Sri Lakshmi Narasimha Swamy Temple | Mamillapalli | Telangana | Hindu Temples Guide

 


ఈ ఆలయం చాల పురాతన ఆలయం. ఈ దేవాలయంలో స్వామి స్వయంభూ స్వామి. ఈ ఆలయం 11వ శతాబ్దం కి చెందిన ఆలయం. హైదరాబాద్ నుంచి ఈ దేవాలయం సుమారు 120 కి. మీ దూరంలో ఉంటుంది. ఈ ఆలయం లో వెలిసిన స్వామి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి. 

ఈ ఆలయం లో పూర్వం ఇక్కడ ఒక పొలం ఉండేది. ఒక వ్యక్తి తన పొలం లో సాగు చేస్తూ ఉండగా తన నాగలి కి స్వామి విగ్రహం తగిలి చప్పుడు అవ్వడం తో చూడగానే స్వామి విగ్రహం కొంచం మాత్రమే కనిపించినది. ఈ విషయం అందరికీ చెప్పగానే అందరూ మరుసటి రోజు విగ్రహానికి ఎటువంటి హాని కలగకుండా బయటికి తీశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరియు ప్రతి రోజు ఇక్కడ స్వామి అభిషేకాలు పూజలు జరుగుతాయి. ఇక్కడ వారం రోజుల పాటు దివ్యమైన జాతర జరుగుతుంది. జాతర చివరి రోజున గిత్తలు , ఆవుల బండ్ల పోటీలు , ఊరేగింపులు , స్వామి వారి యాత్ర జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి రోజు రద్దీ అధికంగా ఉంటుంది. 

ఆలయ దర్శన సమయం : 

ఉదయం : 06:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్ 

సాయంత్రం : 05:00 నుంచి 07:45 వరకు 

ప్రత్యేక రోజులలో మరియు పండుగలలో , జాతర సమయంలలో ఆలయ దర్శన సమయంలలో మార్పులు ఉంటాయి. 


#sri lakshmi narasimha swamy temple #mamillapalli #telangana 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana