Sri Gandimaisamma Temple | Gandi Maisamma X Road | Hyderabad | Hindu Temples Guide
ఈ ఆలయం చాలా చిన్న ఆలయం. కానీ చాలా శక్తివంతమైన అమ్మవారి ఆలయం. ఈ దేవాలయం హైదరాబాద్ లోని గండి మైసమ్మ అనే గ్రామం వద్ద ప్రధాన రహదారికి చాలా దగ్గరలోనే ఉంటుంది. కానీ ఈ అమ్మవారు ఇక్కడ గ్రామ దేవత కావడం వల్ల ఈ అమ్మవారి పేరు మీదనే ఇక్కడానే 4 ఆలయాలు ఉన్నాయి. అవి కూడా ఇవే పేరుతో ఉన్నాయి.
ఈ ఆలయం నిర్మించి ఇప్పటికి 10 సం || పైనే ఐనది. కానీ అభివృద్ది లో మాత్రం పూర్వం ఈ ఆలయం ఎలా ఉన్నదో ఇప్పటికి ఈ ఆలయం అలానే ఉన్నది. చుట్టూ పక్కల ప్రజల ప్రాంతాల వారు వచ్చి వారు వంతుగా సహాయం చేస్తున్న కూడా ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్ల ఆలయ అభివృద్ది జరగడం లేదు. కానీ ప్రతి మంగళవారం , ఆదివారం , దేవి నవరాత్రి సమయంలలో రద్దీ చాలా అధికంగా ఉంటుంది.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 05:00
సాయంత్రం : 05:00 నుంచి 07:30
ఈ ఆలయానికి పెద్ద పార్కింగ్ సౌకర్యం ఐతే లేదు కానీ ఇతర చిన్న చిన్న వాహనాలు మాత్రం నిలుపే సౌకర్యం ఉన్నది.
#Sri Gandimaisamma Temple #Gandi Maisamma XRoad #Hyderabad #Hindu Temples Guide

Comments
Post a Comment