Sundara Chaitanya Ashramam | Dundigal | Naguloor Rd | Hyderabad | Telangana


 ఇది ఒక చక్కటి పెద్ద ఆశ్రమం. ఈ ఆశ్రమం హైదరాబాద్ కి 50కి. మీ దూరంలో మరియు నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు గండి మైసమ్మ రోడ్డు కి చాలా దగ్గరలోనే ఉంటుంది. దుండిగల్ అనే గ్రామానికి చాలా దగ్గరలో ఉంటుంది ఈ ఆశ్రమం. 

సాధారణంగా ఆశ్రమం అనగానే అందరూ పెదా వారు నివసించే ఆశ్రమం అనుకుంటారు. కానీ ఇక్కడ అలా ఏం ఉండదు. ఇక్కడ మధుర , వృంధావన్ మరియు ఇతర చాలా ఆలయాల డెమో , ఊహచిత్రాలు కనిపిస్తాయి. ఇది పేరుకే ఊహ చిత్రాల డెమో కానీ ఇక్కడికి ఒక్కసరి వస్తే అసలైన మధుర , వృంధావన్ లో ఉన్నామా అనే అనుభూతిలో ఉంటాము. 

ఇక్కడ అంతా ఒక స్వామిజి పేరు మీద ఈ ఆశ్రమం నడుస్తుంది. ఈ ఆశ్రమంలో ఇతర ఆలయలు ఐన గణపతి , సుబ్రమణ్య స్వామి , శివాలయం , శ్రీమహావిష్ణు ఆలయం , శ్రీ దుర్గా దేవి ఆలయలు ఉన్నాయి. రామాయణం , మహాభారతం , భగవత్గీత లోని సన్నివేశాలను అచ్చు గుద్దినట్టు ఇక్కడ బొమ్మల సహాయంతో చూడవచ్చు. శ్రీ కృష్ణుడు యొక్క అవతారం ప్రత్యేక ఆకర్షణ గా ఉంటుంది. 

ఆశ్రమ దర్శన సమయం :

ఉదయం : 09:00 నుంచి 12:00 

మధ్యాన్నం 12:00 నుంచి 03:00 బ్రేక్ 

సాయంత్రం : 03:00 నుంచి 05:00 

పచ్చటి ఆహ్లాదకరమైన వాతావరణంలో సాయంత్రం ఇక్కడ అని చూసుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళడం మనసుకి ఎంతో హాయిని ఇస్తుంది.   


#Sundara Chaitanya Ashramam  #Dundigal  #Naguloor Rd #Hyderabad  #Telangana. 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana