Sri Sammakka House | Bayyakkapeta | Medaram | Telangana

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ప్రాంతంలోనే మన గిరిజన వనదేవతగా పూజలు అందుకుంటున్న శ్రీ సమ్మక్క అమ్మవారి ఇల్లు ఇది. ఈ ఆలయం లోనే మాన అమ్మ చిన్నప్పటి నుంచి ఇక్కడే నివసిస్తూ ఉండేది అని భక్తుల నమ్మకం. ఈ ప్రాంతం మేడారం నుంచి కేవలం 11 కి. మీ దూరంలోనే ఉంటుంది. హైదరాబాద్ నుంచి కేవలం 250కి. మీ దూరంలోనే ఉంటుంది. 

ఈ ప్రాంతంలో సమ్మక్క అమ్మవారు లోపల పైన చూపిస్తున్న ఫోటోలో ఉన్నటువంటి ఇంటిలోనే నివసిస్తూ ఉండేవారు. ఈ ప్రాంతంలో అమ్మవారు చిన్నప్పుడు వాడిన మంచం , పెట్టె ని కూడా చూడవచ్చు. ఇప్పుడు ఈ ఇంటిలోపల పుట్ట ఉన్నది. అందులో ఒక పాము ఇప్పటికి ఉన్నది అని భక్తుల నమ్మకం. ఆ పాము ఎవరికి హాని చేయదు అని ఇక్కడ భక్తుల నమ్మకం. ఇక్కడ నుంచి మనం మేడారం , అక్కడ నుంచి శ్రీ రామప్ప ఆలయం , లక్కన్నవరం బ్రిడ్జ్ ని కూడా చూడవచ్చు. వర్ష కాలం సమయంలో ఈ ప్రాంతాలు చూడడానికి చాలా బాగా ఉంటాయి. 

ఆలయ దర్శన సమయం :

ఉదయం : 07:00 నుంచి సాయంత్రం : 05:00 

అటవీ ప్రాంతం కావడం వల్ల చాలా తొందరగానే ఈ ఆలయాన్ని మూసివేస్తాతారు. మేడారం జాతర సమయంలో రద్దీ చాలా అధికంగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి బంగారం సమర్పిస్తారు. ఇక్కడ  బంగారం అంటే ఇక్కడ బెల్లం అని అర్ధం.  

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana