Posts

Showing posts from April, 2025

Sri Ardha Nareeswara Temple | Kondapur | Hyderabad | Telangana

Image
  జీవితంలో ఒక్కసారి ఐన ఈ ఆలయాన్ని దర్శించి తిరవలసిందే. ప్రపంచంలో ఇలాంటి ఆలయాలు ఉండడం చాలా అరుదుగా ఉంటాయి. ఇలాంటి ఆలయం మన తెలంగాణ హైదరాబాద్ లో ఉండడం మన అందరికీ గర్వ కారణం. తెలంగాణా మొత్తం మీద ఇలాంటి ఆలయం కేవలం ఒకే ఒక్కటి ఉన్నది. అది మన హైదరాబాద్ లో ఉన్నది. ఈ ఆలయం హైదరాబాద్ లోని కొండాపూర్ వద్ద శిల్ప హీల్స్ కొత్త గూడ వద్ద ఉన్నది.  ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటి అనగా ఇక్కడ ఇక్కడ శివుడు మరియు అమ్మవారు ఒకటే పీఠం మీద ఒకటే రూపంతో దర్శనం ఇస్తారు. ఇక్కడ ఆలయం సుమారు 12వ శతాబ్దం లో శ్రీ కాకతీయుల కాలంనాటి రూపంతో ఉంటాయి. ఈ ఆలయంలో మొదట పెద్ద ప్రారంభ గోపురం దర్శించుకొని లోనికి వెళితే రాతితో నిర్మించిన ధ్వజా స్తంభం దర్శించుకొని ఉప ఆలయాల దర్శనం తరువాత ప్రధాన ఆలయం లోనికి ప్రవేశించాలి. చెట్టు కింద పెద్దమ్మ తల్లి దర్శించుకోవాలి. తరువాత శ్రీ హేమలంబ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ ఉంటుంది. ఈ అమ్మవారి ఆలయం చుట్టూ అనేకమైన దేవత మూర్తుల విగ్రహాలు దర్శించవచ్చు.  ఈ ఆలయం తరువాత ప్రధానమైన ఆలయంలోనికి ప్రవేశించాలి. ఇక్కడ ఒకే శిలా మీద శ్రీ పార్వతి పరమేశ్వరుల ఏక రూపంతో అర్ధనారీశ్వర రూపం తో దర్శనం ఇస్తారు. దసరా , దీపావళి ,...

Sri Goda Ranganatha Swamy Temple | Thorrur | Hayatnagar | Hyderabad | Telangana

Image
  ఈ దేవాలయం చాలా పురాతన దేవాలయం. ఇక్కడ స్వామి కొండలలో వెలిసి ఉంటారు. ఆ కొండనే శ్రీ గోడ రంగనాధ స్వామి ఆలయం. ఈ ఆలయం హైదరాబాద్ లోని హయాత్ నగర్ వద్ద గల తొర్రూర్ గ్రామంలో ఉన్నది.  ఈ ఆలయంలో శ్రీ రంగానాధ స్వామి విగ్రహంతో పాటుగా కొండలో నుంచి బయటికి వచ్చినట్టు కనిపిస్తుంది. పైన ఉన్న ఫోటోలో స్వామి ని దర్శించవచ్చు.  ఈ ఆలయంలో శ్రీ రంగానాధ స్వామి తో పాటుగా శ్రీ గణపతి , శ్రీ ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకోవచ్చు. ఈ స్వామి వైకుంఠ ఏకాదశి రోజున విశేష పూజలు నిర్వహిస్తారు. ఆలయం లోపల విపరీతంగా వేడిగా ఉంటుంది. ఈ స్వామిని ఇక్కడ ఎవరు ప్రతిష్ట చేయలేదు. ఈ స్వామి స్వయంభూ స్వామి.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 11:30  మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్  సాయంత్రం : 04:30 నుంచి 08:00 వరకు  #Sri Goda Ranganatha Swamy Temple  #Thorrur  #Hayatnagar  #Hyderabad  #Telangana 

Sri Gantala Shanishwara Swamy Temple | Madanapalle | Shamshabad | Hyderabad

Image
  ప్రపంచంలో ఉండే అతి కొద్ది ఆలయలలో ఈ ఆలయం కూడా ఒకటి. ఇలాంటి ఆలయాలు మనకి అధికంగా అస్సలు కనిపించవు. ఈ ఆలయం హైదరాబాద్ లోని శంషాబాద్ వద్ద గల మదనపల్లి అనే గ్రామంలో ఉన్నది.  ఈ ఆలయం చాలా ప్రత్యేకమైన ఆలయం. ప్రపంచం లో ఎక్కడ లేనటు వంటి విధంగా ఇక్కడ శ్రీ గంటల శనైచ్చర స్వామి కొలువై ఉంటారు. ఈ ఆలయంలో ప్రవేశించగానే మొదట శ్రీ శివాలయంని దర్శించుకోవాలి. తదుపరి శ్రీ ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. తరువాత ప్రధాన ఆలయంలోనికి ప్రవేశిస్తాము. ఇక్కడ శ్రీ శని దేవుడు ప్రధాన దేవత మూర్తిగా పూజలు అందుకుంటున్నారు. అని ఆలయలలోగా కాకుండా ఇక్కడ కొంచం వేరే విధంగా ఇక్కడ పూజలు ఉంటాయి. అబ్బాయిలు ఐతే అంతరాలయ ప్రవేశం ఉంటుంది. అది కూడా పైన చొక్కా లేకుండా వెళ్ళాలి. శిరిడీ వద్ద గల శని ఆలయం వలె. శని త్రయోదశి రోజు ప్రత్యేక పూజలు ఉంటాయి. ఇక్కడ స్వామి కి తైలాభిషేకం విశేషంగా చేస్తారు. ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 11:30  మధ్యాన్నం : 11:30 నుంచి 03:30 బ్రేక్  సాయంత్రం : 03:30 నుంచి 08:00 వరకు    #Sri Shanishwara Swamy Temple  #Madanapalle  #Shamshabad  #Hyderabad 

Karnataka Bharat Gaurav Kashi Darshana Yatra | IRCTC

Image
  భారత ప్రభుత్వ సహాకారం తో నడుపుతున్న irctc ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వంతో కూడా తోడ్పడి కొత్తగా ఒక యాత్ర ప్రారంభించారు. దానికి కర్ణాటక భారత్ గౌరవ కాశీ దర్శన యాత్రగా పేరు పెట్టారు.   యాత్ర యొక్క వివరాలు : యాత్ర పేరు : కర్ణాటక భారత్ గౌరవ కాశీ దర్శన యాత్ర  యాత్రకి పట్టే సమయం : 08రాత్రులు /09 పగల్లు  ప్రయాణం ప్రారంభ తేదీ  : 20/05/2025  టూర్ ధర : రూ|| 22,500/- ఒక్కరికీ  ప్రత్యేక ఆఫర్ : రూ || 7,500/- కర్ణాటక ప్రభుత్వం సబ్సిడీ  లభిస్తుంది.  టూర్ వివరాలు : బెంగళూరు - వారణాసి - అయోధ్య - గయా - ప్రయాగ్ రాజ్ - బెంగళూరు  రైలు ఎక్కే పాయింట్స్ : smvb బెంగళూరు , తుమ్ముకురు , బిరుర్ , దేవన్ గిరి , హవేరి , హుబలి మరియు బెల్గాం.    ఈ యాత్రలో దర్శించే ప్రాంతాలు :   వారణాసి : తులసి మానస్ ఆలయం , సంకట్ మోచన హనుమాన్ ఆలయం , కాశీ విశ్వనాథ్ ఆలయం , గంగా హారతి.  అయోధ్య : రామ జన్మభూమి  గయా : విష్ణుపాడ్ మరియు మహాబోధి ఆలయం.  ప్రయాగ్ రాజ్ : హనుమాన్ ఆలయం మరియు పవిత్ర నదీ స్నానం.  టూర్ యొక్క ఇతర వివరాలు :  మొదటి రోజు -1 :  బెం...

Golden Shivalingam Temple | Rameshwaram | Nagireddypalle | Bhuvanagiri Dist | Telangana

Image
  జీవితంలో ఒక్కసారి ఐన దర్శించాల్సిన ఆలయలలో ఈ ఆలయం ఒకటి. ఇది తెలంగాణా లోని భువనగిరి జిల్లా నాగిరెడ్డిపల్లి వద్ద కలదు. ఈ ప్రాంతాన్ని రామేశ్వరం అని కూడా మరియొక్క పేరు ఉన్నది. ఈ ఆలయం లో 3 అడుగుల బంగారు శివలింగం ఉన్నది. ఇలా ప్రపంచంలో మరి ఎక్కడ లేదు. ఈ ఆలయం చాలా పెద్ద ఆలయం.  ఈ ఆలయాన్ని రామేశ్వరం అని పేరు కూడా ఉన్నది. ఈ ఆలయంలో 1500 పైగా శివలింగలు మరియు 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇతర చిన్న ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ 232 జల శివలింగాలు  ఉన్నాయి. వాటికి నిరంతరం ఆ శివలింగల  మీద ఎప్పుడు నీరు పడుతూనే ఉంటుంది. శివ సహస్రంలోని ఒక్కో నామం మీద ఇక్కడ ఒక్కో శివ లింగంని కూడా దర్శించవచ్చును.  మరియు పక్కనే శిరిడీ సాయి బాబా పేరు మీద సాయి బాబా ఆలయం, శ్రీ దుర్గా దేవి ఆలయం కూడా ఉన్నది. శివరాత్రి రోజు ఇక్కడ చాలా పెద్ద రద్దీ ఉంటుంది.  ఇంతటి మహా శివలింగలు ఉన్న ఈ ప్రాంతాన్ని శివశక్తి మహాపీఠం వారు నిర్వహిస్తున్నారు. ఇక్కడ మరియొక్క ప్రత్యేకత 9 అడుగుల శ్రీ దుర్గా దేవి ని దసరా సమయంలో విశేష పూజలు నిర్వహించి అమ్మవారి కృపాకు ప్రాతృరులు అవుతారు.  ఇక్కడ 250 కి పైగా దేవి దేవతల విగ్రహాలు కూడ...

Sundara Chaitanya Ashramam | Dundigal | Naguloor Rd | Hyderabad | Telangana

Image
 ఇది ఒక చక్కటి పెద్ద ఆశ్రమం. ఈ ఆశ్రమం హైదరాబాద్ కి 50కి. మీ దూరంలో మరియు నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు గండి మైసమ్మ రోడ్డు కి చాలా దగ్గరలోనే ఉంటుంది. దుండిగల్ అనే గ్రామానికి చాలా దగ్గరలో ఉంటుంది ఈ ఆశ్రమం.  సాధారణంగా ఆశ్రమం అనగానే అందరూ పెదా వారు నివసించే ఆశ్రమం అనుకుంటారు. కానీ ఇక్కడ అలా ఏం ఉండదు. ఇక్కడ మధుర , వృంధావన్ మరియు ఇతర చాలా ఆలయాల డెమో , ఊహచిత్రాలు కనిపిస్తాయి. ఇది పేరుకే ఊహ చిత్రాల డెమో కానీ ఇక్కడికి ఒక్కసరి వస్తే అసలైన మధుర , వృంధావన్ లో ఉన్నామా అనే అనుభూతిలో ఉంటాము.  ఇక్కడ అంతా ఒక స్వామిజి పేరు మీద ఈ ఆశ్రమం నడుస్తుంది. ఈ ఆశ్రమంలో ఇతర ఆలయలు ఐన గణపతి , సుబ్రమణ్య స్వామి , శివాలయం , శ్రీమహావిష్ణు ఆలయం , శ్రీ దుర్గా దేవి ఆలయలు ఉన్నాయి. రామాయణం , మహాభారతం , భగవత్గీత లోని సన్నివేశాలను అచ్చు గుద్దినట్టు ఇక్కడ బొమ్మల సహాయంతో చూడవచ్చు. శ్రీ కృష్ణుడు యొక్క అవతారం ప్రత్యేక ఆకర్షణ గా ఉంటుంది.  ఆశ్రమ దర్శన సమయం : ఉదయం : 09:00 నుంచి 12:00  మధ్యాన్నం 12:00 నుంచి 03:00 బ్రేక్  సాయంత్రం : 03:00 నుంచి 05:00  పచ్చటి ఆహ్లాదకరమైన వాతావరణంలో సాయంత్రం ఇక్కడ అని చూసుకుంట...

Sri Gandimaisamma Temple | Gandi Maisamma X Road | Hyderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా చిన్న ఆలయం. కానీ చాలా శక్తివంతమైన అమ్మవారి ఆలయం. ఈ దేవాలయం హైదరాబాద్ లోని గండి మైసమ్మ అనే గ్రామం వద్ద ప్రధాన రహదారికి చాలా దగ్గరలోనే ఉంటుంది. కానీ ఈ అమ్మవారు ఇక్కడ గ్రామ దేవత కావడం వల్ల ఈ అమ్మవారి పేరు మీదనే ఇక్కడానే 4 ఆలయాలు ఉన్నాయి. అవి కూడా ఇవే పేరుతో ఉన్నాయి.  ఈ ఆలయం నిర్మించి ఇప్పటికి 10 సం || పైనే ఐనది. కానీ అభివృద్ది లో మాత్రం పూర్వం ఈ ఆలయం ఎలా ఉన్నదో ఇప్పటికి ఈ ఆలయం అలానే ఉన్నది. చుట్టూ పక్కల ప్రజల ప్రాంతాల వారు వచ్చి వారు వంతుగా సహాయం చేస్తున్న కూడా ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్ల ఆలయ అభివృద్ది జరగడం లేదు. కానీ ప్రతి మంగళవారం , ఆదివారం , దేవి నవరాత్రి సమయంలలో రద్దీ చాలా అధికంగా ఉంటుంది.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 05:00  సాయంత్రం : 05:00 నుంచి 07:30  ఈ ఆలయానికి పెద్ద పార్కింగ్ సౌకర్యం ఐతే లేదు కానీ ఇతర చిన్న చిన్న వాహనాలు మాత్రం నిలుపే సౌకర్యం ఉన్నది.  #Sri Gandimaisamma Temple  #Gandi Maisamma XRoad  #Hyderabad  #Hindu Temples Guide  

Sri Gnana Saraswathi Temple | Vijaya puri colony | Kothapet | Hyderabad | Telangana

Image
  ఈ ఆలయం శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం. ఈ ఆలయం రెండు అంతస్థులలో ఉంటుంది. ఈ దేవాలయాన్ని చేరుకోవాలి అంటే మొదట హైదరాబాద్ లోని కొత్తపేట వద్ద గల విజయపురి కాలనీ కి చేరుకొని అక్కడి నుంచి ఒక కమాన్ ఉంటుంది అక్కడి నుంచి కొద్ది దూరంలోనే ఉంటుంది. కొత్తపేటలోని శ్రీ అష్టలక్ష్మీ ఆలయంనికి ఈ ఆలయం కొద్ది దూరంలోనే ఉంటుంది.  ఈ ఆలయం కింద శ్రీ సరస్వతి దేవి మరియు శివాలయం ఉంటుంది. పైన శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయం మరియు శ్రీ సుబ్రమణ్య స్వామి ఆలయం , శ్రీ గణపతి ఆలయం, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాలు కూడా ఉంటాయి. దసరా నవరాత్రులు , వసంత నవరాత్రులు , అక్షరభ్యసంలు కూడా చేస్తారు. షష్టి తిధి సమయంలో సుబ్రమణ్య స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 06:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 06:00 బ్రేక్  సాయంత్రం : 06:00 నుంచి 08:30  ఈ ఆలయానికి సాయంత్రం సమయంలో వెళ్ళడం ఉత్తమం. మరియు కేవలం సంప్రదాయ దుస్తులలో మాత్రమే అనుమతి.  #Sri Gnana Saraswathi Temple #Vijaya puri colony #Kothapet #Hyderabad #Telangana  

Shiv Mandir | Machilli Kaman | Charkaman | Charminar | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. చార్మినార్ అనగానే అందరూ శ్రీ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం గుర్తుకు వస్తుంది. కానీ ఆ ఆలయం వెనుక రెండు శివాలయాలు ఉన్నాయి అని చాలా మందికి తెలియదు. ఈ రెండు ఆలయలు చాలా పురాతనమైనవి మరియు మహిమ కలిగిన ఆలయలు. ఈ ఆలయం హైదరాబాద్ లోని చార్మినార్ వద్ద గల మచిలీ కమాన్ కి పక్కనే ఉంటుంది. సరిగ్గా చెప్పాలి అంటే చార్మినార్ కి నాలుగు వైపూల నాలుగు కమాన్ లు ఉంటాయి. అందులో భాగ్యలక్ష్మీ ఆలయం వెనుక అఫ్జల్ గంజ్ కి వెళ్ళే మార్గంలో ఉంటుంది. చార్మినార్ కి చాలా దగ్గర నడుచుకుంటూ కూడా ఈ ఆలయం దగ్గరికి వెళ్లిపోవచ్చు.  ఈ ఆలయం పక్కనే మరియొక్క శివాలయం ఉన్నది. అది సుమారు 700 సం || కంటే పూర్వమైనది. ఈ ఆలయం కూడా చాలా పాతది. అంటే చార్మినార్ కంటే 300 సం|| ముందు నుంచే మన ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. పక్కనే స్పటిక శివాలయం ఉన్నది. ఈ ఆలయం లోని స్వామి తెల్లరాతి తో నిర్మించిన ఆలయం. శివరాత్రి మరియు ఇతర ఉత్సవాల సమయంలో ఈ ఆలయంలో రద్దీ చాలా అధికంగా ఉంటుంది.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 07:00 నుంచి 11:30  మధ్యాన్నం : 11:30 నుంచి 05:30 బ్రేక్   సాయంత్రం : 05:30 నుంచి 08:00 వరకు  ఈ ఆలయంలో ...

Sri Laxmi Narasimha Swamy Temple | Ibrahimpatnam | Hyderabad | Telangana

Image
  ఈ ఆలయం చాలా పురతన  ఆలయం. ఈ ఆలయం తెలంగాణా వద్ద హైదరాబాద్ లోని ఇబ్రహీంపట్నం వద్ద కలదు. సరిగ్గా సాగర్ పైప్లైన్ బైపాస్ రోడ్డు మీదగా వెళితే ఈ ఆలయం వస్తుంది. ఈ ఆలయంలో స్వామి దర్శించుకోవడం చాలా అదృష్టం. ఈ స్వామిని దర్శించుకున్నవారు గ్రహ , ఇతర గాలి వంటి వాటి నుంచి విముక్తి పొందుతారు.  ఈ స్వామి స్వయంభూ స్వామి. యాదగిరి గుట్టలోని స్వామి వలె ఈ స్వామి కూడా చాలా శక్తివంతమైన స్వామి. ఈ ఆలయం చాలా చిన్నగా ఉన్న కూడా చాలా శక్తివంతమైన ఆలయం. దేవాలయం కొంచం మీద అనగా ఒక గుట్ట మీద ఉంటుంది. స్వామి దర్శనం అనంతరం శివాలయం , గణపతి , శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం మీరు ఎక్కడ చూడని విధంగా ఉంటుంది.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 11:30  మధ్యాన్నం : 11:30 నుంచి 05:00 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి 08:00  స్వామి వారికి ఉత్సవాలు మరియు పండుగల సమయంలలో రద్దీ అధికంగా ఉంటుంది. అందరూ సంప్రదాయం దుస్తులలో మాత్రమే అనుమతి.  Sri Laxmi Narasimha Swamy Temple #Ibrahimpatnam #Hyderabad #RangaReddy #Telangana

Chikati Venkateshwara Swamy Temple | Hyderabad | Ranga Reddy dist

Image
  ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం. ఈ ఆలయాన్ని 18వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయానికి చాలా పెద్ద చరిత్ర కలదు. ఈ ఆలయం హైదరాబాద్ నుంచి కేవలం 40కి. మీ దూరంలో ఉన్నది. ఈ ఆలయం రంగా రెడ్డి జిల్లా కందుకూర్ మండలం పులిమామిడి అనే గ్రామంలో ఉంటుంది. ఇక్కడ ప్రధాన దేవత మూర్తి శ్రీ వేంకటేశ్వర స్వామి.  ఈ దేవలాయన్ని భక్తరామదసు గారి మేనమమలు ఐన అక్కన మరియు మధన్న గారు నిర్మించారు. ఈ ఆలయం ప్రారంభంలోనే పెద్ద ప్రవేశద్వారం కనిపిస్తుంది. అది దాటుకొని ముందుకు వెళితే రావి చెట్టు ఉంటుంది. తర్వాత కొంత ముందుకు వెళితే ఈ ఆలయం పరిరక్షకుడు ఐన శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తరువాత ముందుకు వెళితే ఇక్కడై నుంచి ప్రధాన ఆలయంలోనికి ప్రవేశం. కొన్ని మెట్లు దిగి లోనికి వెళ్ళాలి. మెట్లు కూడా పాతకాలం నాటివి ఉంటాయి. మరి యొక్క ద్వారం తరువాత ఒక గుట్ట కింద శ్రీదేవి , భూదేవి  శ్రీ చీకటి వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవచ్చు.  ప్రతి సం||  స్వామి వారికి ఉత్సవాలు కూడా చేస్తారు. మరియు శ్రీ రామ నవమి , హనుమాన్ జయంతి కూడా చేస్తారు. ఈ ఆలయం ఊరికి చివరన మరియు చాల ప్రశాంతమైన వాతావరణంలో ఉండడం వల్ల ఆలయం లోపల చాలా ప్రశాంతంగా ఉంటు...

Sri Veerabhadra Swamy Temple | Kothakonda | Warangal | Telangana

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ దేవాలయం పూర్వం చాలా చిన్నగా ఉండేది. కానీ భక్తుల తాకిడి అధికంగా అవడం, ధర్మ బద్దమైన కోరిన కోరికలు నెరవేరడం వల్ల ఈ ఆలయానికి వచ్చే భక్తులు కాలాక్రమేన పెరగడం వల్ల ఆలయంని పెద్దగా నిర్మించినారు.  ఈ ఆలయం వరంగల్ నుంచి కేవలం 40కి. మీ దూరంలో కొత్తకొండ గ్రామం వద్ద ఉన్నది. ఈ దేవాలయానికి సంక్రాంతి సమయంలో సుమారు 50000 మంది కంటే ఎక్కువ భక్తులు వస్తారు. ఆ సమయంలో స్వామి వారికి ఉత్సవాలు జరుగుతాయి. కేవలం ఈ గ్రామంలో వారు మాత్రమే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు. ఈ ఆలయాం పూర్వం ఒక వ్యక్తికి స్వామి కలలో కనిపించి తనను 7 ఎడ్ల బండ్ల మీద తీసుకొని ఈ ప్రాంతంలో ప్రతిష్ట చేయాలి అని చెప్పగానే అతను ఉదయం అందరికీ చెప్పడు. అలా స్వామి కోరుకున్న ప్రాంతంలోనే ప్రతిష్ట జరిగినది. కానీ ఒక కొండ కనిపిస్తుంది కదా. ఆ కొండ మీద ఒక చిన్న శివాలయం ఉన్నది. ట్రేకింగ్ని ఇష్ట పడే వాళ్ళు ఈ కొండ మీదకి నడచుకుంటా వెలుతారు. అక్కడ ఒక చిన్న శివలింగం ఉంటుంది. అది ఎవరు ప్రతిష్ట చేశారు ఇప్పటికి తెలియదు. చాలా చిన్న శివలింగం. దర్శనం అయిపోయిన తరువాత ఆ కొండ శివాలయం నుంచి కిందకు చూస్తే చాలా ప్రశాంతంగా...

Sri Sangameshwara Swamy Temple | Maheshwaram(M) | Telangana

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయానికి సుమారు 400 సం || కంటే పూర్వమే నిర్మించారు అని చరిత్ర. ఈ ఆలయం చాలా చిన్నటి ఆలయం. ఏ రాజులు నిర్మించారో అని మాత్రం తెలియడం లేదు. ఈ దేవాలయం శ్రీశైలం వెళ్ళే దారిలో మహేశ్వరం మండలం వద్ద హైదరాబాద్ కి సుమరు 40 కి.మీ దూరంలో ఉంటుంది.   ఈ ఆలయం మీరు అస్సలు ఊహించినట్టు అస్సలు ఉండదు. చాలా చిన్న ఆలయం ఈ ఆలయం. పూర్తిగా రాతితో నిర్మించారు ఈ దేవాలయాన్ని. ఆలయ ప్రహరీ గోడ మాత్రం చాలా పెద్దగాను చాలా వెడల్పుగాను ఉంటుంది. ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శివయ్య. ఈ ఆలయం లోపలికి వెళ్ళగానే మొదట మనకి ఆలయ రక్షకుడు శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవాలి. తరువాత ఆలయ ప్రదక్షిణ చేసుకొని అంతరాలయం వెళితే చిన్నటి శివలింగం కనిపిస్తుంది. ఆలయం అంతా రాతి తో నిర్మించారు. అంతరాయంలోపల అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ బయట మాత్రం చాలా ఎండ తీవ్రత ఎక్కువగ ఉంటుంది.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 4:30 బ్రేక్  సాయంత్రం : 04:30 నుంచి 07:30  ఈ ఆలయంలో శివరాత్రి రోజు రద్దీ అధికంగా ఉంటుంది. ఈ దేవాలయం కొంచం నిర్మానుష్యమైన ప్రాంతంలో ఉండడం వల...

