Naina Gullu Caves | Adavi Somanpalli | Jayashankar Bhupalapalli | Telangana
ఇది చాలా పురాతన ప్రాంత ఆలయం. ఇక్కడ ఆది మానవుల కాలం నాటి శిలలు మరియు వారు నిర్మించుకున్న సహజ సిద్ద గుహలు ఇప్పటికి మనం దర్శించవచ్చు. ఈ ప్రాంతం తెలంగాణాలోని జయశంకర భూపాలపల్లి మానేరు అడువులలో నైనా గుహలు అడవి సోమనపల్లి వద్ద కలవు. హైదరాబాద్ నుంచి ఈ ప్రాంతానికి సుమారు 260కి. మీ దూరంలో ఈ గుహలు కలవు.
ఇక్కడ వారు అడవి జంతువుల భారీ నుంచి తప్పించుకోవడానికి రాళ్ళను ఏవిధంగా ఉపయోగించుకున్నారో ఇప్పటికి వాటి ఆయుధాల చిన్న చిన్న ముక్కలను గమనించవచ్చు. మరియు పక్కనే మానేరు నది ప్రవాహం కూడా చూడవచ్చు. ఇది చాలా లోపలికి ఉంటుంది. వీటిని చూడాలి అనే చాలా ధైర్యం కావాలి. దానికి కారణం చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం కనీసం మంచి నీరు కూడా ఇవ్వడానికి అక్కడ ఎవరు ఉండరు. ఆది మానవుల తరువాత కొందరు రాజులు వీటిని స్వాధీనం చేసుకొని కొన్ని సం || వారి రహస్య స్థావరాలుగా ఉపయోగించుకున్నారు అని చరిత్ర. తరువాత వీటిని అన్నలు కూడా ఉపయోగించుకున్నారు. ఇప్పడు ఇక్కడ ఎవ్వరూ లేకపోవడం వల్ల శిధిలావస్థకి చేరుకున్నది. ట్రెక్కింగ్ చేయాలి అని అనుకునే వారికి ఈ ప్రాంతం ఒక అద్భుతం. కొత్త ధనం కోరుకునే వారికి ఇది మంచి ప్రాంతం.
దర్శన సమయం
ఉదయం : 07:00 నుంచి సాయంత్రం 05:00
#Naina Gullu Caves #Adavi Somanpalli #Jayashankar Bhupalapalli #Telangana

Comments
Post a Comment