KALIKA Matha Temple | Miyapur | Hyderabad | Hindu Temples Guide

 

ఈ ఆలయం చాలా ప్రసిద్ది చెందిన ఆలయం. ఇక్కడ అమ్మ వారు కాళిక దేవి రూపంలో దర్శనం ఇస్తుంది. ఈ ఆలయం ప్రధాన రహదారి మీదనే ఉంటుంది. ఇక్కడ అమ్మవారు నల్ల రాతితో అమ్మవారిని చెక్కిన ఒక్కసారి అమ్మవారిని చూడగానే మనస్సు ఇట్టే పట్టేసుకుంటుంది. 

ఇక్కడ అమ్మవారి ముందు శివయ్య దర్శనం ఇస్తారు. వీటితో పాటు మనకి నాగ ప్రతిమలు మరియు శ్రీ ఆంజనేయ స్వామి , శని దేవుడు , దుర్గా దేవి , యామ ధర్మ రాజు , చిత్రగుప్తా , ఇతర ఆలయాలు కలవు. 

ఇక్కడ అమ్మవారికి ఆషాఢ మాసంలో బోనాలు సమర్పిస్తారు. ప్రతి మంగళవారం , శుక్రవారం , అదివారం  రద్దీ అధికంగా ఉంటుంది. దసరా రోజులలో నవరాత్రులలో ప్రత్యేక అమ్మవారికి విశేష అభిషేకాలు , అర్చన లు , పూజలు , హోమలు నిర్వహిస్తారు. ఇక్కడ అమ్మవారు పది చేతులతో పది పుర్రెలను పట్టుకొని నాలుక బయట పెట్టి భయంకర రూపంతో ఉంటుంది. చాలా మంది భకుట్లు అమ్మవారిని చూడగానే భయపడుతారు. అంతా ఉగ్ర రూపంతో ఉన్న ఆ రూపం అంతా లోక నాశనం చేసే చెడ్డవల్ల మీద తప్ప మన మీద కాదు అని తెలుసుకొని వెళితే అమ్మ తప్పకుండా అదరిస్తుంది. 


ఆలయ దర్శన సమయం :

ఉదయం : 06:00 నుంచి  11:30 

మధ్యాన్నం : 11:30 నుంచి 04:30 బ్రేక్ 

సాయంత్రం : 04:45 నుంచి 07:45 వరకు 


#KALIKA Matha Temple #Miyapur #Hyderabad Temples #Hindu Temples Guide 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana