Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయానికి సుమారు 1000 సం || కంటే పూర్వం నుంచే ఇక్కడ ఈ ఆలయం ఉండేది. ఈ దేవాలయం హైదరాబాద్ నుంచి 45కి. మీ దూరంలోను మరియు హైదరాబాద్ బోర్డర్ ఐన పటాన్ చెరువు కి కేవలం 10 కి. మీ దూరంలో ఉంటుంది. ఈ ఆలయానికి మొదలు దారిలో ఒక చిన హనుమాన్ ఆలయం వస్తుంది. అందరూ అదే ఈ ఆలయం అని అనుకుంటున్నారు. కానీ అది దాటి ఇంకా కొంచం ముందకు వస్తే ఈ ఆలయం కనిపిస్తుంది.
ఈ ఆలయం ప్రారంభంలోనే మనకి 10 తలలతో వీరభద్ర స్వామి ఒక గుట్టలో నుంచి బయటికి వచ్చినటు కనిపిస్తారు. తరువాత ఆలయం ప్రారంభం వద్ద ఒక పెద్ద రాతి తో నిర్మించిన ధ్వజ స్తంభం కనిపిస్తుంది. తరువాత పెద్ద రాతి తో నిర్మించిన శిలా తోరణం కనిపిస్తుంది. ఈ పైన ఫోటోలో శిలా తోరణంని దర్శించవచ్చు. తరువాత పక్కనే శివలింగం కనిపిస్తుంది. ఇక్కడి నుంచి ప్రధాన ఆలయం లోపలికి వెళితే కాశీ నుంచి తీసుకొని వచ్చిన శివలింగం దర్శించుకోవచ్చు. ఈ ఆలయం చాలా పాతది ఐనప్పటికి ఇప్పటి కాలానికి అనుగుణంగా మార్పులు చేశారు. పక్కనే పెద్ద కాలువ ప్రవహిస్తూ ఉంటుంది.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్
సాయంత్రం : 04:30 నుంచి 07:30
శివరాత్రి రోజు మరియు ఇతర ముఖ్యమైన పండుగలలో రద్దీ చాలా అధికంగా ఉంటుంది. భక్తులు ఆ సమయం లలో దర్శన సమయం లో మార్పులు ఉంటాయి గమనించగలరు.
#Sri Indreshwara Swamy Temple #Indresham Village #Hyderabad #Telangana

Comments
Post a Comment