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయానికి సుమారు 1000 సం || కంటే పూర్వం నుంచే ఇక్కడ ఈ ఆలయం ఉండేది. ఈ దేవాలయం హైదరాబాద్ నుంచి 45కి. మీ దూరంలోను మరియు హైదరాబాద్ బోర్డర్ ఐన పటాన్ చెరువు కి కేవలం 10 కి. మీ దూరంలో ఉంటుంది. ఈ ఆలయానికి మొదలు దారిలో ఒక చిన హనుమాన్ ఆలయం వస్తుంది. అందరూ అదే ఈ ఆలయం అని అనుకుంటున్నారు. కానీ అది దాటి ఇంకా కొంచం ముందకు వస్తే ఈ ఆలయం కనిపిస్తుంది.  ఈ ఆలయం ప్రారంభంలోనే మనకి 10 తలలతో వీరభద్ర స్వామి ఒక గుట్టలో నుంచి బయటికి వచ్చినటు కనిపిస్తారు. తరువాత ఆలయం ప్రారంభం వద్ద ఒక పెద్ద రాతి తో నిర్మించిన ధ్వజ స్తంభం కనిపిస్తుంది. తరువాత పెద్ద రాతి తో నిర్మించిన శిలా తోరణం కనిపిస్తుంది. ఈ పైన ఫోటోలో శిలా తోరణంని దర్శించవచ్చు. తరువాత పక్కనే శివలింగం కనిపిస్తుంది. ఇక్కడి నుంచి ప్రధాన ఆలయం లోపలికి వెళితే కాశీ నుంచి తీసుకొని వచ్చిన శివలింగం దర్శించుకోవచ్చు. ఈ ఆలయం చాలా పాతది ఐనప్పటికి ఇప్పటి కాలానికి అనుగుణంగా మార్పులు చేశారు. పక్కనే పెద్ద కాలువ ప్రవహిస్తూ ఉంటుంది.  ఆలయ దర్శన సమయం : ఉదయం :  06:00 నుంచి  12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్ సాయంత్రం : ...

Sri Laxmi Narasimha Swamy Temple | Nacharamgutta | Telangana

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయానికి విశేషమైన చరిత్ర ఉన్నది. కానీ సరియైన ప్రజాదరణ లేక మరియు పూర్వపు  ప్రభుత్వల సరియైన  సహాయం లేక ఈ ఆలయం శిధిలావస్థకి చేరుకున్నది. ఈ ఆలయం హైదరాబాద్ కి కేవలం 56కి. మీ దూరంలో మరియు గజ్జ్వేల్ - ప్రజ్ఞాపూర్ వెళ్ళే దారిలో హరిద్రానది (హల్దివాగు) ఒడ్డున వెలసివునది ఈ ఆలయం.  కృతాయుగంలో దుష్టశిక్షణ, శిష్ట రక్షణ కొరకు నృసింహ అవతారము వలస వెలువడిన ధ్వనికి భూగోళం అంతా దద్దరిల్లెను. శ్రీ నృసింహ గర్జన కొండలలోనికి, కొండ సొరంగములోనికి , గుహలలోనికి , అరణ్య ప్రాంతములొనికి ఎతైన పర్వత శ్రేణులలోనికి, నదీ ప్రవాహక ప్రాంతము లోనికి వ్యాపించెను. శ్రీ నాచగిరి (శ్వేతగిరి) లక్ష్మి నరసింహ స్వామి క్షేత్రము కూడా అటువంటి ప్రాంతములలొ ఒకటి. అదే ఇప్పటి నాచారంగుట్ట ఆలయం.  గార్గేయ మహర్షి నవనాథ మునులు నాచగిరి యందలి ఎతైన గుండ్ల నుండి వెలువడి నృసింహ గర్జన విని, ఈ స్థలము తపమాచరించిరి, శేషశాయిమాదిరి గల గుహను పరిశీలించగ శ్రీ స్వామి వారు స్వయంగా ఇక్కడకి వచ్చి విశ్రాంతి తీసుకున్నారు అని చరిత్ర.  ఈ ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి తో పాటు శ్రీ గణపతి , శివాలయం , శ్రీ దత్తాత...

Swayabhu Hanuman Temple | Bhavani Nagar | Old Alwal | Secunderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా విశేషమైన ఆలయం. సాధారణంగా మనం ఏలాంటి ఆంజనేయ స్వామి ఆలయం చూసిన స్వామి చాలా వరకు నిల్చొని లేదా ధ్యాన మూర్తిలో ఉండే శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటాం. కానీ ఈ ఆలయంలో అలా కాకుండా పూర్తిగా ఒక విశేష రూపంలో ఉన్న స్వామిని దర్శించుకుంటాం.  ఈ ఆలయం సికింద్రాబాద్ లోని ఓల్డ్ ఆల్వాల్ వద్ద గల భవానీ నగర్ లో ఈ ఆలయం ఉన్నది ఈ ఆలయం పూర్తిగా స్వయంభూ స్వామి. మరియొక్క విశేషం ఏమిటి ఆలయం ఇక్కడ స్వామికి మొత్తం చుట్టూరా తమల ఆకులు పేడుతారు. ఈ ఆలయంలో 21 శనివారాలు స్వామిని దర్శించుకొని ప్రదక్షిణ చేస్తే మనస్సు శాంతి పొందుతుంది అని శరీరం మీద ఎటువంటి గాలి వంటివి ఉన్న కూడా శరీరాన్ని వదిలి పరిపోతాయి అని ఇక్కడి భక్తుల విశ్వాసం. ఇలా చాలా మంది ఇక్కడకి వచ్చి స్వామి దర్శనం చేసుకొని హనుమాన్ చాలీసా మరియు స్వామి భజన చేస్తారు.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 10:30  మధ్యాన్నం : 10:30 నుంచి 05:30 బ్రేక్  సాయంత్రం : 05:30 నుంచి  నుంచి 07:30  హనుమాన్ జయంతి రోజున మరియు శ్రీ రామ నవమి రోజున మరియు ఇతర ముఖ్య పర్వ దినములలో  దర్శన సమయంలలో మార్పులు ఉంటాయి. భక్తులు గమనించగలరు. #Swayab...

Virabadra Shiva Sai Ramanuja Temple | Hyderguda | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం చాలా విశేషమైనది. ఈ ఆలయం ప్రధాన రహదారి మీద ఉంటుంది. కేవలం ద్విచక్రవాహనం కి మాత్రమే పార్కింగ్ సౌకర్యం కలదు. ఈ ఆలయం హైదరాబాద్ అత్తాపూర్ వద్ద గల హైదర్ గూడ వద్ద ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కనే ఉంటుంది.  ఈ ఆలయంలో మనకి ప్రధానంగా శ్రీ ఆంజనేయ స్వామి తో పాటుగా రెండు శివ లింగలు కుడ దర్శనం చేసుకోవచ్చు. మరియు సాయి బాబా ఆలయం కూడా ఉన్నది. ప్రతి భక్తులు అభిషేకం చేసుకోవడానికి ప్రత్యేక శివ లింగం కూడా ఉన్నది. శివరాత్రి , హనుమాన్ జయంతి , శ్రీ రామనవమి రోజు రద్దీ చాలా అధికంగా ఉంటుంది.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 06:00 నుంచి 11:00  మధ్యాన్నం : 11:00 నుంచి 05:00 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి 07:30  ప్రతి శనివారం రోజు రాత్రి 08:00 కి భజన కార్యక్రమాలు నిర్వహిస్తారు.  #Virabadra Shiva Sai Ramanuja Temple  #Hyderguda  #Hyderabad 

Sri Trinetra Anjaneya Swami Temple | Saheb Nagar | Ranga Reddy | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయానికి 300 సం || చరిత్ర కలదు. ఈ ఆలయం చాలా విశేషమైన ఆలయం. ఈ దేవాలయాన్ని మనం ఎక్కడ చూడనాటటువంటి ఆలయం ఈ ఆలయం. ఈ ఆలయం రంగారెడ్డి జిల్లాలోని సాహెబ్ నగర్ వద్ద ఈ శ్రీ త్రినేత్ర ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నది.  ఈ ఆలయంలో స్వామి మూడు కనులతో దర్శనం ఇస్తారు. ఇక్కడ స్వామి మీసాలు కూడా ఉంటాయి. సరిగ్గా ఇలాంటి ఆలయం ఉజ్జయిని లోని త్రినేత్ర మూర్తులని గుర్తు చేసుకొని ఒక బ్రహ్మణ కుటుంబం వారు పూర్వం ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో శ్రీ రామ నవమి , హనుమాన్ జయంతి చాలా వైభవంగా జరుపుతారు. ఇక్కడ శ్రీ హనుమాన్ ఆలయం తో పాటుగా శ్రీ నాగదేవత ఆలయం , శ్రీ గోమాతలు కూడా ఉన్నాయి.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 06:00 నుంచి 11:00  మధ్యాన్నం : 11:30 నుంచి 04:30 బ్రేక్  సాయంత్రం : 04:30 నుంచి 07:30  #Sri Trinetra Anjaneya Swami Temple  #Saheb Nagar  #Ranga Reddy  #Hyderabad 

Spatikalingeshwar Temple | Pocharam Main road | Hyderabad | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం చాలా పెద్ద ఆలయం. ఈ ఆలయాన్ని మనం రంగారెడ్డి జిల్లా ఘటకేసర్ మండలం లోని పోచారం అనే గ్రామంలో ఈ ఆలయం ఉన్నది. ఈ అలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయానికి కార్ మరియు ద్విచక్ర వాహన పార్కింగ్ సౌకర్యం కలదు. ఆలయం బయట పెద్ద కోనేరు ఉన్నది.  ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శివయ్య. ఆలయ ప్రారంభంలోనే మనకి ఆలయ ధ్వజ స్తంభం కనిపిస్తున్నది. తరువాత కుడి వైపున గణపతి స్వామిని దర్శించుకొని తరువాత శ్రీ స్పటికలింగేశ్వర స్వామి ని దర్శించుకోవాలి. తరువాత స్వామి కి ఎడమ వైపున శ్రీ సర్వమంగళ దేవి కూడా ఉంటారు. ఈ ఆలయంలో 108 శివలింగలు ఉన్నాయి. ప్రతి శివలింగం కి మనం అభిషేకం చేసుకోవచ్చు. ప్రతి నెల మాస శివరాత్రి మరియు మహా శివరాత్రి రోజున రద్దీ అధికంగా ఉంటుంది. ఈ ఆలయంలో గణపతి ఉత్సవాలు , దేవి నవరాత్రి ఉత్సవాలు కూడా ఘనంగా జరుగుతాయి.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 06:30 నుంచి 11:30  మధ్యాన్నం : 11:30 నుంచి 05:00 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి 07:30  #Spatikalingeshwar Temple  #Pocharam Main road  #Hyderabad  #Hindu Temples Guide 

Sri Nagadevata Temple | Turkayamjal | Ranga Reddy | Hyderabad

Image
  ఈ ఆలయం నూతనంగా నిర్మిస్తున్న ఆలయం. ఇక్కడ ప్రధాన దేవత మూర్తి శ్రీ నాగదేవత ఈ అమ్మ వారి ఆలయం. ఈ ఆలయం తుర్కయంజాల్ రంగా రెడ్డి వద్ద కలదు.  ఈ ఆలయంలో సుబ్రమణ్య షష్టి రోజున మరియు నాగుల చవితి రోజున విపరీతమైన రద్దీ ఉంటుంది. ఇటువంటి ఆలయం ఉండడం చాలా చాలా ప్రత్యేకమైనది. ఈ ఆలయం ఇంకా నిర్మాణ దశలో ఉన్నది. పెళ్లి కానీ వారు పెళ్లి జరిగి పిల్లలు ఆలస్యం అవుతున్న వారు ఈ ఆలయం లేదా మీ మీ ఇంటి దగ్గరలో శ్రీ సుబ్రమణ్య స్వామి ఆలయం లేదా ఇటువంటి శ్రీ నాగదేవత ఆలయం లేదా శ్రీ కాళహస్తి దర్శించడం ఉత్తమం.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి 07:30  #Sri Nagadevata Temple  #Turkayamjal  #Ranga Reddy  #Hyderabad  

Sri Sai Baba Temple | Sunni Penta | Border Telangana | Hindu Temples Guide

Image
  ఈ ఆలయం తెలంగాణా చివరన మరియు ఆంధ్ర కి బోర్డర్ కి ప్రారంభంలో ఉంటుంది. ఇది శ్రీశైలం వెళ్ళేటప్పుడు సున్నీ పెంట అనే గ్రామంలో ఉంటుంది. ఇక్కడి ఊరు పేర్లు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. సున్నీపెంట , ఈగల పెంట , దోమల పెంట అని పేర్లు ఉంటాయి. ఈ మూడు ఊరులు ఒకటి ఆంధ్ర , రాయలసీమ , తెలంగాణాకి మూడు ప్రధాన గ్రామాలు గా ఉన్నాయి. శ్రీశైలం డామ్ గేట్లు తెరిచినప్పుడు ఈ ఆలయ సందర్శకుల రద్దీ అధికంగా ఉంటుంది.  ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ సాయి బాబా. ఇక్కడ ప్రారంభంలోనే శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారు. పిల్లల కోసం ప్రత్యేక ప్లే గ్రౌండ్ కూడా ఉన్నది. ఇక్కడ ప్రతి గురువారం రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆలయం కూడా కొంచం పెద్దగానే ఉంటుంది. శ్రీశైలం వెళ్ళే భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకొని కొంచం సేపు విశ్రాంతి తీసుకొని తీరిగీ వారు శ్రీశైలంకి ప్రయాణం ప్రారంభం చేస్తారు.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 03:00 బ్రేక్  సాయంత్రం : 03:00 నుంచి 07:30  #Sri Sai Baba Temple  #Sunni Penta  #Border Telangana  #Hindu Temples Guide 

Sitaram Bagh Temple | Hyderabad | Telangana

Image
  ఈ ఆలయం హైదరాబాద్ లో ఉన్న అత్యంత పురాతన ఆలయలలో ఈ ఆలయం ఒకటి. ఈ దేవాలయం సుమారు 200 సం || కంటే క్రితమే నిర్మించారు. ఈ ఆలయం హైదరాబాద్ లోని మల్లె పల్లి వద్ద కొద్ది దూరంలో ఉంటుంది. ఈ ఆలయం బయటికి చిన్నగా కనిపించిన లోపల చాలా పెద్దగా ఉంటుంది.  ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ రామచంద్రమూర్తి స్వామి. మొదట మనం ఆలయం ప్రారంభంలోనే పెద్ద ప్రవేశ ద్వారం ఉంటుంది. ఆది దాటుకొని లోపలికి వెళితే రెండవ ద్వారం గుండా లోపలికి వెళ్ళాలి. పైన ఫోటోలో కనిపించేదే రెండవ ద్వారం. తరువాత 200 మీటర్లు నడిస్తే పెద్ద గుండంని చూడవచ్చు. ఆది కూడా దాటుకొని వెళితే అప్పుడు ప్రధాన ఆలయ ప్రవేశ ద్వారం దగ్గరికి వెలుతాము. అక్కడి నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళాలి. మొదట శ్రీ ఆంజనేయ స్వామి  తరువాత శ్రీ సీతరామ లక్ష్మణ స్వామి దర్శనం చేసుకోవచ్చు. ఆలయం పక్కనే ఇతర చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి. గణపతి , దుర్గా , శివ ఆలయాలు ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా సుమారు 50 మందికి నిద్రకి సరిపడా పెద్ద పెద్ద హాలులు 3 ఉన్నాయి. యాగశాల కూడా ఉన్నది. శ్రీ రామ నవమి , శ్రీ ఆంజనేయ స్వామి ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి 11:3...

Sree Gayatri Mata Temple | Near Chilkur Balaji | Chilkur | Hyderabad

Image
  ఈ ఆలయం తెలంగాణలో ఉండడం అత్యంత విశేషం ఎందుకు అనగా ఇలాంటి ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ వేదమాతా శ్రీ గాయత్రి దేవి. ఈ ఆలయం చిలకుర్ బాలాజీ ఆలయానికి కేవలం 2.5కి. మీ దూరంలోనే ఉన్నది. చాలా మందికి ఈ ఆలయం గురించి తెలియదు.  ఈ దేవాలయం నిర్మించి సుమారు 2 దశాబ్దాలు పైనే అయినది. అనగా 20 సం || పైనే జరిగినది. ఈ ఆలయాన్ని సరిగ్గా 2003 సం || లో ప్రేమలత అనే భక్తురాలికి కలలో కనిపించి తనకి ఆలయం నిర్మించామని అడుగగా ఆమె మరియు గ్రామస్తులు మరియు అందరి సహకారంతో ఈ ఆలయాన్ని నిర్మించినారు. ఈ ఆలయంలో అమ్మవారు దశ చేతులతో పంచ ముఖాలతో అనగా ఈ ఐదు ముఖలే పంచ భూతాలు గా భావిస్తారు.  ఈ ఆలయంలో మనం శ్రీ గాయత్రి దేవితో పాటుగా శ్రీ ఆంజనేయ స్వామి , శ్రీ గణపతి స్వామి , శివయ్య ఆలయం , శ్రీ నాగదేవత ఆలయాలు కూడా దర్శించవచ్చు.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 06:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 05:00  సాయంత్రం : 05:00 నుంచి 08:00  ఈ ఆలయంలో దసరా ఉత్సవాలు మరియు శివరాత్రి సమయంలలో మరియు ఇతర ముఖ్య సమయంలలో ఆలయ దర్శన సమయంలో మార్పులు ఉంటాయి. భక్తులు గమనించగలరు.  #Sree Ga...

Sankalpa Siddi Sri Venkateswara Swamy Temple | Sri Giri | Rajapeta | Telangana

Image
  ఈ ఆలయం పురాతన ఆలయం ఈ ఆలయం గురించి చాలా మందికి తెలియదు. ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ సంకల్ప సిద్ది శ్రీ వేంకటేశ్వర స్వామి. ఈ ఆలయం తెలంగాణాలోని రాజాపేట యాదగిరి గుట్ట కి కేవలం 16 కి. మీ దూరంలోనే ఉంటుంది.  ఈ ఆలయంలో స్వామి వారికి విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం ప్రారంభంలోనే మనకి చక్కటి ధ్వజ స్తంభం కనిపిస్తుంది. ఈ ఆలయం లో మనకి మొదట శ్రీ ఆంజనేయ స్వామి కనిపిస్తారు. తరువాత తిరుమల తిరుపతి లో వలె దివ్యమంగళా స్వరూపంతో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి చక్కటి చిరునవ్వుతో మనలని చూడడం మనం గమనించవచ్చు. ఇక్కడ ప్రతి శనివారం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అందరికీ మధ్యాన్నం ఆన్నదాన వితరణ చేస్తారు. తరువాత పక్కనే తిరుపతి లో వలె వరహస్వామి ని కూడా చూడవచ్చు. బయటికి వచ్చిన తరువాత పక్కనే గోశాల కూడా ఉన్నది. చుట్టూ పచ్చని వాతావరణంలో ఈ ఆలయ దర్శనం మనస్సుకి చాలా ప్రశాంతత లభిస్తుంది.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 06:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 04:00 బ్రేక్  సాయంత్రం : 04:00 నుంచి 07:45  సం ||లో ఒకసారి స్వామివారికి ఉత్సవాలు చేస్తారు. మరియు పండుగల సమయంలలో ,...

Sri Sammakka House | Bayyakkapeta | Medaram | Telangana

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ప్రాంతంలోనే మన గిరిజన వనదేవతగా పూజలు అందుకుంటున్న శ్రీ సమ్మక్క అమ్మవారి ఇల్లు ఇది. ఈ ఆలయం లోనే మాన అమ్మ చిన్నప్పటి నుంచి ఇక్కడే నివసిస్తూ ఉండేది అని భక్తుల నమ్మకం. ఈ ప్రాంతం మేడారం నుంచి కేవలం 11 కి. మీ దూరంలోనే ఉంటుంది. హైదరాబాద్ నుంచి కేవలం 250కి. మీ దూరంలోనే ఉంటుంది.  ఈ ప్రాంతంలో సమ్మక్క అమ్మవారు లోపల పైన చూపిస్తున్న ఫోటోలో ఉన్నటువంటి ఇంటిలోనే నివసిస్తూ ఉండేవారు. ఈ ప్రాంతంలో అమ్మవారు చిన్నప్పుడు వాడిన మంచం , పెట్టె ని కూడా చూడవచ్చు. ఇప్పుడు ఈ ఇంటిలోపల పుట్ట ఉన్నది. అందులో ఒక పాము ఇప్పటికి ఉన్నది అని భక్తుల నమ్మకం. ఆ పాము ఎవరికి హాని చేయదు అని ఇక్కడ భక్తుల నమ్మకం. ఇక్కడ నుంచి మనం మేడారం , అక్కడ నుంచి శ్రీ రామప్ప ఆలయం , లక్కన్నవరం బ్రిడ్జ్ ని కూడా చూడవచ్చు. వర్ష కాలం సమయంలో ఈ ప్రాంతాలు చూడడానికి చాలా బాగా ఉంటాయి.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 07:00 నుంచి సాయంత్రం : 05:00  అటవీ ప్రాంతం కావడం వల్ల చాలా తొందరగానే ఈ ఆలయాన్ని మూసివేస్తాతారు. మేడారం జాతర సమయంలో రద్దీ చాలా అధికంగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి బంగారం సమర్పిస్తారు. ఇక్కడ  బంగారం అంట...

Chilakala Gutta Sammakka Thalli | Medaram | Telangana

Image
  ఈ ఆలయం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకు అంటే అంతా ప్రాచీనమైన ఆలయం మరియు అందరికీ తెలిసిన ఆలయం ఈ దేవాలయం. ఈ ఆలయాన్ని జీవితంలో ఒక్కసారి ఐన దర్శించుకోవాలి. అదే మన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. అందరికీ కేవలం సమ్మక్క సారలమ్మ జాతర గురించి మాత్రమే తెలుసు కానీ అస్సలు ఈ అమ్మవారు ఎక్కడి నుంచి వస్తారు అని మనలో చాలా మందికి తెలియదు. హైదరాబాద్ నుంచి ఈ ఆలయం కేవలం 250 కి. మీ దూరంలోనే ఉంటుంది.  ఈ అమ్మవారు అనగా శ్రీ సమ్మక్క తల్లి చిలకలగుట్ట అనే ప్రాంతంలో కుంకుమ బారిగా మారిపోయినరు అని చరిత్ర. అందుకే ప్రతి 2 సం || ఒకసారి ఇక్కడ నుంచి అమ్మవారు మేడారం జాతర కి వచ్చి తీరిగీ ఇక్కడకి చేరుకుంటారు. ఆసియా ఖండంలోనే అతి పెద్ద జాతర మన మేడారం జాతర. ఇక్కడ జాతర సమయంలో ఇసుక వేస్తే రాలంతా జనం ఉంటారు. ఇక్కడ అమ్మవారికి బంగారం సమర్పిస్తారు. అంటే బెల్లం. బెల్లాన్ని ఇక్కడ బంగారం అని పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు నీటి రూపంలో ఉంటారు అని భక్తుల నమ్మకం. ఇక్కడ ఎంత ఎండ కాలం ఐన సరే ఇక్కడ నీరు ఊరుతూనే ఉంటుంది. ఆ నీటికి చాలా తియ్యటి స్వభావం ఉన్నది తగిన వారు చెపుతారు. మరియు ఇక్కడ కొండ మీద ఉండే చెట్లు ఏనో దివ్యమైన వ...

Sri Kattamaisamma Temple | Begumpet | Hyderabad | Telangana

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయంలో అమ్మవారు శ్రీ కట్ట మైసమ్మ గా పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయం హైదరాబాద్ లోని బేగంపేట ప్రధాన రోడ్డు మీదనే ఉంటుంది. ఈ ఆలయం రోడ్డు మీద ఉండడం వల్ల సరియైన పార్కింగ్ సౌకర్యం లేదు. భక్తులు గమనించగలరు. కానీ ఈ అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు గా పూజలు అందుకుంటున్నారు.  ఈ ఆలయం లోని అమ్మవారు పూర్వం భక్తులకి కలలో కనిపించి ఇక్కడ తనకి గుడి కట్టమని చెప్పడం వల్ల భక్తులు చిన్న ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం దిన దినాభివృద్ది చెందుతూ భక్తులు అధిక సంఖ్యలో రావడం వారు కోరుకున్న కోరికలు తీరడం అలా చిన్న ఆలయం కాస్త ఇప్పుడు పెద్ద ఆలయంగా మార్పు చెందినది. ఈ ఆలయంలో అమ్మవారు ఒక పెద్ద గుట్ట లో నుంచి దర్శనం ఇవ్వడం గమనించవచ్చు. ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నయీ. అవి సుమారు 100 సం || పైనవి అని చరిత్ర. వాటి కిందనే శ్రీ నాగదేవత విగ్రహాలు కూడా దర్శించవచ్చు. ఆషాడ మాసంలో మాత్రమే కాకుండా ఇక్కడ ప్రతి శుక్ర వారం , మంగళవారం , ఆదివారం అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. దసరా పండుగ చాలా పెద్ద ఎత్తున్న నిర్వహిస్తారు.  ఆలయ దర్శన సమయం : ఉదయం : 06:00 నుంచి 11:00  మధ్యాన్నం : 11:00 ను...