Karnataka Bharat Gaurav Kashi Darshana Yatra | IRCTC
భారత ప్రభుత్వ సహాకారం తో నడుపుతున్న irctc ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వంతో కూడా తోడ్పడి కొత్తగా ఒక యాత్ర ప్రారంభించారు. దానికి కర్ణాటక భారత్ గౌరవ కాశీ దర్శన యాత్రగా పేరు పెట్టారు.
యాత్ర యొక్క వివరాలు :
యాత్ర పేరు : కర్ణాటక భారత్ గౌరవ కాశీ దర్శన యాత్ర
యాత్రకి పట్టే సమయం : 08రాత్రులు /09 పగల్లు
ప్రయాణం ప్రారంభ తేదీ : 20/05/2025
టూర్ ధర : రూ|| 22,500/- ఒక్కరికీ
ప్రత్యేక ఆఫర్ : రూ || 7,500/- కర్ణాటక ప్రభుత్వం సబ్సిడీ లభిస్తుంది.
టూర్ వివరాలు : బెంగళూరు - వారణాసి - అయోధ్య - గయా - ప్రయాగ్ రాజ్ - బెంగళూరు
రైలు ఎక్కే పాయింట్స్ : smvb బెంగళూరు , తుమ్ముకురు , బిరుర్ , దేవన్ గిరి , హవేరి , హుబలి మరియు బెల్గాం.
ఈ యాత్రలో దర్శించే ప్రాంతాలు :
వారణాసి : తులసి మానస్ ఆలయం , సంకట్ మోచన హనుమాన్ ఆలయం , కాశీ విశ్వనాథ్ ఆలయం , గంగా హారతి.
అయోధ్య : రామ జన్మభూమి
గయా : విష్ణుపాడ్ మరియు మహాబోధి ఆలయం.
ప్రయాగ్ రాజ్ : హనుమాన్ ఆలయం మరియు పవిత్ర నదీ స్నానం.
టూర్ యొక్క ఇతర వివరాలు :
మొదటి రోజు -1 :
బెంగళూరు :
ట్రైన్ బెంగళూరు రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణం ప్రారంభం చేయబడును.
ప్రయాణికులు వారికి కేటాయించిన సీట్ లలో కూర్చొని ఉంటారు.
మధ్యాన్నం లంచ్ , సాయంత్రం టి మరియు రాత్రికి డిన్నర్ కూడా ట్రైన్ లోనే ఇవ్వబడును.
రాత్రి అంతా ట్రైన్ ప్రయాణం సాగుతూనే ఉంటుంది.
రెండవ రోజు -2
ట్రైన్ లోనే ఉదయం టి మరియు బ్రేక్ ఫాస్ట్ ఇవ్వబడును.
మధ్యాన్నం లంచ్ మరియు సాయంత్రం టి ఇవ్వబడును.
రాత్రికి భోజనం ఇవ్వబడును మరియు రాత్రి అంతా రైలు ప్రయాణం కొనసాగించబడును.
మూడవ రోజు :
వారణాసి :
ఉదయం టి బ్రేక్ ఫాస్ట్ మరియు మధ్యాన్నం లంచ్ ట్రైన్ లోనే చేయాలి.
సాయంత్రం లోగా ట్రైన్ వారణాసి రైల్వే స్టేషన్ కి చేరుకుంటుంది.
రైల్వే స్టేషన్ నుంచి ఆలయ సమీపంలోని హోటల్ లో బస చేయవచ్చు.
రాత్రికి డిన్నర్ చేసి రాత్రి అంతా అక్కడ హోటల్ లోనే బస చేయాలి.
నాల్గవ రోజు :
ఉదయం బ్రేక్ ఫాస్ట్ తరువాత తులసి ఆలయం మరియు సంకట్ మోచన హనుమాన్ ఆలయ దర్శనం చేసుకోవాలి.
లంచ్ తరువాత శ్రీ కాశీ విశ్వనాథ్ స్వామి ఆలయం మరియు సమయం ఉంటే శ్రీ గంగా దేవి నదీ లో పవిత్ర నదీ స్నానం అచ్చరించవచ్చు.
సాయంకాల సమయంలో గంగా హారతి కూడా దర్శించవచ్చు.
రాత్రికి వారణాసి లోనే డిన్నర్ చేసి రాత్రికి అక్కడే నిద్ర చేయావలసి ఉంటుంది.
ఐదవ రోజు :
అయోధ్య కి ప్రయాణం ప్రారంభం:
ఉదయమే వారణాసి నుంచి ప్రయాణం ప్రారంభం అవుతుంది.
ఉదయం టిఫిన్ మరియు లంచ్ ట్రైన్ లోనే చేయవలసి ఉంటుంది.
మధ్యాన్నం అయోధ్య రైల్వే స్టేషన్ కీ చేరుకుంటాము.
సాయంత్రం శ్రీ రామ జన్మభూమి మరియు హనుమాన్ గర్హి కూడా దర్శించుకుంటాము.
రాత్రికి ఇక్కడే భోజనం చేసి అయోధ్య రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణం ప్రారంభం అవుతుంది.
ఆరవ రోజు :
గయా కి ప్రయాణం :
ఉదయం గయా రైల్వే స్టేషన్ కి ట్రైన్ చేరుకుంటుంది.
బ్రేక్ ఫాస్ట్ తరువాత విష్ణుపాడ్ ఆలయ దర్శనకి ప్రారంభం అవుతుంది.
మధ్యాన్నం లంచ్ తరువాత బోధ గయా వద్ద గల మహాబోధి ఆలయ దర్శనం ప్రారంభం అవ్వాలి.
రాత్రికి డిన్నర్ పూర్తి చేసి గయా రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణం ప్రారంభం అవుతుంది.
ఏడవ రోజు :
ప్రయాగ్ రాజ్ :
ఉదయం ప్రయాగ్ రాజ్ కి చేరుకుంటాము.
బ్రేక్ ఫాస్ట్ ట్రైన్ లోనే చేసుకొని తరువాత హోటల్ కి చేరుకుంటాము,
హోటల్ లో చేంజ్ మరియు బట్టలు ఉత్తుకునే వారు బట్టలు ఉత్తుకోవచ్చు.
శ్రీ హనుమాన్ ఆలయం దర్శనం తరువాత ప్రయాగ్ రాజ్ పవిత్ర గంగా లో పుణ్య స్నానాలు చేయవచ్చు.
మధ్యాన్నం ప్రయాగ్ రాజ్ నుంచి ప్రయాణం ప్రారంభం అవుతుంది.
మధ్యాన్నం లంచ్ మరియు సాయంత్రం టి, రాత్రికి డిన్నర్ ట్రైన్ లోనే చేయవలిసి ఉంటుంది.
ఎనిమిదవ రోజు :
ట్రైన్ ప్రయాణం :
ట్రైన్ లోనే బ్రేక్ ఫాస్ట్ చేయాలి.
మధ్యాన్నం లంచ్ మరియు సాయంత్రంకి టి ఇవ్వబడును
రాత్రికి డిన్నర్ కూడా ట్రైన్ లోనే చేయాలి. రాత్రి అంతా ట్రైన్ ప్రయాణం చేస్తూనే ఉంటుంది.
తొమిదవ రోజు :
బెంగుళూరు కి ప్రయాణం :
ఉదయం టి బ్రేక్ ఫాస్ట్ మరియు మధ్యాన్నం లంచ్ కూడా ట్రైన్ లోనే చేయాలి.
తమ తమ స్టేషన్ రాగానే ఎవరు ఎక్కడ ఐతే ప్రారంభంలో ట్రైన్ ఎక్కినరో వారు ఆ స్టేషన్ రాగానే దిగిపోవచ్చు.
సాయంత్రం ట్రైన్ బెంగుళూరు రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది.
ఇక్కడితో సంపూర్ణ ప్రయాణం పూర్తి అయిపోయింది.
ఈ ప్రయాణంలో యాత్రికులకి ప్రత్యేకంగా లభించే ఆధనపు ప్రయోజనాలు :
ఈ ట్రైన్ ప్రయాణంలో భారత్ గౌరవ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ 3AC క్లాస్ లో ప్రయాణించవచ్చు.
బట్టలు మార్చుకోవడం కొరకు మరియు ఉతకదనికి నాన్ ఏసి రూమ్ లు కేటాయించబడును.
కేవలం శాఖహారము మాత్రమే భోజనం.
యాత్రికులకి యాత్ర సమయం అంతా ఇన్షూరెన్స్ ఇవ్వబడును.
రైలు లో సెక్యూరిటీ కూడా ఉంటుంది.
ప్రయాణం ప్రారంభించే ముందే టెర్మ్స్ మరియు కండిషన్స్ మొత్తం చూసుకోవాలి.
#Karnataka #Bharat Gaurav #Kashi #Darshana #Yatra #IRCTC #Budget Travel

Comments
Post a Comment