Sri Sri Sri Kedareshwara Temple | Padamashali Puram | Kattedan | Rajendhra Nagar | Hyderabad

 

ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయాన్ని సుమారు 30 సం || క్రితం నుంచే ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయం హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ వద్ద గల పద్మశాలి పురం గ్రామం లో ఉన్నది. ఇక్కడ శివలింగం శ్రీ శ్రీ శ్రీ కేదారేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయం ప్రక్కనే ప్రతి సం || ఒక కమిటీ సభ్యులు వినయక చవితి రోజున గణపతి స్వామి వారిని కూడా పెట్టి 9 రోజులు పూజలు , సాంస్కృతిక కార్యక్రమాలు , పిల్లలతో భరతనాట్యం వంటి కార్యక్రమాలు నిర్వహించి పిల్లలకి ప్రైజ్ లు కూడా ఇస్తారు. 

ఈ ఆలయం చాలా చిన్న ఆలయం. ఒక కొండ మీద ఉంటుంది. చిన్న ఆలయం ఐన కూడా చాలా శక్తివంతమైన ఆలయం. అందుకే ఇక్కడ ఈ ఆలయంలో నూతనంగా పెళ్లి చేసుకునే వారికి కూడా ఇక్కడ సౌకర్యం ఉన్నది. 27 సం || క్రితం ఈ ప్రాంతం అంతా రాళ్ళతో పెద్ద పెద్ద చెట్లతో ఉండేది. ఇక్కడి గ్రామ వాసులు అందరూ కలిసి దిన దినాభివృద్ది చేస్తూ ఆలయ అభూవృద్ది కి తొడపడుతూ అందరూ కలిసి కట్టుగా ఆలయ పనులలో పలుపంచుకుంట్టు అభివృద్ది కి వారివంతు సహాయం చేస్తున్నారు. ఇక్కడి నుంచి చాలా మంది మాఘ మాసంలో అనగా శివరాత్రి కి ముందు స్వామి దర్శనం చేసుకొని పాద యాత్రగ వెళ్ళి వారు మరియు కొందరు బస్ లలో ఇతర ప్రైవేట్ వహణాలలో శ్రీశైలం కి చేరుకుంటారు. శివరాత్రి వస్తే ఇక్కడ రద్దీ చాలా అధికంగా ఉంటుంది. మరియు ప్రతి సోమవారం మరియు శుక్రవారం భక్తులు అధికంగా వస్తారు. ఇక్కడ మాన చేతులతో మనమే స్వయంగా స్వామి వారికి అభిషేకం చేసుకునే అవకాశం ఈ ఆలయం వారు కల్పిస్తున్నారు. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 07:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 04:45 బ్రేక్

సాయంత్రం : 05:00 నుంచి 07:45  

ప్రత్యేక రోజులలో మరియు పండుగలలో ఆలయ దర్శన సమయంలలో మార్పులు చేస్తారు. గమనించగలరు. ఇక్కడ ద్వి చక్ర , త్రీ చక్ర , బస్ లాంటి పెద్ద బండ్లు కూడా పార్కింగ్ చేసుకోవచ్చు. 


#sri sri sri kedareshwara temple #padamashali puram #rajendhra nagar #hyderabad

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana