Chilakala Gutta Sammakka Thalli | Medaram | Telangana

 


ఈ ఆలయం గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకు అంటే అంతా ప్రాచీనమైన ఆలయం మరియు అందరికీ తెలిసిన ఆలయం ఈ దేవాలయం. ఈ ఆలయాన్ని జీవితంలో ఒక్కసారి ఐన దర్శించుకోవాలి. అదే మన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. అందరికీ కేవలం సమ్మక్క సారలమ్మ జాతర గురించి మాత్రమే తెలుసు కానీ అస్సలు ఈ అమ్మవారు ఎక్కడి నుంచి వస్తారు అని మనలో చాలా మందికి తెలియదు. హైదరాబాద్ నుంచి ఈ ఆలయం కేవలం 250 కి. మీ దూరంలోనే ఉంటుంది. 

ఈ అమ్మవారు అనగా శ్రీ సమ్మక్క తల్లి చిలకలగుట్ట అనే ప్రాంతంలో కుంకుమ బారిగా మారిపోయినరు అని చరిత్ర. అందుకే ప్రతి 2 సం || ఒకసారి ఇక్కడ నుంచి అమ్మవారు మేడారం జాతర కి వచ్చి తీరిగీ ఇక్కడకి చేరుకుంటారు. ఆసియా ఖండంలోనే అతి పెద్ద జాతర మన మేడారం జాతర. ఇక్కడ జాతర సమయంలో ఇసుక వేస్తే రాలంతా జనం ఉంటారు. ఇక్కడ అమ్మవారికి బంగారం సమర్పిస్తారు. అంటే బెల్లం. బెల్లాన్ని ఇక్కడ బంగారం అని పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు నీటి రూపంలో ఉంటారు అని భక్తుల నమ్మకం. ఇక్కడ ఎంత ఎండ కాలం ఐన సరే ఇక్కడ నీరు ఊరుతూనే ఉంటుంది. ఆ నీటికి చాలా తియ్యటి స్వభావం ఉన్నది తగిన వారు చెపుతారు. మరియు ఇక్కడ కొండ మీద ఉండే చెట్లు ఏనో దివ్యమైన వనములికలు అని చెపుతారు. 


ఆలయ దర్శన సమయం : 

ఉదయం : 08:00 నుంచి సాయంత్రం 04:00 మాత్రమే 

చుట్టూ అడవి ప్రాంతం ఉండడం వల్ల తొందరగానే ఆలయ మూసి వేస్తారు. 


#Chilakala Gutta #Sammakka Saralaramma Jathara #Medaram #Telangana   

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana