Sri Kattamaisamma Temple | Begumpet | Hyderabad | Telangana
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయంలో అమ్మవారు శ్రీ కట్ట మైసమ్మ గా పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయం హైదరాబాద్ లోని బేగంపేట ప్రధాన రోడ్డు మీదనే ఉంటుంది. ఈ ఆలయం రోడ్డు మీద ఉండడం వల్ల సరియైన పార్కింగ్ సౌకర్యం లేదు. భక్తులు గమనించగలరు. కానీ ఈ అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు గా పూజలు అందుకుంటున్నారు.
ఈ ఆలయం లోని అమ్మవారు పూర్వం భక్తులకి కలలో కనిపించి ఇక్కడ తనకి గుడి కట్టమని చెప్పడం వల్ల భక్తులు చిన్న ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం దిన దినాభివృద్ది చెందుతూ భక్తులు అధిక సంఖ్యలో రావడం వారు కోరుకున్న కోరికలు తీరడం అలా చిన్న ఆలయం కాస్త ఇప్పుడు పెద్ద ఆలయంగా మార్పు చెందినది. ఈ ఆలయంలో అమ్మవారు ఒక పెద్ద గుట్ట లో నుంచి దర్శనం ఇవ్వడం గమనించవచ్చు. ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు కూడా ఉన్నయీ. అవి సుమారు 100 సం || పైనవి అని చరిత్ర. వాటి కిందనే శ్రీ నాగదేవత విగ్రహాలు కూడా దర్శించవచ్చు. ఆషాడ మాసంలో మాత్రమే కాకుండా ఇక్కడ ప్రతి శుక్ర వారం , మంగళవారం , ఆదివారం అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. దసరా పండుగ చాలా పెద్ద ఎత్తున్న నిర్వహిస్తారు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 11:00
మధ్యాన్నం : 11:00 నుంచి 05:00 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 07:30 వరకు
#Sri Kattamaisamma Temple #Begumpet #Hyderabad #Telangana

Comments
Post a Comment