Prasanna Venkateswara Swamy Temple | Anjaneya Nagar | AGI Colony | Moosapet | Hyderabad
ఈ దేవాలయం చాలా ప్రసిద్దమైన ఆలయం. ఇక్కడ స్వామి పేరు శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి దేవలాయం అనే పేరు మీద ఈ ఆలయం ఉన్నది. ఈ దేవలయాన్నికి చేరుకోవడం చాలా సులువు. హైదరాబాద్ లోని మోసాపేట ఆంజనేయ నగర్ ఏఐజి కాలనీ వద్ద ఉంటుంది. ఇక్కడ స్వామి వారికి ప్రత్యేకంగా అభిషేకం చేసే సమయంలో చూస్తే చాలా బాగా కనిపిస్తారు.
ఈ ఆలయంలోని స్వామి వారిని అలా చూస్తూ ఉండిపోవచ్చు. స్వామి వారి మనోహర రూపం సరిగ్గా తిరుపతిలో స్వామి ని దర్శించుకున్న అనుభూతి కలుగుతుంది. మొదట ఈ దేవలాయం చాలా చిన్నగా ఉండేది. భక్తుల సహకారం అందురు కలిసి ఈ దేవలయాన్ని అభివృద్ది చేస్తున్నారు. ఇప్పడు ఆలయ కొంచం పెద్దగానే ఉన్నది. ఇంతకు ముందు స్వామి వారు రేకుల ఆలయంలో ఉండేవారు. ఇప్పుడు చక్కగా పెద్ద ఆలయం నిర్మించుకున్నారు. వైకుంఠ ఏకాదశి , శనివారం , ఉగాది , ఇతర పండుగలలో రద్దీ అధికంగా ఉంటుంది.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 11:30
మధ్యాన్నం : 11:30 నుంచి 05:30 బ్రేక్
సాయంత్రం : 05:30 నుంచి 08:00 వరకు
#Prasanna Venkateswara Swamy Temple, #Anjaneya Nagar, #AGI Colony, #Moosapet, #Hyderabad

Comments
Post a Comment