Swarna Shilpi Vivekananda Kali Temple | Narkhuda | Shamshabad | Hyderabad | Telangana

 


ఈ ఆలయం కేవలం 1 దశాబ్దం క్రితమే నిర్మించారు. ఈ ఆలయాన్ని నిర్మించడానికి 10 సం || ల సమయం పట్టినది. ఈ ఆలయం పూర్తిగా కలకత్తా లోని శ్రీ కాళిక దేవి ఆలయం వలె పోలి ఉంటుంది. ఎవరైనా కలకత్తా ఆలయాన్నికి వెళ్లలేని వాళ్ళు ఈ ఆలయాన్ని దర్శిస్తే చాలు . అక్కడి యలేనని చూసిన అనుభూతి కలుగుతుంది. చిరంజీవి గారి భోళా శంకర్ సినిమా కూడా ఇక్కడే చిత్రీకరణ జరిపినారు. ఆ సినిమాలో ఈ ఆలయాన్ని చక్కగా గమనించవచ్చు. 

ఈ ఆలయం హైదరాబాద్ లోని నర్ఖుఢ అనే గ్రామంలో కలదు. శంషాబాద్ నుంచి 15 కి మీ దూరంలోను మరియు అక్కడ ఉన్న అమ్మాపల్లి ఆలయం నుంచి కేవలం 4కి. మీ దూరంలో కలదు. ఇక్కడ అమ్మవారు నల్లగా లోకానికి హాని చేస్తున్న వారిని సంహారం చేస్తూ లోకాన్ని కాపాడుతూ ఉంటుంది. ఈ ఆలయంలో మనకి మొదట శ్రీ గణపతి , శ్రీ శివయ్య ఆలయం , శ్రీ కాళిక దేవి ఆలయం , శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం , శ్రీ రాధ కృష్ణుడు ఆలయం , ఇతర ఉప ఆలయాలు కలవు. ఇక్కడ పిల్లలు అడుకోవడానికి విశాల ప్రాంతం కలదు. ప్రతి రోజు సాయంత్రం 07:00 గంటలకి హారతి ఇస్తారు. సాయంత్రం  సమయంలో ఈ ఆలయం చూడడం ఒక విశేషం. చక్కటి లైట్ ల మధ్యలో ఈ ఆలయం చాలా బాగా కనిపిస్తుంది. 


ఆలయ దర్శన సమయం : 

ఉదయం : 08:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్ 

సాయంత్రం : 05:00 నుంచి 08:00 


#Swarna Shilpi Vivekananda Kali Temple  #Narkhuda  #Shamshabad  #Hyderabad  #Telangana 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana