Sitaram Bagh Temple | Hyderabad | Telangana

 


ఈ ఆలయం హైదరాబాద్ లో ఉన్న అత్యంత పురాతన ఆలయలలో ఈ ఆలయం ఒకటి. ఈ దేవాలయం సుమారు 200 సం || కంటే క్రితమే నిర్మించారు. ఈ ఆలయం హైదరాబాద్ లోని మల్లె పల్లి వద్ద కొద్ది దూరంలో ఉంటుంది. ఈ ఆలయం బయటికి చిన్నగా కనిపించిన లోపల చాలా పెద్దగా ఉంటుంది. 

ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ రామచంద్రమూర్తి స్వామి. మొదట మనం ఆలయం ప్రారంభంలోనే పెద్ద ప్రవేశ ద్వారం ఉంటుంది. ఆది దాటుకొని లోపలికి వెళితే రెండవ ద్వారం గుండా లోపలికి వెళ్ళాలి. పైన ఫోటోలో కనిపించేదే రెండవ ద్వారం. తరువాత 200 మీటర్లు నడిస్తే పెద్ద గుండంని చూడవచ్చు. ఆది కూడా దాటుకొని వెళితే అప్పుడు ప్రధాన ఆలయ ప్రవేశ ద్వారం దగ్గరికి వెలుతాము. అక్కడి నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళాలి. మొదట శ్రీ ఆంజనేయ స్వామి  తరువాత శ్రీ సీతరామ లక్ష్మణ స్వామి దర్శనం చేసుకోవచ్చు. ఆలయం పక్కనే ఇతర చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి. గణపతి , దుర్గా , శివ ఆలయాలు ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా సుమారు 50 మందికి నిద్రకి సరిపడా పెద్ద పెద్ద హాలులు 3 ఉన్నాయి. యాగశాల కూడా ఉన్నది. శ్రీ రామ నవమి , శ్రీ ఆంజనేయ స్వామి ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి. 


ఆలయ దర్శన సమయం :

ఉదయం : 07:00 నుంచి 11:30 

మధ్యాన్నం : 11:30 నుంచి 05:00 బ్రేక్ 

సాయంత్రం : 05:00 నుంచి 07:30 


#Sitaram Bagh Temple  #Hyderabad  #Telangana 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana