Golden Shivalingam Temple | Rameshwaram | Nagireddypalle | Bhuvanagiri Dist | Telangana

 


జీవితంలో ఒక్కసారి ఐన దర్శించాల్సిన ఆలయలలో ఈ ఆలయం ఒకటి. ఇది తెలంగాణా లోని భువనగిరి జిల్లా నాగిరెడ్డిపల్లి వద్ద కలదు. ఈ ప్రాంతాన్ని రామేశ్వరం అని కూడా మరియొక్క పేరు ఉన్నది. ఈ ఆలయం లో 3 అడుగుల బంగారు శివలింగం ఉన్నది. ఇలా ప్రపంచంలో మరి ఎక్కడ లేదు. ఈ ఆలయం చాలా పెద్ద ఆలయం. 

ఈ ఆలయాన్ని రామేశ్వరం అని పేరు కూడా ఉన్నది. ఈ ఆలయంలో 1500 పైగా శివలింగలు మరియు 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇతర చిన్న ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ 232 జల శివలింగాలు  ఉన్నాయి. వాటికి నిరంతరం ఆ శివలింగల  మీద ఎప్పుడు నీరు పడుతూనే ఉంటుంది. శివ సహస్రంలోని ఒక్కో నామం మీద ఇక్కడ ఒక్కో శివ లింగంని కూడా దర్శించవచ్చును. 

మరియు పక్కనే శిరిడీ సాయి బాబా పేరు మీద సాయి బాబా ఆలయం, శ్రీ దుర్గా దేవి ఆలయం కూడా ఉన్నది. శివరాత్రి రోజు ఇక్కడ చాలా పెద్ద రద్దీ ఉంటుంది.  ఇంతటి మహా శివలింగలు ఉన్న ఈ ప్రాంతాన్ని శివశక్తి మహాపీఠం వారు నిర్వహిస్తున్నారు. ఇక్కడ మరియొక్క ప్రత్యేకత 9 అడుగుల శ్రీ దుర్గా దేవి ని దసరా సమయంలో విశేష పూజలు నిర్వహించి అమ్మవారి కృపాకు ప్రాతృరులు అవుతారు.  ఇక్కడ 250 కి పైగా దేవి దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శించితే అని దేవతల అలయాలకి వెళ్ళిన అనుభూతి కలుగుతుంది. 23 అడుగుల ప్రత్యేక శివలింగం కూడా ఉన్నది. ప్రతి శివరాత్రి కి ఇక్కడ ప్రత్యేక అభిషేకం చేస్తారు. 

అలయ దర్శన సమయం :

ఉదయం : 07:00 నుంచి 01:00 
మధ్యాన్నం : 01:00 నుంచి 03:00 బ్రేక్ 
సాయంత్రం :03:00 నుంచి 07:00 వరకు 

పండుగలు మరియు శివరాత్రి సమయంలో ఇక్కడ ఆన్నదాన ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ఆ సమయంలో విశేష భక్తులు రావడం విశేషం. కేవలం సంప్రదాయం దుస్తులలో మాత్రమే అనుమతించబడును. 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana