Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide
ఈ ఆలయం హైదరాబాద్ లో దర్శించవలసిన ప్రముఖమైన అలయలలో ఈ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయం హైదరాబాద్ కి కేవలం 25కి. మీ దూరంలో గల రంగా రెడ్డి జిల్లా శంకరపల్లి అనే గ్రామంలో కలదు. ఈ దేవాలయాన్ని ముందు చిన్నగా నిర్మించిన కూడా ప్రస్తుతం చాలా పెద్దగా ఉంటుంది.
ఈ ఆలయం సరిగ్గా శబరిమల లోని అయ్యప్ప స్వామి ఆలయాన్ని పోలి ఉంటుంది. అక్కడ ఆడవారికి ప్రవేశం ఉండదు. కానీ ఈ ఆలయంలో ప్రవేశం ఉంటుంది. కానీ అంతరాలయం లోకి మాత్రం ఆడవారికి ప్రవేశం ఉండదు. కేవలం మగ వారు మాత్రమే వెళ్ళవచ్చు. ఈ ఆలయంలో మొదట గణపతి దర్శనం తర్వాత కింద రెండు ఉప ఆలయాలు ఉన్నాయి. ఆ ఆలయాల దర్శనం తరువాత 18 మెట్లు ఎక్కి పైన ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి దర్శనం కొరకు వెళ్ళాలి. స్వామి దర్శనం తరువాత మనస్సు కి చాలా ప్రశాంతత లభించిన అనుభూతి కలుగుతుంది. నవెంబర్ , డిసెంబర్ , జనవరి లో అయ్యప్ప స్వామి భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఈ 3 నెలల పాటు ఆన్నదాన ప్రసాద వితరణ కూడా జరుగుతుంది.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి 11:30
మధ్యాన్నం : 11:30 నుంచి 05:00 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 08:00 వరకు
జనవరి 1 వ తేదీన మరియు సంక్రాంతి పండుగల సమయంలో మరియు వివిధ ప్రత్యేక రోజులలో రద్దీ అధికంగా ఉన్న రోజులలో దర్శన సమయంలో మార్పులు గమనించగలరు. కేవలం సంప్రదాయ దుస్తులలో మాత్రమే అనుమతి ఇవ్వబడును.
#Ayyappa Swamy Temple #Shankarpally #Hyderabad #Hindu Temples Guide

Comments
Post a Comment