Sri Renuka Yellamma Temple | Karnanpalli | Medak | Telangana
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం లోని అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు. ఇక్కడ అమ్మవారు స్వయంభూ అమ్మవారు. ఈ ఆలయాన్ని మనం హైదరాబాద్ నుంచి మొదట మెదక్ వద్ద గల కారాన్న్ పల్లి గ్రామంలో ఉన్నది. ఈ ఆలయం హైదరాబాద్ నగర బోర్డర్ వద్ద కలదు. ఈ ఆలయం హైదరాబాద్ నుంచి సుమారు 85 కి. మీ దూరంలో ఉన్నది.
ఈ ఆలయంలో అమ్మవారు చాలా పెద్ద విగ్రహం తో ఉంటారు. ఈ గ్రామం చుట్టూ పక్కల నుంచే కాకుండా వివిధ గ్రామాల నుంచి కూడా అమ్మవారి దర్శనం కోసం వస్తారు. అమ్మవారి ఎదురుగా ఒక పుట్ట ఉంటుంది. అక్కడ కూడా అమ్మవారు ఉంటారు. ఆ పుట్టలోనే పాముని కూడా అమ్మవారి స్వరూపం గా భావిస్తారు. పిల్లల కోసం ఇక్కడ నాగదేవతకు పూజలు ఎక్కువ చేస్తారు. ఎదురుగా శ్రీ మాతా ఆలయం కూడా ఉంటుంది. ప్రధాన ఆలయంలో అమ్మవారి పరివారం అంతా ఉంటుంది. కొద్దిగా రాష్ లేని సమయంలో లోపల అంతా చూడవచ్చు. ప్రతి ఆదివారం , మంగళవారం , శుక్రవారం రోజులలో రద్దీ చాలా ఎక్కువగ ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి జాతర కూడా జరిపిస్తారు. అప్పుడు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 04:45 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 07:45 వరకు
#Sri Renuka Yellamma Temple #Karnanpalli #Medak #Telangana

Comments
Post a Comment