్టి రోడ్డు వేశారు. ఈ గ్రామ పెద్దలు వాళ్ళు పుట్టక ముందు నుంచే ఈ విగ్రహం అక్కడ ఉన్నది. ఇక్కడ శివ లింగం కి మన చేతులతో మనమే స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం ఉన్నది.  నూతనంగా తెలంగాణా సిఎం రేవంత్ రెడ్డి గారు కుడా ఈ భీమలింగాన్ని దర్శించుకున్నారు. ఈ స్వామి కి అభిషేకం చేసిన తరువాత స్వామి ని మన రెండు చేతులతో హత్తుకొంటె ఆ రెండు చేతులు ఒకదానికి ఒకటి కలిస్తే మారుసటి రోజే మరణించి ముక్తి ...

Sri Sai Baba Temple | Kondamadugu | Bhuvanagiri | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం తెలంగాణా లో అతి పెద్ద సాయిబాబా ఆలయం ఈ ఆలయం. ఈ దేవాలయాన్ని భువనగిరి జిల్లా కొండమడుగు అనే గ్రామంలో ఉన్నది. ఈ ఆలయం ఉప్పల్ నుంచి కేవలం 40కి.మీ దూరంలోను మరియు భువనగిరి వద్ద గల స్వర్ణగిరి ఆలయం  17.5 కి.మీ దూరంలో కలదు. యాదగిరి గుట్ట కి ఈ ఆలయం 28కి. మీ దూరంలోనే కలదు.  ఈ ఆలయం లోని సాయి బాబా బయటి విగ్రహం మనకి చాలా దూరం నుంచి దర్శనం ఇస్తారు. కింద మారియొక్క ఆలయం ఉన్నది. ఈ ఆలయం చాలా పెద్ద ఆలయం. ఆలయంలో ఒక్కటే సారి 150 నుంచి 250 మంది ధ్యాన్నం చేసుకునే అంతా పెద్ద ధ్యాన్న స్థలం కలదు. ఈ ఆలయంలో మనకి సాయి బాబా తో పాటు గా సాయి గణపతి , సాయి ఆంజనేయ స్వామి , సాయి రామ్ కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ రధసాయిబాబా ని కూడా దర్శించవచ్చు. ఆలయం లోపల చక్కటి బంగారు వర్ణంతో పెయింటింగ్ చూడవచ్చు. ప్రతి గురువారం రోజు మరియు ప్రత్యేక రోజులలో , పండుగ సమయంలో రద్దీ అధికంగా ఉంటుంది.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 12:30  మధ్యాన్నం : 12:30 నుంచి 04:30 బ్రేక్  సాయంత్రం : 04:30 నుంచి 07:45 వరకు  #Sri Sai Baba Temple  #Kondamadugu  #Bhuvanagiri  #...

Sri Venugopala Swamy Temple | Govardhanagiri | KPHB | Kuketpally | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయాన్ని ఇప్పుడు కొద్దిగా మార్పులు చేసి పునః నిర్మాణం చేయడం వల్ల నూతనంగా కనిపిస్తుంది కానీ చాలా పురాతన ఆలయం. ఈ ఆలయాన్ని మనం హైదరాబాద్ లోని కుక్కేట్ పల్లి వద్ద గల గోవర్ధన గిరి అనే గుట్ట మీద ఈ ఆలయం కలదు. ఈ ఆలయాన్ని సాయంత్రం సమయంలో చూడడం మనస్సుకి చాలా ఆనందగా ఉంటుంది. అందుకు అనగా సాయంత్రం సమయంలో దూరంలో ఉన్న పెద్ద పెద్ద అపార్ట్మెంట్ లు కూడా చిన్న చిన్నగా కనిపిస్తాయి మరియు సువిశాల నగరం కూడా చిన్నగా కనిపిస్తుంది.  ఈ ఆలయంలో 1988వ సం || శ్రీ కృష్ణుడి విగ్రహం ఇక్కడే లభించినది. మరియు ఈ గుట్ట పేరు కూడా గోవర్ధన గిరి అని పేరు తో ఉండడం వల్ల శ్రీ కృష్ణుడి ని ఇక్కడే ఆలయం నిర్మించినారు. ఈ ఆలయంలో మనకి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం కూడా దర్శనం చేసుకోవచ్చు.  ఇక్కడ ప్రతి సం || శ్రీ కృష్ణాష్టమి రోజున స్వామి వారికి జాతర నిర్వహించి ఊరేరిగింపు నిర్వహిస్తారు. ఈ ఆలయం పక్కనే చక్కటి పూల తోట మరియు గోశాల కూడా ఉన్నాయి. ఆలయం పక్కనే ధర్మ కార్యక్రమం చేసే పెళ్లి లు కోసం ఇక్కడ ఆలయం వారే పెళ్లి మండపం కూడా నిర్వహించారు.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 11:30  మధ్యాన్నం : 11:...

