Nallagutta Sri Laxmi Narasimha Temple | Gajularamaram | Hyderabad

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఇక్కడ స్వామి స్వయంభూ స్వామి. ఈ ఆలయంలో మనం పాత యాదగిరిగుట్ట వద్ద గల హనుమాన్ ఆలయం వద్ద గల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పాదాలు ఎలా ఐతే దర్శిస్తామో ఇక్కడ కూడా సరిగ్గా అలానే దర్శించవచ్చు స్వామి పాదాలను కూడా. ఈ ఆలయం హైదరాబాద్ లోని గాజులరామారం వద్ద ఉన్నాది. 

ఈ ఆలయంలో స్వామి మనకి గుట్టలో నుంచి దర్శనం ఇస్తారు. ఇక్కడ స్వామి ని దర్శించాలని అంటే మొదట మనం గణపతి స్వామి ని మరియు శివయ్యని మరియు శని భాగవణుడుని, శ్రీ ఆంజనేయస్వామి ని దర్శించుకున్న తరువాత, ఇంకా లోపలికి వెలితే ఇక్కడ పెద్ద శ్రీ నాగదేవత పుట్ట ఉంటుంది. పిల్లలు పేరు వారు ఇక్కడ ప్రత్యేక పూజలు చేపించుకుంటారు. తరువాత గుట్ట లోపలికి వెళితే అక్కడ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం ఇస్తారు. ఇక్కడ శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం , స్వామి కి కళ్యాణం మరియు ఇతర పూజలు నిర్వహిస్తారు. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 07:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్ 

సాయంత్రం : 05:00 నుంచి 07:45 వరకు 

పండుగలు , స్వామి వారికి ప్రత్యేక రోజులలో జరిగే కళ్యాణం , వ్రతాలు ఇతర పెద్ద పండుగ సమయం లలో ఆలయ దర్శనం సమయంలాల్లో మార్పులు ఉంటాయి. 


#Nallagutta Sri Laxmi Narasimha Temple #gajularamaram #Hyderabad  

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana