Posts

Showing posts from December, 2025

Sthambala Maisamma Temple | Mandula Basti Temple | Bapu Nagar | Langar Houz | Hyderabad | Telangana

Image
  ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం. ఈ దేవాలయం ఇక్కడి గ్రామ దేవత అమ్మవారు పూజలు అందుకుంటారు. ఇక్కడి అమ్మవారు ఆలయం మొత్తం 02 అంతస్తులలో ఉంటుంది. మరియు ఇండ్ల మధ్యలో ఈ ఆలయం ఉంటుంది.  ఈ ఆలయం హైదరాబాద్ లోని లంగర్ హౌస్ బాపు ఘాట్ మందూల బస్తి వద్ద ఈ స్థంబాల మైసమ్మ ఆలయం ఉన్నది. ఈ ఆలయం దొరకడం కొంచం కష్టం అందుకు గల కారణం ఈ ఆలయం ఇండ్ల మధ్యలో ఉంటుంది.  ఈ దేవాలయంలో అమ్మవారు ప్రసన్న వదనంతో చూడగానే ఒక్కసారి ఆకర్శించే విధంగా చక్కగా ఉంటారు. ఈ ఆలయంలో ప్రతి సం || ఆషాఢ మాసంలో బోనాల పండుగ నిర్వహిస్తారు. అదే విధంగా ఆశ్వయుజ మాసంలో అమ్మవారికి దేవి నవరాత్రి ఉత్సవాలు కూడా జరుపుతారు.అప్పుడు ఆలయం అలంకరణ చాలా బాగా ఉంటుంది.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 06:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి 08:00  #Sthambala Maisamma Temple  #Mandula Basti Temple  #Bapu Nagar  #Langar House  #Hyderabad  #Telangana 

Hanuman Mandir | Radha Nagar | Hyder shah Kota | Bhandlaguda Jagir | Hyderabad | Telangana

Image
  ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం. ఈ దేవాలయం ఇక్కడ చాలా ప్రసిద్ది చెందినది. ఈ ఆలయంలో స్వామి చాలా శక్తివంతమైన స్వామి. ఈ దేవాలయంలో శ్రీ ఆంజనేయ స్వామి వారు కుడి వైపున మనకి దర్శనం ఇస్తారు.  ఈ దేవాలయం హైదరాబాద్ లోని బండ్ల గూడ జాగీర్ వద్ద గల హైదర్ షాహ్ కోట కి అతి చేరువలో గల రాధా నగర్ అనే గ్రామంలో ఈ ఆలయం కలదు. ఈ ఆలయం గూగుల్ మాప్ లో కూడా ఉన్నది.  ఈ ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామి తో పాటు శ్రీ గణపతి స్వామి మరియు శివాలయం కూడా ఉన్నది. ప్రతి సం || మహా శివరాత్రి ఈ ఆలయంలో చాలా వైభవంగా జరుపుతారు. ఆ రోజు స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు కూడా నిర్వహించి అర్చనాలు , హోమలు కూడా నిర్వహిస్తారు. ఈ ఆలయంలో మహాశివలింగం తో పాటు శ్రీ మహాగణపతి స్వామి కూడా దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలయంలో శ్రీ మహాగణపతి  స్వామి నవరాత్రి ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు.  ఈ ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామి జయంతి రోజున స్వామి వారికి తామర ఆకులతో ప్రత్యేక అలంకరణ చేస్తారు. మధ్యాన్నం సామూహిక ఉచిత అన్నదాన ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. కేవలం సంప్రదాయ దుస్తులలో వచిన్న వారికి మాత్రమే ఆలయానికి అనుమతి ఇస్తారు. మగవారు పంచ దొతి లేదా పాంట్ షర్ట్ మరియ...

Sri Renuka Yellamma Thalli Temple | Gandhi Nagar Colony | Upperpally | Attapur | Hyderabad | Telangana

Image
  ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం. ఈ దేవాలయంలోని ప్రధాన దేవత మూర్తి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి. ఈ ఆలయం ఇక్కడి గ్రామానికి గ్రామ దేవతగా పూజలు అందుకుంటూ ప్రసిద్ది చెందిన దేవాలయంగా చెప్పవచ్చు.  ఈ ఆలయం హైదరాబాద్ లోని మెహిందీపట్నం నుంచి అత్తాపూర్ మీదుగా ఉప్పర్ పల్లి అనే గ్రామం వద్ద గలా గాంధీనగర్ కాలనీ కి మధ్యలో ఈ ఆలయం ఉంటుంది.  ఈ ఆలయంలోని అమ్మవారికి ఇక్కడి భక్తులు ఆషాఢ మాసం బోనాలు సమర్పిస్తారు. కేవలం ఈ ఆచారం ఆషాఢ మాసంలోనే కాకుండా ప్రతి మంగళవారం మరియు శుక్రవారం మరియు ఆదివారం కూడా ఇక్కడ అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తారు. ఆశ్వయుజ మాసంలో ఇక్కడ దేవి నవరాత్రులు చాలా ఘనంగా నిర్వహిస్తారు. 9 రోజుల పాటు అమ్మవారికి పూజలు నిర్వహించి 10వ రోజు దసరా పండుగ ఉత్సవాలు జరుపుతారు.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 06:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్ సాయంత్రం : 05:00 నుంచి 08:00  #Sri Renuka Yellamma Thalli Temple  #Gandhi Nagar Colony  #Upperpally  #Attapur  #Hyderabad  #Telangana 

Sri Maisamma Temple | Attapur | Tejaswini Nagar | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయంలోని అమ్మవారు ఇక్కడ గ్రామానికి గ్రామ దేవతగా పూజలు అందుకుంటున్నారు. ఈ ఆమ్మవారి ఆలయం చాలా చిన్నగా ఉంటుంది.  ఈ ఆలయం హైదరాబాద్ లోని అత్తాపూర్ వద్ద గల తేజస్విని నగర్ వద్ద కలదు. శ్రీనికేతన్ స్కూల్ కి ఎదురుగా ఉన్నారు రోడ్ మీదుగా కుడి సైడ్ వెళితే ఈ ఆలయం వస్తుంది. ఈ ఆలయం ప్రధాన రహదారి మీద ఉండడం వల్ల సరియైన పార్కింగ్ సౌకర్యం లేదు.  ఈ ఆలయంలో మొదట చిన్న ధ్వజ స్తంభం దర్శించుకొని కొంచం లోపలికి వెళ్ళగానే ఆలయం పైన శ్లాబ్ నాగ దేవత రూపంతో చాలా చక్కగా కనిపిస్తుంది. గంట కొట్టి లోపలికి వెళ్ళగానే అమ్మవారి అంతరాయం వరకు వెళ్లవచ్చు.  ప్రతి సం || ఆశ్వయుజ మాసంలో అమ్మవారికి దసరా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి సం || ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 06:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి 07:00  #Sri Maisamma Temple  #Attapur  #Tejaswini Nagar  #Hyderabad 

Bramhasutra Omkareshwara Swamy Temple | Beside ORR Road | Manchirevula | Gandipet | Rangareddy | Hyderabad

Image
  ఈ దేవాలయం చాలా పురాతన ఆలయం. ఈ దేవాలయం 1100 సం || కాలంలో కట్టిన దేవాలయం ఈ ఆలయం. ఈ ఆలయం దర్శనం చేసుకుంటే సర్వపాప హరణం ఇక్కడి భక్తుల విశ్వాసం.  1000సార్లు ఒక శివాలయం దర్శనం చేసుకుంటే ఎంతటి ఫలితం వస్తుందో అంతటి గొప్ప ఫలితం ఈ ఆలయం ఒక్కసారి దర్శనం చేసుకుంటే లభిస్తుంది అని పెద్దల విశ్వాసం. అందుకు ప్రధాన కారణం ఈ ఆలయంలోని శివలింగం బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం.  ఈ ఆలయం హైదరాబాద్ లోని ఓ ఆర్ ఆర్ రోడ్ పక్కన మంచిరేవుల అనే గ్రామానికి అతి చేరువలో ఈ దేవాలయం కలదు. గూగుల్ మాప్ లో కూడా ఈ ఆలయం ఉన్నది.  ఈ ఆలయంలో ప్రతి నెల మాస శివరాత్రి రోజున విశేష పూజ జరుగుతుంది. మరియు మహా శివారాత్రి రోజున ఉదయం నుంచి అర్ధ రాత్రి వరకు స్వామి వారికి అభిషేకలు జరుగుతాయి. ఈ దేవాలయంలో ఇతర ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. శ్రీ మహాగణపతి స్వామి ఆలయం, శ్రీ సుబ్రమణ్య స్వామి,  శ్రీ కాలభైరవస్వామి ఆలయం, శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం పంచయతనం, శ్రీ దుర్గా దేవి ఆలయం. వీరభద్రుడు, నాగఫణి దేవాలయాలు కూడా ఉన్నాయి. శ్రావణమాస మహోత్సవాలు నిర్వహింపబడును.  కార్తీక మాసంలో మరియు ఆర్ర్ధ  నక్షత్రం రోజున ప్రత్యేక పూజలు కూడా నిర్వ...

Sri Thulja Bhavani Maata Temple | Rambagh Colony | Huda Colony | Attapur | Hyderabad

Image
    ఈ ఆలయం చాలా చిన్న ఆలయం. ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ తుల్జా భవాని మాతాగా  దేవాలయంలో పూజలు అందుకుంటున్నది. ఈ ఆలయంలో తుల్జా భవాని అమ్మవారు ఆలయం చిన్నగా ఉన్న కూడా ఇక్కడ అమ్మవారు చాలా శక్తివంతమైన గ్రామ దేవతగా పూజలు అందుకుంటున్నారు.  ఈ ఆలయం హైదరాబాద్ లోని అత్తాపూర్ వద్ద ఉన్న రాంబాఘ్ కాలనీ కి మరియు హుడా కాలనీ కి మధ్యలో ఈ దేవాలయం ఉంటుంది. ఈ ఆలయానికి పెద్ద పార్కింగ్ సౌకర్యం లేదు. కేవలం ద్వి చక్ర వాహన పార్కింగ్ సౌకర్యం మాత్రమే కలదు.  ఈ ఆలయంలో చాలా వరకు ఉత్తర భారత సంప్రదాయం ప్రకారం పూజలు జరుగుతాయి. ఈ ఆలయానికి తెలుగు భక్తులతో పాటుగా చాలా వరకు ఇక్కడి మరాఠీ భక్తులు రావడం విశేషం. ఈ ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు కూడా చాలా వైభవంగా నిర్వహిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజులలో అమ్మవారికి వివిధ రూపాలలో అమ్మవారు మనకి దర్శనం ఇస్తారు. విజయదశమి రోజున ఇక్కడ ఉచిత సామూహిక అన్నదాన ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ఈ ఆలయంలో కేవలం సంప్రదాయ దుస్తులలో మాత్రమే ఉంటే దర్శనానికి అనుమతి ఇవ్వబడును. మగవారు పంచ , ధోతి (లేదా) పాంట్ చొక్కా , మహిళలు చీర రవిక (లేదా) చూన్నితో కూడిన పంజాబీ డ్రస్.  ఆలయ దర్...

