Sri Veerabadra Swamy | Bonthapally | Hyderabad | Hindu Temples Guide

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయంలో మనకి శివుడు వీరభద్ర స్వామిగా మరియు అమ్మవారు శ్రీ భద్రకాళి గా దర్శనం ఇస్తారు. ఈ ఆలయం హైదరాబాద్ నుంచి 35 కి.మీ దూరంలో బొంతపల్లి అనే గ్రామంలో కలదు. ఈ ఆలయం చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ చాలా పెద్ద ద్వి చక్ర , త్రీ చక్ర , మరియు బస్ , కార్ వంటి వాహనాలు కూడా ఇక్కడ పార్కింగ్ చేసుకునే సౌకర్యం కలదు. 

ఈ ఆలయం పూర్వం ఒక వ్యక్తి కి నడుచుకుంటూ వెళుతూ ఉండగా అతనిని ఎవరు వెనుక నుంచి పిలిచి నట్టు అనిపించగానే వెనుకకి తీరిగీ చూసాడు. కానీ అక్కడ ఎవరు లేరు. మరుసటి రోజు సరిగ్గా ఇలానే జరిగినది. ఈ విషయం అందరికీ చెప్పగా అందరూ వచ్చి చూశారు. తాను చెప్పిన చోట తవ్వి చూడగా ఇక్కడ స్వామి భూమి లోపల నుంచి విగ్రహాన్ని తీసి మరి యొక్క చుట్టుకి తరలించి పెద్ద ఆలయం నిర్మించారు. ఇక్కడ శివలింగం కూడా ఉన్నది. మరియు పెద్ద కోనేరు కూడా ఉన్నది. శివరాత్రి మరియు సోమవారం రోజు మరియూ శుక్రవారం రోజు అధిక రద్దీ ఉంటుంది. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 07:00 నుంచి 12:30 

మధ్యాన్నం : 12:30 నుంచి 04:30 బ్రేక్ 

సాయంత్రం : 04:30 నుంచి 07:30 వరకు 

పండుగలు మరియు ప్రత్యేక పూజలు , ప్రత్యేక అభిషేకాలు , గ్రహాల సమయంలలో ఆలయ దర్శన సమయంలలో మార్పులు ఉంటాయి. భక్తులు గమనించగలరు. 


#Sri Veerabadra Swamy  #Bonthapally  #Hyderabad  #Hindu Temples Guide 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

KALIKA Matha Temple | Miyapur | Hyderabad | Hindu Temples Guide