Sri Laxmi Narasimha Swamy Temple | Nacharamgutta | Telangana
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయానికి విశేషమైన చరిత్ర ఉన్నది. కానీ సరియైన ప్రజాదరణ లేక మరియు పూర్వపు ప్రభుత్వల సరియైన సహాయం లేక ఈ ఆలయం శిధిలావస్థకి చేరుకున్నది. ఈ ఆలయం హైదరాబాద్ కి కేవలం 56కి. మీ దూరంలో మరియు గజ్జ్వేల్ - ప్రజ్ఞాపూర్ వెళ్ళే దారిలో హరిద్రానది (హల్దివాగు) ఒడ్డున వెలసివునది ఈ ఆలయం.
కృతాయుగంలో దుష్టశిక్షణ, శిష్ట రక్షణ కొరకు నృసింహ అవతారము వలస వెలువడిన ధ్వనికి భూగోళం అంతా దద్దరిల్లెను. శ్రీ నృసింహ గర్జన కొండలలోనికి, కొండ సొరంగములోనికి , గుహలలోనికి , అరణ్య ప్రాంతములొనికి ఎతైన పర్వత శ్రేణులలోనికి, నదీ ప్రవాహక ప్రాంతము లోనికి వ్యాపించెను.
శ్రీ నాచగిరి (శ్వేతగిరి) లక్ష్మి నరసింహ స్వామి క్షేత్రము కూడా అటువంటి ప్రాంతములలొ ఒకటి. అదే ఇప్పటి నాచారంగుట్ట ఆలయం. గార్గేయ మహర్షి నవనాథ మునులు నాచగిరి యందలి ఎతైన గుండ్ల నుండి వెలువడి నృసింహ గర్జన విని, ఈ స్థలము తపమాచరించిరి, శేషశాయిమాదిరి గల గుహను పరిశీలించగ శ్రీ స్వామి వారు స్వయంగా ఇక్కడకి వచ్చి విశ్రాంతి తీసుకున్నారు అని చరిత్ర.
ఈ ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి తో పాటు శ్రీ గణపతి , శివాలయం , శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయం , శ్రీ దుర్గా దేవి ఆలయం , శ్రీ రామ ఆలయం , శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం , శ్రీ సాయి బాబా ఆలయంలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం యాదగిరి గుట్ట ఆలయం వలె అభివృద్ది చెందడం కొరకు మన వంతు సహాయం చేయడం ఉత్తమం. ఇక్కడ ప్రతి రోజు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేస్తారు. ఇక్కడ ఆలయం కి కొద్ది దూరంలో పెద్ద వాగు ఉన్నాది. వర్ష కాలం లో వెళితే చాలా బాగా కనిపిస్తుంది.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 01:00
మధ్యాన్నం : 01:00 నుంచి 04:00 బ్రేక్
సాయంత్రం : 04:00 నుంచి 08:00
#Sri Laxmi Narasimha Swamy Temple #Nacharamgutta #Telangana

Comments
Post a Comment