Spatikalingeshwar Temple | Pocharam Main road | Hyderabad | Hindu Temples Guide
ఈ ఆలయం చాలా పెద్ద ఆలయం. ఈ ఆలయాన్ని మనం రంగారెడ్డి జిల్లా ఘటకేసర్ మండలం లోని పోచారం అనే గ్రామంలో ఈ ఆలయం ఉన్నది. ఈ అలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయానికి కార్ మరియు ద్విచక్ర వాహన పార్కింగ్ సౌకర్యం కలదు. ఆలయం బయట పెద్ద కోనేరు ఉన్నది.
ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శివయ్య. ఆలయ ప్రారంభంలోనే మనకి ఆలయ ధ్వజ స్తంభం కనిపిస్తున్నది. తరువాత కుడి వైపున గణపతి స్వామిని దర్శించుకొని తరువాత శ్రీ స్పటికలింగేశ్వర స్వామి ని దర్శించుకోవాలి. తరువాత స్వామి కి ఎడమ వైపున శ్రీ సర్వమంగళ దేవి కూడా ఉంటారు. ఈ ఆలయంలో 108 శివలింగలు ఉన్నాయి. ప్రతి శివలింగం కి మనం అభిషేకం చేసుకోవచ్చు. ప్రతి నెల మాస శివరాత్రి మరియు మహా శివరాత్రి రోజున రద్దీ అధికంగా ఉంటుంది. ఈ ఆలయంలో గణపతి ఉత్సవాలు , దేవి నవరాత్రి ఉత్సవాలు కూడా ఘనంగా జరుగుతాయి.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:30 నుంచి 11:30
మధ్యాన్నం : 11:30 నుంచి 05:00 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 07:30
#Spatikalingeshwar Temple #Pocharam Main road #Hyderabad #Hindu Temples Guide

Comments
Post a Comment