Sri Veerabhadra Swamy Temple | Kothakonda | Warangal | Telangana
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ దేవాలయం పూర్వం చాలా చిన్నగా ఉండేది. కానీ భక్తుల తాకిడి అధికంగా అవడం, ధర్మ బద్దమైన కోరిన కోరికలు నెరవేరడం వల్ల ఈ ఆలయానికి వచ్చే భక్తులు కాలాక్రమేన పెరగడం వల్ల ఆలయంని పెద్దగా నిర్మించినారు.
ఈ ఆలయం వరంగల్ నుంచి కేవలం 40కి. మీ దూరంలో కొత్తకొండ గ్రామం వద్ద ఉన్నది. ఈ దేవాలయానికి సంక్రాంతి సమయంలో సుమారు 50000 మంది కంటే ఎక్కువ భక్తులు వస్తారు. ఆ సమయంలో స్వామి వారికి ఉత్సవాలు జరుగుతాయి. కేవలం ఈ గ్రామంలో వారు మాత్రమే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తారు. ఈ ఆలయాం పూర్వం ఒక వ్యక్తికి స్వామి కలలో కనిపించి తనను 7 ఎడ్ల బండ్ల మీద తీసుకొని ఈ ప్రాంతంలో ప్రతిష్ట చేయాలి అని చెప్పగానే అతను ఉదయం అందరికీ చెప్పడు. అలా స్వామి కోరుకున్న ప్రాంతంలోనే ప్రతిష్ట జరిగినది. కానీ ఒక కొండ కనిపిస్తుంది కదా. ఆ కొండ మీద ఒక చిన్న శివాలయం ఉన్నది. ట్రేకింగ్ని ఇష్ట పడే వాళ్ళు ఈ కొండ మీదకి నడచుకుంటా వెలుతారు. అక్కడ ఒక చిన్న శివలింగం ఉంటుంది. అది ఎవరు ప్రతిష్ట చేశారు ఇప్పటికి తెలియదు. చాలా చిన్న శివలింగం. దర్శనం అయిపోయిన తరువాత ఆ కొండ శివాలయం నుంచి కిందకు చూస్తే చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది ఈ ఊరు. శివరాత్రి సమయంలో రద్దీ అధికంగా ఉంటుంది.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 01:00
మధ్యాన్నం : 01:00 నుంచి 04:00 బ్రేక్
సాయంత్రం : 04:00 నుంచి 07:30
ఈ స్వామి కి ఉత్సలు జరిగే సమయంలో మరియు ఇతర ముఖ్యమైన పండుగల సమయంలో ఆలయ దర్శన సమయంలో మార్పులు ఉంటాయి. భక్తులు గమనించగలరు. మరియు అందరూ సంప్రదాయ దుస్తులలో మాత్రమే రావాలి.
#Sri Veerabhadra Swamy Temple #Kothakonda #Warangal #Telangana

Comments
Post a Comment