Sri Laxmi Narasimha swami | Varadapasam | Beerpur | Peddagutta | Telangana

 


ఇక్కడ స్వామి చాలా శక్తివంతమైన స్వామి. ఇక్కడ ఒక కొండ గుట్టకే పూజలు నిర్వహిస్తారు. ఈ స్వామి కొండ మీద నుంచి చూస్తే మనకి గోదావరి నది కనిపిస్తుంది. అంత పెద్దది మరియు ఎత్తైన కొండ ఈ ఆలయం చేరుకోవాలియ అంటే ప్రాణాలతో చెలగాటం అడుకోవాడమే అని కూడా అనుకోవచ్చు. అందుకు గల కారణం ఇక్కడ కొండ మీదకి చేరుకోవడానికి ఎటువంటి మెట్లు లేవు. ట్రెకింగ్ చేసుకుంటా వెళ్ళినట్టు వెళ్ళాలి. ఈ కొండ తెలంగాణా రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా బీరపూర్ పెద్దగుట్ట వద్ద కలదు.  

ఈ కొండ కి రెండు నీటి గూండాలు ఉన్నాయి. వాటిని ఎవరు నిర్మించలేదు. స్వయంగా వచ్చాయి. వాటిలో నీరు ఉంటుంది. గుట్టకే  స్వామి వారి ఆకృతి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. స్వామి వారికి ఈ నీటితో అభిషేకం నిర్వహిస్తారు. దీనినే ఇక్కడ వరదప్రసాదం అని అంటారు. ఇంత పెద్ద కొండ మీదకి అందరూ వర్ష కాలం ప్రారంభం లో వచ్చి స్వామి వారికి పూజలు చేసిన తారువత నుంచే గ్రామం అంతా వర్షం కురుస్తుంది. ఇప్పటికి ఈ ఆచారం జరుగుతుంది. కానీ ఏ మాత్రం కాలు తేడా గా జారిన కింద పడిపోవడం ఖాయం. ఇక్కడ కొండ మీదకి అందరూ వచ్చి స్వామి వారికి అక్కడే వంటలు చేసి నైవేద్యం పెట్టి అందరూ తింటారు. ట్రెకింగ్ పై ఆసక్తి ఉన్న వారికి ఇది మంచి ప్రాంతం. 


స్వామి దర్శనం :

ఉదయం : 07:00 నుంచి సాయంత్రం 06:00 


#Sri Laxmi Narasimha swaami  #Varadapasam  #Beerpur  #Peddagutta  #Telangana 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana