Sri Sangameshwara Swamy Temple | Maheshwaram(M) | Telangana
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయానికి సుమారు 400 సం || కంటే పూర్వమే నిర్మించారు అని చరిత్ర. ఈ ఆలయం చాలా చిన్నటి ఆలయం. ఏ రాజులు నిర్మించారో అని మాత్రం తెలియడం లేదు. ఈ దేవాలయం శ్రీశైలం వెళ్ళే దారిలో మహేశ్వరం మండలం వద్ద హైదరాబాద్ కి సుమరు 40 కి.మీ దూరంలో ఉంటుంది.
ఈ ఆలయం మీరు అస్సలు ఊహించినట్టు అస్సలు ఉండదు. చాలా చిన్న ఆలయం ఈ ఆలయం. పూర్తిగా రాతితో నిర్మించారు ఈ దేవాలయాన్ని. ఆలయ ప్రహరీ గోడ మాత్రం చాలా పెద్దగాను చాలా వెడల్పుగాను ఉంటుంది. ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శివయ్య. ఈ ఆలయం లోపలికి వెళ్ళగానే మొదట మనకి ఆలయ రక్షకుడు శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవాలి. తరువాత ఆలయ ప్రదక్షిణ చేసుకొని అంతరాలయం వెళితే చిన్నటి శివలింగం కనిపిస్తుంది. ఆలయం అంతా రాతి తో నిర్మించారు. అంతరాయంలోపల అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ బయట మాత్రం చాలా ఎండ తీవ్రత ఎక్కువగ ఉంటుంది.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 07:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 4:30 బ్రేక్
సాయంత్రం : 04:30 నుంచి 07:30
ఈ ఆలయంలో శివరాత్రి రోజు రద్దీ అధికంగా ఉంటుంది. ఈ దేవాలయం కొంచం నిర్మానుష్యమైన ప్రాంతంలో ఉండడం వల్ల భక్తులు సరిగ్గా రావడం లేదు.
#Sri Sangameshwara Swamy Temple #Maheshwaram(M) #Telangana

Comments
Post a Comment