Sri Shivalayam Temple | Sai Hills Colony | Huda Colony | NM Guda | Attapur | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం. ఈ ఆలయం చాలా చిన్న ఆలయం. ఈ దేవాలయం ఒక ఇంటిలో మాదిరిలాగా నిర్మించి ఉంటుంది.  ఈ దేవాలయం హైదరాబాద్ లోని అత్తాపూర్ నుంచి కిషన్ బాఘ్ వెళ్ళే మార్గంలో వచ్చే హుడా కాలనీ నుంచి కుడి వైపు వెళ్ళితే సాయి హీల్స్ కాలనీ వద్ద ఉంటుంది. ఈ ఆలయానికి పెద్ద పార్కింగ్ సౌకర్యం లేదు. కేవలం ద్వి చక్ర వాహన పార్కింగ్ సౌకర్యం కలదు. వీధిలో భారీ వాహనాలు వెళ్లడానికి సౌకర్యంలేదు.  ఈ ఆలయంలో ప్రతి మాసంలో వచ్చే మాస శివరాత్రి రోజున విశేష పూజలు చేస్తారు. సం || లో ఒకసారి వచ్చే మహాశివరాత్రి రోజున ఈ ఆలయం చాలా రద్దీగా ఉంటుంది. ఈ ఆలయంలో ఇతర ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. అందులో శ్రీ మహాగణపతి ఆలయం , శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం , పక్కనే శ్రీ దుర్గా మాతా అమ్మవారి ఆలయం కూడా ఉన్నది.  శ్రీ మహాగణపతి  ఉప ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి. ఈ ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో కూడా శ్రీ హనుమాన్ జయంతి రోజున కూడా చాలా పెద్దగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో ప్రత్యేకంగ శ్రీ పాండురంగ మహత్యం చాలా బాగా జరుగుతుంది. కేవలం సంప్రదాయం దుస్తులలో మాత్రమే అనుమతి ఇవ్వబడును. మగ వారు పంచ, దొతి (లేద...

Sri Kanaka Durga Devi Temple | Tallagadda | Gudimalkapur | Hyderbad | Telangana

Image
  ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం. ఈ దేవాలయం ఇక్కడ సుమారు 30 సం || కంటే ముందు నుంచి ఇక్కడ ఉండేధి. అప్పుడు చాలా చిన్న అలయంగా ఉండేధి. ఇక్కడి భక్తులు అందరూ కలిసి కొద్ది కొద్దిగా పెద్దగా నిర్మించుకున్నారు.  ఈ ఆలయం హైదరాబాద్ లోని మెహిందీపట్నం కి అతి చేరువలో గల గుడిమల్కాపూర్ తాళ్ళగడ్డ అనే గ్రామంలో కలదు. ఈ ఆలయం చాలా చిన్న ఆలయం. ద్వి చక్ర వాహన పార్కింగ్ సౌకర్యం లేదు.  ఈ దేవాలయంలో ప్రతి సం || ఆషాఢ మాసంలో బోనాలా పండుగ చాలా పెద్ద ఏతున్న జరుగుతుంది. పోతరాజున నృత్యాలు , డప్పు చప్పులు చాలా వైభవంగా జరుగుతుంది.  ఈ దేవాలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తారు. 9 రోజుల పాటు పూజలు చేసి 10 వ రోజు దసరా పండుగ నిర్వహిస్తారు.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 06:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి 08:00  #Sri Kanaka Durga Devi Temple  #Tallagadda  #Gudimalkapur  #Hyderbad  #Telangana 

Sri Nalla Pochamma Temple | Satyanarayana Nagar | Ramsighnagar | Karwan | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం. ఈ ఆలయం సుమారు 40 సం || కంటే ముందు నుంచే ఇక్కడ కలదు. అప్పుడు ఈ అమ్మవారి ఆలయం చాలా చిన్నగా ఉండేధి. భక్తులు అందరూ కలిసి ఈ ఆలయాన్ని పెద్దగా పునఃనిర్మించుకున్నారు. ఈ ఆలయం ప్రధాన రహదారి మీదనే ఉండడం వల్ల సరియైన పార్కింగ్ సౌకర్యం లేదు.  ఈ ఆలయం హైదరబాద్ లోని మెహిందిపట్నం కి దగ్గరలో గల కార్వాన్ కి వెళ్ళే దారిలో సత్యానారాయణ నగర్ కి మరియు రామ్సిఘ్ నగర్ కి మధ్యలో ఈ దేవాలయం ఉంటుంది. ఈ ఆలయం చాలా చిన్న ఆలయం.  ఈ దేవాలయంలో ప్రతి సం || ఆషాఢ మాసంలో అమ్మవారికి మహిళా భక్తులు పెద్ద ఎత్తున్న బోనాలు సమర్పిస్తారు. ఈ అమ్మవారు ఇక్కడ గ్రామ దేవతగా వెలిశారు. ఇక్కడ అమ్మవారికి బోనాల పండుగల సమయంలో భక్తులు బోనాలతో పాటు యటాలను సమర్పిస్తారు.  ఆశ్వయుజ మాసంలో ఇక్కడ దసరా నవరాత్రి ఉత్సవాలు కూడా చాలా బాగా నిర్వహిస్తారు. ఇక్కడి గ్రామ ప్రజలు అమ్మవారి pop విగ్రహాన్ని తయారు చేపించుకొని నవరాత్రులు ఉత్సవాలు చేసి 10వ రోజు దసరా నిర్వహించి గంగమ్మ వదిలోకి చేర్చుతారు.  ఆలయ దర్శణా సమయం :  ఉదయం : 06:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్  సాయంత్రం : 05:00 ను...

