Someshwar Temple | Someshwarwada | Sangareddy | Hindu Temples Guide

 


ఈ ఆలయం చాలా శక్తివంతమైన ఆలయం. ఈ ఆలయాన్ని మనం దర్శించుకోవాలి అంటే 6 నెలలు వైట్ చేయాలి. ఎలాగ ఐతే కేదారేశ్వర స్వామి ఆలయం కేదారనాథ్ లో 6 నెలలు మంచుతో  కప్పి ఉండడం వల్ల 6 నెలలు ఆలయం దర్శనం అపుతారో ఈ ఆలయం కూడా 6 నెలలు నీతో నిండి మునిగి ఉంటుంది ఈ ఆలయం. వర్ష కాలం లో చూస్తే అస్సలు ఇక్కడ ఆలయం ఉన్నది అని కూడా మనకు అనిపించదు. ఈ ఆలయం తెలంగాణా లోని సంగారెడ్డి వద్దగల సోమేశ్వర ఆలయం ఈ దేవాలయం పేరు. చాలా చిన్న ఆలయం. 

ఈ ఆలయాన్ని చలి మరియు ఎండ కాలంలో మాత్రమే దర్శించుకుంటాం. ఇక్కడ ప్రధాన దేవత మూర్తి మహా శివుడు. 6 నెలలులో  ప్రతి స్వామీ వారికి అభిషేకం చేస్తారు. ఇక్కడ ప్రక్కనే కోనేరు ఉన్నది. మన దేశాన్ని ముస్లింలు పరిపాలించే సమయంలో ఇక్కడ చాల విగ్రహాలు మరియు నంది విగ్రహాలని ధ్వంసం చేశారు. ఇక్కడ చాలా రాతి శాసనాలు కూడా మనం గమనించవచ్చు. ఈ శాసనాల ప్రకారం ఈ ఆలయం కాకతీయుల కాలం నాటిది అని చెప్పవచ్చు. ఈ ఆలయం లో శివుడు ఇక్కడ చాలా ప్రసిద్దమైన దేవుడు. తప్పకుండా ఎటువైపు వస్తే అందరూ దర్శించుకోవాలి. 

ఆలయ దర్శన సమయం : 

ఉదయం : 06:00 నుంచి 11: 00 

మధ్యాన్నం : 11:00 నుంచి 05:00 బ్రేక్ 

సాయంత్రం : 05:00 నుంచి 07:30 

వర్ష కాలం మరియు ఇతర పండుగలు మరియు గ్రహణ సమయంలో దర్శన సమయంలో మార్పులు ఉంటాయి. 


#Someshwar Temple  #Someshwarwada #Sangareddy #Hindu Temples Guide 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana