Shiv Mandir | Machilli Kaman | Charkaman | Charminar | Hyderabad

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. చార్మినార్ అనగానే అందరూ శ్రీ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం గుర్తుకు వస్తుంది. కానీ ఆ ఆలయం వెనుక రెండు శివాలయాలు ఉన్నాయి అని చాలా మందికి తెలియదు. ఈ రెండు ఆలయలు చాలా పురాతనమైనవి మరియు మహిమ కలిగిన ఆలయలు. ఈ ఆలయం హైదరాబాద్ లోని చార్మినార్ వద్ద గల మచిలీ కమాన్ కి పక్కనే ఉంటుంది. సరిగ్గా చెప్పాలి అంటే చార్మినార్ కి నాలుగు వైపూల నాలుగు కమాన్ లు ఉంటాయి. అందులో భాగ్యలక్ష్మీ ఆలయం వెనుక అఫ్జల్ గంజ్ కి వెళ్ళే మార్గంలో ఉంటుంది. చార్మినార్ కి చాలా దగ్గర నడుచుకుంటూ కూడా ఈ ఆలయం దగ్గరికి వెళ్లిపోవచ్చు. 

ఈ ఆలయం పక్కనే మరియొక్క శివాలయం ఉన్నది. అది సుమారు 700 సం || కంటే పూర్వమైనది. ఈ ఆలయం కూడా చాలా పాతది. అంటే చార్మినార్ కంటే 300 సం|| ముందు నుంచే మన ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. పక్కనే స్పటిక శివాలయం ఉన్నది. ఈ ఆలయం లోని స్వామి తెల్లరాతి తో నిర్మించిన ఆలయం. శివరాత్రి మరియు ఇతర ఉత్సవాల సమయంలో ఈ ఆలయంలో రద్దీ చాలా అధికంగా ఉంటుంది. 

ఆలయ దర్శన సమయం : 

ఉదయం : 07:00 నుంచి 11:30 

మధ్యాన్నం : 11:30 నుంచి 05:30 బ్రేక్ 

 సాయంత్రం : 05:30 నుంచి 08:00 వరకు 

ఈ ఆలయంలో ప్రతి సోమవారం రోజున ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి మరియు సాయంత్రం సమయంలో హారతి చాలా బాగా ఇస్తారు. శివరాత్రి కి అంతా తెరిచే ఉంటుంది. సంప్రదాయా దుస్తులలో మాత్రమే అనుమతి ఇవ్వబడును. 


#Shiv Mandir #Machilli Kaman #Charkaman #Charminar #Hyderabad 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana