Sri Sai Baba Temple | Sunni Penta | Border Telangana | Hindu Temples Guide
ఈ ఆలయం తెలంగాణా చివరన మరియు ఆంధ్ర కి బోర్డర్ కి ప్రారంభంలో ఉంటుంది. ఇది శ్రీశైలం వెళ్ళేటప్పుడు సున్నీ పెంట అనే గ్రామంలో ఉంటుంది. ఇక్కడి ఊరు పేర్లు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. సున్నీపెంట , ఈగల పెంట , దోమల పెంట అని పేర్లు ఉంటాయి. ఈ మూడు ఊరులు ఒకటి ఆంధ్ర , రాయలసీమ , తెలంగాణాకి మూడు ప్రధాన గ్రామాలు గా ఉన్నాయి. శ్రీశైలం డామ్ గేట్లు తెరిచినప్పుడు ఈ ఆలయ సందర్శకుల రద్దీ అధికంగా ఉంటుంది.
ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ సాయి బాబా. ఇక్కడ ప్రారంభంలోనే శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారు. పిల్లల కోసం ప్రత్యేక ప్లే గ్రౌండ్ కూడా ఉన్నది. ఇక్కడ ప్రతి గురువారం రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆలయం కూడా కొంచం పెద్దగానే ఉంటుంది. శ్రీశైలం వెళ్ళే భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకొని కొంచం సేపు విశ్రాంతి తీసుకొని తీరిగీ వారు శ్రీశైలంకి ప్రయాణం ప్రారంభం చేస్తారు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 03:00 బ్రేక్
సాయంత్రం : 03:00 నుంచి 07:30
#Sri Sai Baba Temple #Sunni Penta #Border Telangana #Hindu Temples Guide

Comments
Post a Comment