Sankalpa Siddi Sri Venkateswara Swamy Temple | Sri Giri | Rajapeta | Telangana

 


ఈ ఆలయం పురాతన ఆలయం ఈ ఆలయం గురించి చాలా మందికి తెలియదు. ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ సంకల్ప సిద్ది శ్రీ వేంకటేశ్వర స్వామి. ఈ ఆలయం తెలంగాణాలోని రాజాపేట యాదగిరి గుట్ట కి కేవలం 16 కి. మీ దూరంలోనే ఉంటుంది. 

ఈ ఆలయంలో స్వామి వారికి విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం ప్రారంభంలోనే మనకి చక్కటి ధ్వజ స్తంభం కనిపిస్తుంది. ఈ ఆలయం లో మనకి మొదట శ్రీ ఆంజనేయ స్వామి కనిపిస్తారు. తరువాత తిరుమల తిరుపతి లో వలె దివ్యమంగళా స్వరూపంతో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి చక్కటి చిరునవ్వుతో మనలని చూడడం మనం గమనించవచ్చు. ఇక్కడ ప్రతి శనివారం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అందరికీ మధ్యాన్నం ఆన్నదాన వితరణ చేస్తారు. తరువాత పక్కనే తిరుపతి లో వలె వరహస్వామి ని కూడా చూడవచ్చు. బయటికి వచ్చిన తరువాత పక్కనే గోశాల కూడా ఉన్నది. చుట్టూ పచ్చని వాతావరణంలో ఈ ఆలయ దర్శనం మనస్సుకి చాలా ప్రశాంతత లభిస్తుంది. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 06:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 04:00 బ్రేక్ 

సాయంత్రం : 04:00 నుంచి 07:45 

సం ||లో ఒకసారి స్వామివారికి ఉత్సవాలు చేస్తారు. మరియు పండుగల సమయంలలో , ఇతర ఇతర ముఖ్యమైన తేదీలలో అనగా వైకుంఠ ఏకాదశి రోజున ఆలయ దర్శన సమయంలో మార్పులు ఉంటాయి. గమనించగలరు. 



#Sankalpa Siddi Sri Venkateswara Swamy Temple  #Sri Giri  #Rajapeta  #Telangana 


Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana