Sri Venugopala Swamy Temple | Govardhanagiri | KPHB | Kuketpally | Hyderabad

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయాన్ని ఇప్పుడు కొద్దిగా మార్పులు చేసి పునః నిర్మాణం చేయడం వల్ల నూతనంగా కనిపిస్తుంది కానీ చాలా పురాతన ఆలయం. ఈ ఆలయాన్ని మనం హైదరాబాద్ లోని కుక్కేట్ పల్లి వద్ద గల గోవర్ధన గిరి అనే గుట్ట మీద ఈ ఆలయం కలదు. ఈ ఆలయాన్ని సాయంత్రం సమయంలో చూడడం మనస్సుకి చాలా ఆనందగా ఉంటుంది. అందుకు అనగా సాయంత్రం సమయంలో దూరంలో ఉన్న పెద్ద పెద్ద అపార్ట్మెంట్ లు కూడా చిన్న చిన్నగా కనిపిస్తాయి మరియు సువిశాల నగరం కూడా చిన్నగా కనిపిస్తుంది. 

ఈ ఆలయంలో 1988వ సం || శ్రీ కృష్ణుడి విగ్రహం ఇక్కడే లభించినది. మరియు ఈ గుట్ట పేరు కూడా గోవర్ధన గిరి అని పేరు తో ఉండడం వల్ల శ్రీ కృష్ణుడి ని ఇక్కడే ఆలయం నిర్మించినారు. ఈ ఆలయంలో మనకి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం కూడా దర్శనం చేసుకోవచ్చు. 

ఇక్కడ ప్రతి సం || శ్రీ కృష్ణాష్టమి రోజున స్వామి వారికి జాతర నిర్వహించి ఊరేరిగింపు నిర్వహిస్తారు. ఈ ఆలయం పక్కనే చక్కటి పూల తోట మరియు గోశాల కూడా ఉన్నాయి. ఆలయం పక్కనే ధర్మ కార్యక్రమం చేసే పెళ్లి లు కోసం ఇక్కడ ఆలయం వారే పెళ్లి మండపం కూడా నిర్వహించారు. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 07:00 నుంచి 11:30 

మధ్యాన్నం : 11:30 నుంచి 04:30 బ్రేక్ 

సాయంత్రం : 04:30 నుంచి 07:45 వరకు 


#Sri Venugopala Swamy Temple #Govardhanagiri #KPHB #Kuketpally #Hyderabad #Hindu Temples Guide

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana