Parushauram temple | Jagadirgutta | Hyderabad | Hindu Temples Guide

 


ఈ ఆలయం చాలా సం || నుంచే కలదు. ఈ ఆలయాన్ని మనం హైదరబాద్ లోని జగ్గదిర్ గుట్ట ప్రధాన బస్ స్టాప్ నుంచి కేవలం 01 కి.మీ. దూరంలో కలదు. జగ్గదిర్ గుట్ట బస్ స్టాప్ నుంచి ఆటోలు ఈ ఆలయానికి చేరుకుంటాయి. ఈ ఆలయం ఒక గుట్ట మీద ఉంటుంది. ఇది కొంచం చిన్న ఆలయం. 

ఇలాంటి ఆలయాలు మనకి చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈ ఆలయంలో మనకి ప్రారంభంలోనే శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకోవచ్చు. ఆలయం లోపలికి వెళ్ళగానే పెద్ద కడప కనిపిస్తుంది. ఆది దాటుకొని వెల్లగానే ప్రధాన ఆలయం వరకు వెళ్లిపోవచ్చు. గండ్ర గొడ్డలితో శ్రీ పరశురామ స్వామి ని దర్శించుకోవచ్చు. ఇక్కడ ధ్యానం చేసే అలవాటు ఉన్న వారికి ఈ ఆలయం ఒక అద్భుతమైన ఆలయం. దర్శనం తరువాత ఆలయం బయటికి వచ్చిన తరువాత మనకి నవగ్రహ మండపం దర్శించుకోవచ్చు. పక్కనే శివాలయం కూడా ఉంటుంది. ఇక్కడ మన చేతులతో మనమే స్వయంగా స్వామి వారికి అభిషేకం చేసుకునే అవకాశం ఈ ఆలయం వారు కల్పిస్తున్నారు. 


ఆలయ దర్శన సమయం :

ఉదయం : 07:00 నుంచి 11:30 

మధ్యాన్నం : 11:30 నుంచి 05:00 బ్రేక్ 

సాయంత్రం : 05:00 నుంచి 07:45 వరకు 


#Parushauram temple #Jagadirgutta  #Hyderabad  #Hindu Temples Guide 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana