Sree Gayatri Mata Temple | Near Chilkur Balaji | Chilkur | Hyderabad
ఈ ఆలయం తెలంగాణలో ఉండడం అత్యంత విశేషం ఎందుకు అనగా ఇలాంటి ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ వేదమాతా శ్రీ గాయత్రి దేవి. ఈ ఆలయం చిలకుర్ బాలాజీ ఆలయానికి కేవలం 2.5కి. మీ దూరంలోనే ఉన్నది. చాలా మందికి ఈ ఆలయం గురించి తెలియదు.
ఈ దేవాలయం నిర్మించి సుమారు 2 దశాబ్దాలు పైనే అయినది. అనగా 20 సం || పైనే జరిగినది. ఈ ఆలయాన్ని సరిగ్గా 2003 సం || లో ప్రేమలత అనే భక్తురాలికి కలలో కనిపించి తనకి ఆలయం నిర్మించామని అడుగగా ఆమె మరియు గ్రామస్తులు మరియు అందరి సహకారంతో ఈ ఆలయాన్ని నిర్మించినారు. ఈ ఆలయంలో అమ్మవారు దశ చేతులతో పంచ ముఖాలతో అనగా ఈ ఐదు ముఖలే పంచ భూతాలు గా భావిస్తారు.
ఈ ఆలయంలో మనం శ్రీ గాయత్రి దేవితో పాటుగా శ్రీ ఆంజనేయ స్వామి , శ్రీ గణపతి స్వామి , శివయ్య ఆలయం , శ్రీ నాగదేవత ఆలయాలు కూడా దర్శించవచ్చు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 05:00
సాయంత్రం : 05:00 నుంచి 08:00
ఈ ఆలయంలో దసరా ఉత్సవాలు మరియు శివరాత్రి సమయంలలో మరియు ఇతర ముఖ్య సమయంలలో ఆలయ దర్శన సమయంలో మార్పులు ఉంటాయి. భక్తులు గమనించగలరు.
#Sree Gayatri Mata Temple #Near Chilkur Balaji #Chilkur #Hyderabad

Comments
Post a Comment