Bheema Lingeshwara Swami Temple | Sangam | Yadadri | Bhuvanagiri | Hindu Temples Guide

 


ఇది ఒక్క విచిత్రమైన ఆలయం. కానీ ఇక్కడ శివయ్య కి మాత్రం ఆలయం ఉండదు. కానీ అందరూ మాత్రం భీమలింగేశ్వర ఆలయం అని అంటారు. ఈ ఆలయాన్ని తెలంగాణా లోని భువనగిరి జిల్లా సంగం అనే గ్రామంలో ఈ ఆలయం శతాబ్దాల నుంచి ఉన్నది. 

సంగం అనే గ్రామం వద్ద పెద్ద కాలువ సుడి గుండాల నీరు వచ్చి గ్రామంమొత్తం ముంచెత్త కుండ ఉండాలి అని ఆ శివయ్య స్వామి ఇక్కడ లింగ రూపంలో దర్శనం ఇస్తారు. ఈ కాలువ ఈ ఆలయం నుంచి మూడు పాయలు గా మారి కొన్ని వందల కి.మీ ప్రయాణం చేస్తుంది. ఎంత పెద్ద వరద వచ్చిన ఈ శివలింగం మీద నుంచి మాత్రం నీరు వెళ్ళాదు. 

శివరాత్రి రోజు రద్దీ అధికంగా ఉంటుంది. పూర్వం ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకొని మొక్కు తిరుచుకొని మట్టి రోడ్డు వేశారు. ఈ గ్రామ పెద్దలు వాళ్ళు పుట్టక ముందు నుంచే ఈ విగ్రహం అక్కడ ఉన్నది. ఇక్కడ శివ లింగం కి మన చేతులతో మనమే స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశం ఉన్నది. 

నూతనంగా తెలంగాణా సిఎం రేవంత్ రెడ్డి గారు కుడా ఈ భీమలింగాన్ని దర్శించుకున్నారు. ఈ స్వామి కి అభిషేకం చేసిన తరువాత స్వామి ని మన రెండు చేతులతో హత్తుకొంటె ఆ రెండు చేతులు ఒకదానికి ఒకటి కలిస్తే మారుసటి రోజే మరణించి ముక్తి లభిస్తుంది అని భక్తుల నమ్మకం. మరియు ఇంకొక  కథ కూడా ప్రాచుర్యం లో ఉన్నది. పూర్వం భీముడు ఈ శివ లింగన్ని ఇక్కడ ప్రతిష్ట చేశారు అని ఆయన అభిషేకం చేసి అప్పుడు స్వామిని హత్తు కున్నారు అని అలా ఈ సంప్రదాయం అప్పటి నుంచే ఉన్నది అని అంటారు. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 07:00 నుంచి 12:00 

మధ్యాన్నం :12:00 నుంచి 03:45 బ్రేక్ 

సాయంత్రం : 03:45 నుంచి 07:00 


#Bheema Lingeshwara Swami Temple  #Sangam  #Yadadri #Bhuvanagiri  #Hindu Temples Guide 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana