Swayabhu Hanuman Temple | Bhavani Nagar | Old Alwal | Secunderabad | Hindu Temples Guide
ఈ ఆలయం చాలా విశేషమైన ఆలయం. సాధారణంగా మనం ఏలాంటి ఆంజనేయ స్వామి ఆలయం చూసిన స్వామి చాలా వరకు నిల్చొని లేదా ధ్యాన మూర్తిలో ఉండే శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటాం. కానీ ఈ ఆలయంలో అలా కాకుండా పూర్తిగా ఒక విశేష రూపంలో ఉన్న స్వామిని దర్శించుకుంటాం.
ఈ ఆలయం సికింద్రాబాద్ లోని ఓల్డ్ ఆల్వాల్ వద్ద గల భవానీ నగర్ లో ఈ ఆలయం ఉన్నది ఈ ఆలయం పూర్తిగా స్వయంభూ స్వామి. మరియొక్క విశేషం ఏమిటి ఆలయం ఇక్కడ స్వామికి మొత్తం చుట్టూరా తమల ఆకులు పేడుతారు. ఈ ఆలయంలో 21 శనివారాలు స్వామిని దర్శించుకొని ప్రదక్షిణ చేస్తే మనస్సు శాంతి పొందుతుంది అని శరీరం మీద ఎటువంటి గాలి వంటివి ఉన్న కూడా శరీరాన్ని వదిలి పరిపోతాయి అని ఇక్కడి భక్తుల విశ్వాసం. ఇలా చాలా మంది ఇక్కడకి వచ్చి స్వామి దర్శనం చేసుకొని హనుమాన్ చాలీసా మరియు స్వామి భజన చేస్తారు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి 10:30
మధ్యాన్నం : 10:30 నుంచి 05:30 బ్రేక్
సాయంత్రం : 05:30 నుంచి నుంచి 07:30
హనుమాన్ జయంతి రోజున మరియు శ్రీ రామ నవమి రోజున మరియు ఇతర ముఖ్య పర్వ దినములలో దర్శన సమయంలలో మార్పులు ఉంటాయి. భక్తులు గమనించగలరు.
#Swayabhu Hanuman Temple #Bhavani Nagar #Old Alwal #Secunderabad #Hindu Temples Guide

Comments
Post a Comment