Sri Ardha Nareeswara Temple | Kondapur | Hyderabad | Telangana
జీవితంలో ఒక్కసారి ఐన ఈ ఆలయాన్ని దర్శించి తిరవలసిందే. ప్రపంచంలో ఇలాంటి ఆలయాలు ఉండడం చాలా అరుదుగా ఉంటాయి. ఇలాంటి ఆలయం మన తెలంగాణ హైదరాబాద్ లో ఉండడం మన అందరికీ గర్వ కారణం. తెలంగాణా మొత్తం మీద ఇలాంటి ఆలయం కేవలం ఒకే ఒక్కటి ఉన్నది. అది మన హైదరాబాద్ లో ఉన్నది. ఈ ఆలయం హైదరాబాద్ లోని కొండాపూర్ వద్ద శిల్ప హీల్స్ కొత్త గూడ వద్ద ఉన్నది.
ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటి అనగా ఇక్కడ ఇక్కడ శివుడు మరియు అమ్మవారు ఒకటే పీఠం మీద ఒకటే రూపంతో దర్శనం ఇస్తారు. ఇక్కడ ఆలయం సుమారు 12వ శతాబ్దం లో శ్రీ కాకతీయుల కాలంనాటి రూపంతో ఉంటాయి. ఈ ఆలయంలో మొదట పెద్ద ప్రారంభ గోపురం దర్శించుకొని లోనికి వెళితే రాతితో నిర్మించిన ధ్వజా స్తంభం దర్శించుకొని ఉప ఆలయాల దర్శనం తరువాత ప్రధాన ఆలయం లోనికి ప్రవేశించాలి. చెట్టు కింద పెద్దమ్మ తల్లి దర్శించుకోవాలి. తరువాత శ్రీ హేమలంబ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ ఉంటుంది. ఈ అమ్మవారి ఆలయం చుట్టూ అనేకమైన దేవత మూర్తుల విగ్రహాలు దర్శించవచ్చు.
ఈ ఆలయం తరువాత ప్రధానమైన ఆలయంలోనికి ప్రవేశించాలి. ఇక్కడ ఒకే శిలా మీద శ్రీ పార్వతి పరమేశ్వరుల ఏక రూపంతో అర్ధనారీశ్వర రూపం తో దర్శనం ఇస్తారు. దసరా , దీపావళి , శివరాత్రి , వసంత నవరాత్రులు కూడా ఘనంగా జరుగుతాయి. ఇక్కడ స్వామి అమ్మవార్ల తో పాటుగా శ్రీ గణపతి ఆలయం కూడా దర్శించవచ్చు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 11:30
మధ్యాన్నం : 11:30 నుంచి 04:30 బ్రేక్
సాయంత్రం : 04:30 నుంచి 08:00
#Sri Ardha Nareeswara Temple #Kondapur #Hyderabad #Telangana

Comments
Post a Comment