Sri Nagadevatha Devalayam Temple | Tirumalagiri | Secunderabad | Hyderabad
ఈ ఆలయం చాలా ప్రసిద్ద ఆలయం. ఎవరికి ఐతే నాగదోషం, సర్ప దోషం వంటివి ఉంటారో వారికి ఈ ఆలయం ఖచ్చితంగా దర్శించాలి. ఈ ఆలయం తెలంగాణా లోని సికింద్రాబాద్ వద్ద గల తిరుమలగిరి గ్రామంలో శ్రీ నాగదేవత దేవాలయం పేరుతో ఈ ఆలయం ఉన్నది.
ఈ ఆలయంలో శ్రీ నాగదేవత, శ్రీ నారాయణస్వామి , శ్రీలశ్రీజయలక్ష్మి , శ్రీ శశి అమ్మ , గురుస్థానం తో ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయం సుమారు బ్రిటిష్ కాలం నాటి నుంచి ఉన్నది అని చరిత్ర. పూర్వం బ్రిటిష్ వారు ఈ ఆలయం పక్కేన ఉన్న రోడ్డు మార్గం నుంచి వెళుతూ తీరిగీ సాయంత్రం వచ్చే సమయంలో మార్గం మధ్యలో ఈ ఆలయం గురించి చర్చ జరిపి ఈ ఆలయని ధ్వంసం చేయాలి అని వ్యూహ రచన చేశారు. కానీ ఇక్కడ అమ్మవారికి కోపానికి వారు ఆలయ గెట్ వద్దకి రాగానే అందరూ కళ్ళు తిగిరి పడిపోయారు. ఆ రోజు నుంచి వాళ్ళు మళ్ళీ ఈ ఆలయం గురించి చర్చ జరుపలేదు. పిల్లలు లేని వారు ఈ ఆలయంలో మొక్కుకొని అమ్మవారిని మనస్సు పూర్తిగా మొక్కుకొని విగ్రహ ప్రతిష్ట చేస్తే వాళ్ళకి పిల్లలు కలుగుతారు అని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో శివాలయం మరియు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంటాయి.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 07:30
ప్రత్యేక రోజులలో మరియు పండుగ సమయంలలో ఈ ఆలయ దర్శన సమయంలో మార్పులు ఉంటాయి. ఇది భక్తులు గమనించగలరు.
#Sri Nagadevatha Devalayam Temple #Tirumalagiri #Secunderabad

Comments
Post a Comment