Swarna Shilpi Vivekananda Kali Temple | Narkhuda | Shamshabad | Hyderabad | Telangana

Image
  ఈ ఆలయం కేవలం 1 దశాబ్దం క్రితమే నిర్మించారు. ఈ ఆలయాన్ని నిర్మించడానికి 10 సం || ల సమయం పట్టినది. ఈ ఆలయం పూర్తిగా కలకత్తా లోని శ్రీ కాళిక దేవి ఆలయం వలె పోలి ఉంటుంది. ఎవరైనా కలకత్తా ఆలయాన్నికి వెళ్లలేని వాళ్ళు ఈ ఆలయాన్ని దర్శిస్తే చాలు . అక్కడి యలేనని చూసిన అనుభూతి కలుగుతుంది. చిరంజీవి గారి భోళా శంకర్ సినిమా కూడా ఇక్కడే చిత్రీకరణ జరిపినారు. ఆ సినిమాలో ఈ ఆలయాన్ని చక్కగా గమనించవచ్చు.  ఈ ఆలయం హైదరాబాద్ లోని నర్ఖుఢ అనే గ్రామంలో కలదు. శంషాబాద్ నుంచి 15 కి మీ దూరంలోను మరియు అక్కడ ఉన్న అమ్మాపల్లి ఆలయం నుంచి కేవలం 4కి. మీ దూరంలో కలదు. ఇక్కడ అమ్మవారు నల్లగా లోకానికి హాని చేస్తున్న వారిని సంహారం చేస్తూ లోకాన్ని కాపాడుతూ ఉంటుంది. ఈ ఆలయంలో మనకి మొదట శ్రీ గణపతి , శ్రీ శివయ్య ఆలయం , శ్రీ కాళిక దేవి ఆలయం , శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం , శ్రీ రాధ కృష్ణుడు ఆలయం , ఇతర ఉప ఆలయాలు కలవు. ఇక్కడ పిల్లలు అడుకోవడానికి విశాల ప్రాంతం కలదు. ప్రతి రోజు సాయంత్రం 07:00 గంటలకి హారతి ఇస్తారు. సాయంత్రం  సమయంలో ఈ ఆలయం చూడడం ఒక విశేషం. చక్కటి లైట్ ల మధ్యలో ఈ ఆలయం చాలా బాగా కనిపిస్తుంది.  ఆలయ దర్శన సమయం :...

Pahadi hanuman mandir | Mahendra Hills | Malkajgiri | Secunderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం కొంచం పాత ఆలయం. ఈ ఆలయాన్ని హైదరాబాద్ లోని సికింద్రాబాద్ వద్ద గల మల్కాజ్ గిరి వద్ద మహేంద్ర హీల్స్ వద్ద కలదు. ఈ ఆలయం చాలా పెద్ద ఆలయం. సాయంత్రం లేదా రాత్రి సమయం లో వస్తే ఈ ఆలయం చాలా బాగా కనిపిస్తుంది. ఈ ఆలయంలో మొదట మనకి శ్రీ గణపతి స్వామి దర్శనం చేసుకోవచ్చు.  ఈ ఆలయంలో ప్రధానంగా మనకి హనుమాన్ ఆలయం కలదు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అనగా ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి గుట్ట కింద కలదు. అందుకే ఈ ఆలయాన్ని పహాడీ హనుమాన్ మందిర్ అని పిలుస్తారు. ఈ ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామి తో పాటుగా శ్రీ దుర్గా దేవి కూడా గుట్ట కిందనే మనకి దర్శనం ఇస్తారు. వెనుక కనిపించే శివ విగ్రహం రాత్రి సమయంలో ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది. శ్రీ కృష్ణ భగవానుడు 7 రాత్రులు 7 పగలు గిరిని ఎత్తిన దృశ్యాని కూడా ఇక్కడ మనం గమనించవచ్చు.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 12:00  మధ్యన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్  సాయంత్రం : 04:30 నుంచి 08:30 వరకు  #Pahadi hanuman mandir  #Mahendra Hills  #Malkajgiri  #Secunderabad  #Hindu Temples Guide 

Sri Bugga Ramalingeshwara Swamy Temple | Vikarabad | Telangana | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఆంధ్ర లోని మహానంది లోని ముందు రెండు కోనేరు లోని నీరు ఎంత స్వచ్చంగా ఉంటుందో అలానే ఇక్కడ కూడా చాలా నీట్త్ గా కనిపిస్తుంది. ఈ ఆలయం హైదరాబాద్ నుంచి 70 కి.మీ దూరంలోని వికారాబాద్ వద్ద కలదు. ఈ ఆలయం చాలా ప్రశాంతమైన వాతావరణం లో ఉంటుంది.  పూర్వం శ్రీ రాముల వారు రావణాసురుడు చంపిన తరువాత ఆ పంచమహా దోషం పోగొట్టుకోవడానికి ఇక్కడ కూడా ఒక శివలింగం ప్రతిష్ట చేశారు. అప్పుడు శ్రీ రాముడు తన బాణంతో నీటిని పైకి తీయగా మొదట ఒక బూగ్గ వచ్చినది అని మరియు శ్రీ రాముల వారు ప్రతిష్ట చేయడం వల్ల శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంగా పిలుస్తారు. ఇక్కడ కొనేరులో ప్రతి రోజు నంది నోటిలో నుంచి నీరు వస్తూనే ఉంటుంది. ఆ నది నీరే ఇప్పటికి హైదరాబాద్ లో ప్రవహిస్తున్న మూసి నదీ. ఇది వికారాబాద్ లో పుట్టినది.  ఆలయ దర్శన సమయం :   ఉదయం : 06:30 నుంచి 12:00  మధ్యన్నం : 12:00 నుంచి 04:00 బ్రేక్  సాయంత్రం : 04:00 నుంచి 07:15  #Sri Bugga Ramalingeshwara Swamy Temple #Vikarabad #Telangana #Hindu Temples Guide