Pahadi hanuman mandir | Mahendra Hills | Malkajgiri | Secunderabad | Hindu Temples Guide
ఈ ఆలయం కొంచం పాత ఆలయం. ఈ ఆలయాన్ని హైదరాబాద్ లోని సికింద్రాబాద్ వద్ద గల మల్కాజ్ గిరి వద్ద మహేంద్ర హీల్స్ వద్ద కలదు. ఈ ఆలయం చాలా పెద్ద ఆలయం. సాయంత్రం లేదా రాత్రి సమయం లో వస్తే ఈ ఆలయం చాలా బాగా కనిపిస్తుంది. ఈ ఆలయంలో మొదట మనకి శ్రీ గణపతి స్వామి దర్శనం చేసుకోవచ్చు.
ఈ ఆలయంలో ప్రధానంగా మనకి హనుమాన్ ఆలయం కలదు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అనగా ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి గుట్ట కింద కలదు. అందుకే ఈ ఆలయాన్ని పహాడీ హనుమాన్ మందిర్ అని పిలుస్తారు. ఈ ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామి తో పాటుగా శ్రీ దుర్గా దేవి కూడా గుట్ట కిందనే మనకి దర్శనం ఇస్తారు. వెనుక కనిపించే శివ విగ్రహం రాత్రి సమయంలో ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తుంది. శ్రీ కృష్ణ భగవానుడు 7 రాత్రులు 7 పగలు గిరిని ఎత్తిన దృశ్యాని కూడా ఇక్కడ మనం గమనించవచ్చు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి 12:00
మధ్యన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్
సాయంత్రం : 04:30 నుంచి 08:30 వరకు
#Pahadi hanuman mandir #Mahendra Hills #Malkajgiri #Secunderabad #Hindu Temples Guide

Comments
Post a Comment