Hari Hara Devalayam | Nagisheety Palli | Shamerpet | Telangana | Hindu Temples Guide
ఈ ఆలయం నూతనంగా నిర్మించిన ఆలయం కానీ పూర్వం ఇక్కడ చాలా చిన్న ఆలయం ఉన్నది అని ఇక్కడి వల్ల మాట. ఈ ఆలయం లో మనకి చాలా విశేషాలు కనిపిస్తాయి. ఈ ఆలయం తెలంగాణా లోని షామీర్ పేట లోని నాగిశెట్టి పల్లి గ్రామంలో కలదు. బయటి నుంచి చిన్నగా కనిపించిన లోపల మాత్రం కొంచం పెద్దగానే కనిపిస్తుంది. ఈ ఆలయం పూర్తిగా రాతితో నిర్మించారు.
ఈ ఆలయంలో ప్రధానంగా శ్రీ సీతరామ లక్ష్మణ స్వామి మరియు పక్కనే శ్రీ శివయ్య తండ్రి మరియు తల్లి పార్వతి దేవి దర్శనం చేసుకోవచ్చు. మరియు మనకి మొదట ఆలయంలో ప్రవేశించగానే రెండు రాతి ధ్వజ స్తంబలు కనిపిస్తాయి. పైన ఫోటోలో గమనించవచ్చు. మరియు ఈ ఆలయంలో ప్రత్యేకత మనం సాధారణంగా శ్రీ రామల వారికి ఎదురుగా శ్రీ ఆంజనేయ స్వామి ని దర్శించుకుంటాము. కానీ ఈ ఆలయంలో మాత్రం పక్కనే ప్రత్యేక ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామిని చూడవచ్చు. మరియు ఈ ఆలయంలో మనకి యగశాల కూడా చూడవచ్చు. వీటితో పాటుగా మనం నవగ్రహ మండపం కూడా చూడవచ్చు. ఆలయం చూడడానికి కొంచం చిన్నగా ఉన్న కూడా ఎంతో ప్రశాంతమైనా వాతావరణం మనం చూడవచ్చు. ప్రతి సం || శ్రీ రామ నవమి మరియు శివరాత్రి సమయంలలో రద్దీ అధికంగా ఉంటుంది.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి 11:45
మధ్యాన్నం : 12:00 నుంచి 04:45 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 07:45 వరకు
#Hari Hara Devalayam #Nagisheety Palli #Shamerpet #Telangana

Comments
Post a Comment