Hanuman Temple | Vivekanada Nagar | Kuketpally | Hyderabad | Hindu Temples Guide
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం హైదరాబాద్ లోని కుకెట్పల్లి వివేకానందా నగర్ కాలనీ ప్రధాన రోడ్డు నుంచి కొంచం 1కి. మీ దూరంలోనే ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయానికి సరియైన పార్కింగ్ సౌకర్యం లేదు. కనీసం ద్విచక్రం బండి నిలపడానికి కూడా సౌకర్యం లేదు. కానీ ఆలయం పెద్దగానే ఉంటుంది.
ఈ ఆలయంలో ప్రధాన ఆకర్షణ హనుమాన్ విగ్రహం. ఈ హనుమాన్ విగ్రహం 64 అడుగుల ఎత్తులో ఉంటుంది. మరియు ఈ ఆలయంలో శ్రీ సీత రామచంద్ర స్వామి లక్ష్మణ స్వామి కూడా ఉంటారు. శ్రీ రామాయణం సమయంలో జరిగిన ప్రతి సన్నివేశం ఇక్కడ చూపించబడుతుంది. ప్రతి సం || ఈ ఆలయంలో శ్రీ రామ నవమి మరియు హనుమాన్ జయంతి చాలా వైభవంగా నిర్వహిస్తారు. కుకెట్ పల్లిలో తప్పకుండా చూడవలసిన ఆలయాలలో ఈ ఆలయం ఒకటి.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి 11:45
మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 08:00
#Hanuman Temple #Vivekanada Nagar #Kuketpally #Hyderabad #Hindu Temples Guide

Comments
Post a Comment