Chikati Venkateshwara Swamy Temple | Hyderabad | Ranga Reddy dist
ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం. ఈ ఆలయాన్ని 18వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయానికి చాలా పెద్ద చరిత్ర కలదు. ఈ ఆలయం హైదరాబాద్ నుంచి కేవలం 40కి. మీ దూరంలో ఉన్నది. ఈ ఆలయం రంగా రెడ్డి జిల్లా కందుకూర్ మండలం పులిమామిడి అనే గ్రామంలో ఉంటుంది. ఇక్కడ ప్రధాన దేవత మూర్తి శ్రీ వేంకటేశ్వర స్వామి.
ఈ దేవలాయన్ని భక్తరామదసు గారి మేనమమలు ఐన అక్కన మరియు మధన్న గారు నిర్మించారు. ఈ ఆలయం ప్రారంభంలోనే పెద్ద ప్రవేశద్వారం కనిపిస్తుంది. అది దాటుకొని ముందుకు వెళితే రావి చెట్టు ఉంటుంది. తర్వాత కొంత ముందుకు వెళితే ఈ ఆలయం పరిరక్షకుడు ఐన శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్న తరువాత ముందుకు వెళితే ఇక్కడై నుంచి ప్రధాన ఆలయంలోనికి ప్రవేశం. కొన్ని మెట్లు దిగి లోనికి వెళ్ళాలి. మెట్లు కూడా పాతకాలం నాటివి ఉంటాయి. మరి యొక్క ద్వారం తరువాత ఒక గుట్ట కింద శ్రీదేవి , భూదేవి శ్రీ చీకటి వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవచ్చు.
ప్రతి సం|| స్వామి వారికి ఉత్సవాలు కూడా చేస్తారు. మరియు శ్రీ రామ నవమి , హనుమాన్ జయంతి కూడా చేస్తారు. ఈ ఆలయం ఊరికి చివరన మరియు చాల ప్రశాంతమైన వాతావరణంలో ఉండడం వల్ల ఆలయం లోపల చాలా ప్రశాంతంగా ఉంటుంది.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి సాయంత్రం 07:00
ఈ ఆలయం ఊరికి చివరన నిర్మానుయామైన ప్రాంతంలో ఉండడం వల్ల తొందరనే ఆలయాన్ని మూసివేస్తారు.
#Chikati Venkateshwara Swamy Temple #Hyderabad #Ranga Reddy dist

Comments
Post a Comment