Hasthala Veerabhadara Swamy Temple | Chintalmet | Hyderguda | RajendhraNagar | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ దేవాలయం పూర్తిగా ఇతర మతస్థుల అధీనంలో ఉన్నది. అందుకే సరియైన అభివృద్ది జరగడం లేదు. ఇంతటి పురాతనమైన దేవాలయం అభివృద్ది జరగకపోవడం చాలా భాదకరం.  ఈ దేవాలయం హైదరాబాద్ లోని మెహిందీపట్నం నుంచి మీదుగా ఉప్పర్ పల్లి బస్ స్టాప్ నుంచి కేవలం 05 కి. మీ దూరంలోనే ఉంటుంది. ఈ ఆలయంలోని స్వామి స్వయంభూ స్వామి.  ఈ దేవాలయంలోని స్వామి స్వయంభూ స్వామి. ఇక్కడ శ్రీ కాళికాదేవి కూడా ఉంటారు. ఇక్కడ అమ్మవారు కూడా కొండల మధ్యలో వెలిసినది. ఈ స్వామి దర్శనం అంతా ఈసీగా లభించదు.  ఆలయ దర్శణా సమయం :  ఉదయం : 06:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 02:00 బ్రేక్  సాయంత్రం  : 02:00 నుంచి 07:00  #Hasthala Veerabhadara Swamy Temple  #Chintalmet  #Hyderguda  #RajendhraNagar  #Hyderabad 

Jagadish Mandir | Backside of Croma | Hyderguda | Attapur | Hyderabad

Image
  ఈ‌ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం సుమారు 250 సం|| కంటే పురాతనమైన దేవాలయం. ఈ ఆలయం కొంచం చిన్నగా ఉన్న కూడా పార్కింగ్ సౌకర్యం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. సుమారు 50 ద్విచక్ర వాహనాలు , కార్లు కూడా నిలుపవచ్చు. కేవలం ఒక్క చిన్న రూమ్ అంతా స్థలం లోనే ఈ దేవాలయం ఉంటుంది.  ఈ ఆలయం హైదరాబాద్ లోని మెహిదీపట్నం నుంచి అత్తాపూర్ మీదుగా హైదర్ గూడ వద్ద గల క్రొమా వెనుకనే ఈ దేవాలయం కలదు. పక్కనే కాలహనుమాన్ మందిర్ పక్కనే ఉంటుంది. అక్కడే పెద్ద గోశాల కూడా ఉన్నది.  ఈ ఆలయంలో ప్రతి సం || ఒరిస్సా లో శ్రీ జగ్గనాథ్ స్వామి కి ఉత్సవాలు జరిపినప్పుడు ఇక్కడ కూడా ఉత్సవాలు నిర్వహిస్తారు. రధోత్సవం కూడా చాలా బాగా జరుగుతుంది. ప్రతి రోజు ఉదయం సాయంత్రం జరిగే హారతి తప్పకుండ చూడవలసిందే.  ఆలయ దర్శణా సమయం :  ఉదయం : 06:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి 08:00  #Jagadish Mandir Backside of Croma #Hyderguda #Attapur  #Hyderabad 

Sri Santhoshi Mata Temple | Attapur | Hyderabad | Telangana

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ అమ్మవారి పేరు మీద అత్తాపూర్ మొత్తంలో ఈ శ్రీ సంతోషిమాత  పేరు మీద ఒక్క ఆలయం మాత్రమే ఉన్నది.  ఈ ఆలయం హైదరాబాద్ లోని మెహిందీపట్నంకి అతి చేరువలో గల అత్తాపూర్ వద్ద ఈ దేవాలయం ఉన్నది. ఈ ఆలయం చాలా చిన్న ఆలయం. 30*40 ఒక్కే రూమ్ లో ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం చాలా చిన్నగా ఉంటుంది. అత్తాపూర్ లోని ఈశ్వర్ థియేటర్ నుంచి నడుచుకుంటూ ఈ ఆలయానికి చేరుకోవచ్చు.  ఈ ఆలయం కేవలం శుక్రవారం మాత్రమే తెరిచి ఉంటుంది. మరియు ప్రత్యేక పండుగ రోజులలో మాత్రమే తెరిచి ఉంటుంది. కేవలం ద్విచక్ర వాహన పార్కింగ్ సౌకర్యం మాత్రమే ఉంటుంది.  ఆలయ దర్శణా సమయం శుక్రవారం మాత్రమే :  ఉదయం : 06:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి 07:30 వరకు  #Sri Santhoshi Mata Temple  #Attapur  #Hyderabad  #Telangana 

Sri Mahankali Temple | Gowliguda | Hyderabad | Telangana

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం సుమారు 200 సం|| కంటే పురాతనమైనది. అప్పుడు ఈ దేవాలయం చాలా చిన్నగా ఉండేధి. భక్తులు అందరూ కలిసి ఈ ఆలయాన్ని పునఃనిర్మించుకున్నారు. ఈ ఆలయం హైదరాబాద్ లోని ప్రధాన బస్ స్టేషన్ ఐన MGBS మరియు అఫ్జల్ గంజ్ కి మధ్యలో ఈ దేవాలయం ఉంటుంది. ఈ ఆలయం కొంచం చిన్నగానే ఉన్న కూడా ఇక్కడ ప్రాంతం లో ఈ ఆలయం చాలా ప్రసిద్ది చెందినది.  ఈ ఆలయంలో ప్రధానంగా శ్రీ మహంకాళి అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. ఈ దేలయంలో ఇతర ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. మొదట గణపతి , గొడలమీద శ్రీ మహాలక్ష్మీ దేవి, ఉత్సవ మూర్తులు కలవు. ప్రతి సం || ఆషాఢ మాసంలో బోనాల పండుగ చాలా పెద్ద ఎత్తున్న నిర్వహిస్తారు. మహిళా భక్తులు అమ్మవారికీ ఉదయం నుంచి సాయంత్రం వరకు బోనాలు సమర్పించి సాయంత్రం లేదా మరుసటి రోజు సాయంత్రం ఘటలా ఊరేగింపు జరిపి పోతరాజుల నృత్యాలు , చాలా పెద్ద ఎత్తున్న నిర్వహిస్తారు. అప్పుడు చాలా మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఈ ఆలయాన్ని సందర్శించడానికి వస్తారు.  అశ్వయుజ మాసంలో అమ్మవారికి దసరా ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. 9 రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరణ చేసి 10వ రోజు దసరా ఉత్సవాలు జరుపుతారు....

Sri Sri Sri Eedhamma Temple | Radha Krishan Colony | Hyderaguda | Attapur | Hyderabad

Image
  ఈ దేవాలయం కొంచం పురాతనమైన దేవాలయం. ఈ ఆలయం కొంచం చిన్నగా ఉంటుంది. ఇక్కడ ప్రధాన దేవత మూర్తి శ్రీ శ్రీ శ్రీ ఈధమ్మ అమ్మవారు. ఈ అమ్మవారు ఇక్కడ గ్రామానికి గ్రామ దేవత. ప్రణవ భక్త సమాజం వారి ఆధ్వర్యంలో ఈ దేవాలయం నడపబడుతున్నది.  ఈ ఆలయం హైదరాబాద్ లోని అత్తాపూర్ వద్ద నుంచి రాధా కృష్ణా కాలనీ కి హైదర్ గూడ కి మధ్యలో ఈ దేవాలయం ఉంటుంది. ఈ దేవాలయం చిన్నగా ఉంటుంది. కానీ చాలా శక్తివంతమైన గ్రామ దేవత. ఈ ఆలయానికి కేవలం ద్వి చక్ర వాహన పార్కింగ్ సౌకర్యం మాత్రమే ఉన్నది.  ఈ ఆలయంలో ప్రతి సం || ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాల పండుగ చాలా పెద్ద ఎత్తున్న నిర్వహిస్తారు. ఇక్కడ నివసించే మహిలలో అమ్మవారికి బోనాలని చక్కగా అలంకరణ చేసి పోతరాజుల నృత్యలతో డప్పు వాయిద్యాలతో శివసత్తుల పూనకాలతో చాలా బాగా జరుగుతుంది.  తిరిగి ఆశ్వయుజ మాసంలో అమ్మవారికి దసరా సమయంలో ఈ ఆలయంలో చాలా రద్దీ ఉంటుంది. అమ్మవారికి దేవి నవరాత్రులు పూజలు నిర్వహించి 10వ రోజున దసరా చాలా పెద్ద ఎత్తున్న జరుగుతుంది.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 06:00 నుంచి 12:30  మధ్యాన్నం : 12:30 నుంచి 05:00 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి 08:00...

Sri Krishan Mandiram | Golkonda rd | Ramsingh Pura | Gudimalkapur | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయంలో చాలా ఉప ఆలయాలు ఉన్నాయి. ఈ దేవాలయం సుమారు 100 సం || ముందు నుంచే ఇక్కడ ఉన్నట్టు సమాచారం. ఈ ఆలయం చాలా పురాతనమైనది కావడం వల్ల భక్తులు ఈ ఆలయాన్ని పునః నిర్మించుకున్నారు.  ఈ ఆలయం హైదరాబాద్ లోని గోల్కొండ రోడ్ వద్ద గల గుడిమల్కాపూర్ రాం సింఘ్ పురా అనే గ్రామం లో కలదు. ఈ దేవాలయం కొంచం చిన్నగా కనిపించిన పార్కింగ్ మాత్రం కొంచం పెద్దగానే ఉంటుంది.  ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ కృష్ణా భగవానుడు. ఈ దేవాలయంలో ప్రధాన దేవత మూర్తి తో పాటు శ్రీ ఇతర ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం , పక్కనే గోశాల , దుర్గా దేవి ఆలయం కలదు. ప్రతి సం || దేవి నవరాత్రి ఉత్సవాలు కూడా చాలా బాగా జరుగుతాయి. ప్రతి రోజు గోవు పూజ చేస్తారు.  ఈ ఆలయంలో వైకుంఠ ఏకాదశి రోజున విశేష పూజ చేస్తారు. శ్రీ ఆంజనేయ స్వామి జయంతి రోజున కూడా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి అందరికీ సామూహిక అన్నదాన ప్రసాద వితరణ కూడా చేస్తారు. ఈ దేవాలయం శనివారం మరియు ప్రతి నెలలో వచ్చే కృష్ణా పక్షంలోని ఏకాదశి రోజున రద్దీ అధికంగా ఉంటుంది. కేవలం సంప్రదాయ దుస్తులలో మాత్రమే ఈ ఆలయంలోకి ప్రవేశం కలదు.  ఆ...

Sri Beerappa Swamy Temple | Earraboda | Upperpally | Attapur | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ దేవాలయం కొంచం పెద్దగానే ఉంటుంది. ఇక్కడ ఉన్న స్వామి కర్ణాటక లో చాలా ప్రసిద్ది చెందిన స్వామి బీరప్ప స్వామి.  ఈ ఆలయం హైదరాబాద్ లోని అత్తాపూర్ ఉప్పెర్పల్లి అనే గ్రామానికి కొద్ది దూరంలోనే ఎర్రబోడ అనే గ్రామం లో ఈ దేవాలయం కలదు. ఈ దేవాలయానికి కొంచం పెద్దగానే పార్కింగ్ సౌకర్యం కలదు. ద్వి చక్ర , త్రీ చక్ర , కార్ వంటి వాహనాలను కూడా పార్క్ చేయవచ్చు. వయోవృద్దుల కోసం ప్రత్యేక ప్రవేశ ద్వారం కలదు.  ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ బీరప్ప స్వామి పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయం లో ప్రతి సం || శివరాత్రి కి ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ దేవాలయంలో మొదట పెద్ద ధ్వజ స్తంభం ని దర్శించుకొని తరువాత శ్రీ బీరప్ప స్వామిని దర్శించుకోవాలి. ఈ ఆలయం కొంచం శివాలయాన్ని పోలి ఉంటుంది.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 06:00 నుంచి 12:30 మధ్యాన్నం : 12:30 నుంచి 04:30 బ్రేక్  సాయంత్రం : 04:30 నుంచి 08:00  #Sri Beerappa Swamy Temple  #Earraboda  #Upperpally  #Attapur  #Hyderabad 

Sri Veerabadhra Swamy Temple | kunwarjiguda | Jafferguda | Talla Gadda | Gudimalkapur | Hyderabad | Telangana

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం సుమారు 250 సం ||  కంటే ముందు నుంచే ఈ ఆలయం ఉన్నట్టు సమాచారం.ఈ ఆలయం అంతా రాతితో నిర్మించారు. కింద బండలను రాతితోనే ఉండడం గమనించవచ్చు. ఈ దేవాలయం రోడ్ నుంచి సుమారు 15 మెట్ల కిందకి ఉంటుంది.  ఈ ఆలయం హైదరాబాద్ లోని మెహిందీపట్నం గుడిమల్కాపూర్ కున్వర్జీ గూడ జఫ్ఫర్ గూడ అనే గ్రామాలకి మధ్యలో ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయం పార్కింగ్ కూడా చాలా పెద్దగానే ఉంటుంది. ఆలయం వెనుక పక్కన పార్కింగ్ సౌకర్యం కలదు.  ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ వీరభద్ర స్వామి. ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి తో పాటు ఇతర ఉప ఆలయాలు కూడా దర్శించవచ్చు.  ఈ ఆలయంలో శ్రీ హనుమాన్ ఆలయం, 3 శివాలయాలు , భధ్రకాళీ అమ్మవారి ఆలయం కూడా ఉన్నది. దసరా సమయంలో ఈ ఆలయంలో అమ్మవారికి వేశేష పూజలు జరుగుతాయి. శ్రీ ఆంజనేయ స్వామి జయంతి రోజున విశేష పూజలూ జరుగుతాయి. శ్రీ రామ నవమి రోజున స్వామి పూజ చేసి సీతారామ కళ్యాణం కూడా జరుగుతుంది.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 06:00 నుంచి 12:30  మధ్యాన్నం : 12:30 నుంచి 04:30 బ్రేక్  సాయంత్రం : 04:30 నుంచి 08:00  #Sri Veerabadhra Swamy  Temple  #ku...

Sree Vitthal Rukhmini Temple Rd | Shivaji Nagar | Huda Colony | Attapur | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ దేవాలయం పూర్తిగా మహారాష్ట్ర లోని శ్రీ విఠ్ఠల మహారాజ్ ఆలయంని పోలి ఉంటుంది. ఈ ఆలయంచిన్నగా ఉన్న కూడా చాలా రద్దీగా ఉంటుంది. ద్విచక్ర వాహన పార్కింగ్ సౌకర్యం మాత్రమే ఉన్నది.  ఈ ఆలయం హైదరాబాద్ లోని అత్తాపూర్ వద్ద గల శివాజీ నగర్ హుడా కాలనీ కి మధ్యలో ఉంటుంది. ఈ ఆలయ ప్రవేశ ద్వారం కొంచం చిన్నగా ఉన్న చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.  ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ కృష్ణా స్వామి. ఇక్కడ ఉన్న మహారాష్ట్ర భక్తులకి ఈ స్వామి ఆరాధ్య దైవం. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏమిటి అనగా ఇక్కడ ఉన్న స్వామి రుఖ్మిని తో కలిసి ఉండడం. ఈ ఆలయం లో స్వామి వారి పై కీర్తినాలు చేసిన భకుల మూర్తులను కూడా ఇక్కడ గమనించవచ్చు.  ఈ ఆలయంలో ప్రతి నెల వచ్చు ఏకాదశి రోజున విశేష పూజలు జరుగుతాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం స్వామి దర్శనం చేసుకొని ఉపవాస వ్రతాన్ని విడిచే వారు ఈ ఆలయంలో చాలా మంది కనిపిస్తారు.  ప్రతి సం|| వైకుంఠ ఏకాదశి రోజున స్వామి వారికి ప్రత్యేక పూజలు , అభిషేకాలు , అర్చనాలు , హోమలు జరుగుతాయి. ఆ రోజున మధ్యాన్నం సామూహిక ఉచిత అన్నదాన ప్రసాద వితరణ కూడా జరుగుతుంది.   ...

Sri Shiva Devalayam | Attapur Village | Rajendhra Nagar | Hyderabad

Image
  ఈ దేవాలయం చాలా పురాతన దేవాలయం. పూర్వం ఈ దేవాలయం చాలా చిన్నగా ఉండేధి. కానీ భక్తులు అందరూ కలిసి ఈ దేవాలయాన్ని పునః నిర్మించుకొని పెద్దగా కట్టుకున్నారు. ఈ దేవాలయం కొంచం చిన్నగా ఉంటుంది.   ఈ ఆలయం హైదరాబాద్ లోని రాజేంధ్ర నగర్ మండలం అత్తాపూర్ విలేజ్ లోపల ఈ దేవాలయం ఉన్నది. ఈ ఆలయం ప్రధాన రహదారి మీదనే ఉండడం వల్ల చాలా సునాయసంగానే కనిపిస్తుంది. ఈ ఆలయానికి సరియైన పార్కింగ్ సౌకర్యం లేదు.  ఈ దేవాలయంలో ఇతర ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. మొదట శ్రీ మహా గణపతి స్వామి మన సదాశివ పక్కనే ఉంటారు. తరువాత నంది విగ్రహం కూడా దర్శించవచ్చు. అటు తరువాత శివాలయ దర్శనం చేసుకొని బయటికి వచ్చేటప్పుడు శ్రీ సుబ్రమణ్య స్వామి దర్శనం చేసుకోవచ్చు.  ఈ దేవాలయంలో మరియొక్క ప్రధాన ఉప ఆలయం కూడా ఉన్నది. శ్రీ దుర్గా దేవి ఆలయం. ఈ ఆలయంలో ఆషాఢ మాసంలో బోనాలు సమర్పిస్తారు. ఆశ్వయుజ మాసంలో దేవి నవరాత్రుల ఉత్సవాలు జరిపి పదవ  రోజున అమ్మవారి ప్రత్యేక అభిషేకాలు చేసి హోమం చేసి కుంకుమార్చనలు కూడా చేస్తారు. ఈ ఆలయం ప్రత్యేక రోజులలో చాలా బాగా అలంకరణ చేస్తారు. అప్పుడు తప్పకుండా ఈ ఆలయ దర్శనం చేయాలి.  ఆలయ దర్శన సమయం :  ఉ...

Sri Mahankali Eallamma Temple | Kantha Reddy Nagar | Attapur | Hyderabad

Image
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం ఇక్కడ చాలా సం || నుంచే ఉన్నది. ఈ దేవాలయం ఇక్కడ సుమారు 35 సం || కంటే ముందు నుంచే ఉన్నట్టు సమాచారం. అప్పుడు ఇక్కడ అమ్మవారి ఆలయం చాలా చిన్నగా ఉండేధి.  ఈ ఆలయం హైదరాబాద్ లోని అత్తాపూర్ వద్ద గల కాంత రెడ్డి నగర్ కాలనీ కి మధ్యలో ఉంటుంది. ఈ ఆలయాన్ని ఇక్కడి భక్తులు ఈ గ్రామ దేవతా గా కొలుస్తారు.  ఈ దేవాలయంలో అమ్మవారు శ్రీ మహంకాళి ఎల్లమ్మ దేవతగా పూజలు అందుకుంటుంది. ప్రతి సం ఈ ఆలయంలో ఆషాఢ మాసంలో అమ్మవారికి భారీ సంఖ్యలో బోనాలు సమర్పిస్తారు. సాయంత్రం పోతరాజులు నృత్యలతో రంగా ప్రవేశం చేసి గ్రామంలోని అసుర శక్తులని సంహరించి  పూర్వం జంతు బలులు ఇచ్చే వారు కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ కోడి , మేక వంటి జంతువులని బలి ఇస్తారు.  ఆశ్వయుజ మాసంలో ఇక్కడ అమ్మవారి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు చాలా బాగా నిర్వహిస్తారు. 9 రోజులు పూజలు చేసి 10 వ రోజు దసరా పండుగ జరుపుతారు. ఈ ఆలయం కొంచం చిన్నగా ఉంటుంది.  ఈ ఆలయనికి చేరుకోవడానికి చాలా మార్గాలు ఉన్నది. ఎల్లమ్మ ఆలయం అని గూగుల్ మాప్ లో సర్చ్ చేస్తే ఈ దేవాలయం వస్తుంది. ఆలయం పేరు కింద కంతా రెడ్డి నగర్ కాలనీ అని గమనించాలి. లేని ...

Sri Lakshmi Narasimha swamy Temple | Tejaswini Nagar Colony | Attapur | Hyderabad

Image
   ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం పూర్తిగా రాతి కట్టడం తో చేసి ఉంటుంది. ఈ ఆలయం సుమారు 250 సం || కంటే ముందు నుంచే ఉన్నట్టు తెలుస్తుంది.  ఈ ఆలయం హైదరాబాద్ లోని అత్తాపూర్ కి అతి చేరువలో తేజస్విని నగర్ కాలనీ వద్ద ఉంటుంది. ఈ ఆలయం కొంచం చిన్నగా ఉంటుంది.  ఈ ఆలయం లో ఇతర ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. శ్రీ మహా గణపతి ఆలయం , నవగ్రహ ఆలయం , హోమ గుండం, గరుడ ఆలయం కలవు. ఈ ఆలయం కొంచం ఇంట్ల మధ్యలో ఉండడం వల్ల సరియైన పార్కింగ్ సౌకర్యం లేదు. కేవలం ద్వి చక్ర వాహనం మాత్రమే వెళుతుంది.  ఈ దేవాలయంలో ప్రతి సం || స్వాతి నక్షత్రం రోజున స్వామి వారికి విశేష పూజలు నిర్వహించి ఉత్సవాలు కూడా చేస్తారు. లక్ష్మి నరసింహ స్వామి వారికి ఇక్కడ ఆలయం చిన్నదిగా ఉన్న కూడా చాలా పురాతన ఆలయం కావడం వల్ల స్వామి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. జపం , హోమం చేసేవారు అది గమనిస్తారు.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 06:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి 08:00  #Sri Lakshmi Narasimha swamy Temple  #Tejaswini Nagar Colony  #Attapur  #Hyderabad 

Sri Padmavati Godasametha Sri Venkateshwara swamy Temple | Santhosh Nagar | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం ప్రధాన రహదారి మీదనే ఉంటుంది. ఈ దేవాలయం కొంచం చిన్నగా ఉన్న కూడా ఇలాంటి ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. వాటిని మనం తప్పకుండ దర్శించుకోవాలి.  ఈ ఆలయం హైదరాబాద్ లోని సంతోష్ నగర్ కి అతి చేరువలో గల యాదగిరి అనే సినిమా హాల్ కి కేవలం 01కి.మీ దూరంలోనే ఈ ఆలయం కలదు.  ఈ దేవాలయంలో పూర్తిగా తమిళ సంప్రదాయం ప్రకారం నిర్మించినట్టు కనిపిస్తుంది. ఈ ఆలయంలో ప్రతి సం || తిరుమంజనం , కోయిల్ ఆల్వార్ , గోదాదేవి ఉత్సవాలు కూడా జరుగుతాయి. ఈ ఆలయంలో వైకుంఠ ఏకాదశి రోజున విశేష పూజలు మరియు చాలా మంది భక్తులు కూడా స్వామి అమ్మవార్ల దర్శణానికి వస్తారు.  ఈ ఆలయంలో మొదట శ్రీ మహాగణపతి స్వామి , శ్రీ పద్మావతి , శ్రీ గోదాదేవి , శ్రీ వేంకటేశ్వర స్వామి , హోమగుండం , శ్రీ గరుడ ఆలయం , నవగ్రహ ఆలయం కూడా ఉన్నాయి.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 06:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్  సాయంత్రం : 05:00 నుంచి 08:00 వరకు  #Sri Padmavati Godasametha  Sri Venkateshwara swamy Temple  #Santhosh Nagar  #Hyderabad 

Sri Balaji Hanuman Mandir | 9no Road | Kishan Bagh | Attapur | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం కొంచం చిన్నగా ఉంటుంది. ఈ ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామి తో పాటుగా శ్రీ బాలాజి ఆలయం కూడా ఉంటుంది.  ఈ ఆలయం హైదరాబాద్ లోని అత్తాపూర్ వద్ద గల కిషన్ బాఘ్ అనే గ్రామం మరియు 9 నెంబర్ రోడ్ కి మార్గ మధ్యలో ఈ దేవాలయం కలదు. ఈ ఆలయం ఇతర మతస్థుల రోడ్ ప్రాంతంలో ఉండడం వల్ల కొన్ని సార్లు ఈ ఆలయం మీద దాడులు కూడా జరిగిన కూడా ఈ ఆలయం తట్టుకొని నిలబడడం చాలా గొప్ప విషయం.  ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ ఆంజనేయ స్వామి మరియు శ్రీ బాలాజి స్వామి కొలువై ఉన్నారు. ప్రతి సం || ఈ ఆలయంలో శ్రీ ఆంజనేయ జయంతి మరియు శ్రీ రామ నవమి చాలా పెద్ద ఎత్తున్న వేడుకలు నిర్వహిస్తారు. రాత్రి సమయంలో ఇక్కడ భజన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు.  ఈ దేవాలయం ప్రధాన రహదారి మీద ఉండడం వల్ల సరియైన పార్కింగ్ సౌకర్యం లేదు. శ్రీ రామ నవమి రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ఆలయంలో సామూహిక ఉచిత అన్నదాన ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి ఎదురుగా హోమగుండం కూడా ఉన్నది. ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం కావడం వల్ల ఇప్పుడు కొంచం పునః నిర్మాణం కూడా చేశారు.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 06:00...

Sri Hanuman Shiva Temple | Pochamma Basthi | Masab Tank | Mehindipatnam | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా పురాతన దేవాలయం. ఈ దేవాలయం కొంచం చిన్నగా ఉంటుంది. ఈ దేవాలయం చిన్నగా ఉన్న కూడా ఈ ఆలయన్ని ఒక్కసారి దర్శిస్తే మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది అని ఇక్కడి భక్తుల నమ్మకం.  ఈ దేవాలయం హైదరాబాద్ లోని మసబ్ టాంక్ వద్ద గల పోచమ్మ బస్తి కి దగ్గర ఉంటుంది. ఈ ఆలయం కొంచం ఇతర మతస్థుల ప్రాంతం లో ఉండడం వల్ల ఈ ఆలయం సరియైన అభివృద్ది జరగలేదు.  ఈ ఆలయంలో శివాభిషేకం చాలా బాగా చేస్తారు.  ప్రతి సోమవారం మరియు మాస శివరాత్రికి మరియు మహా శివారాత్రి రోజున స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు చేస్తారు. శివారాత్రి రోజున రాత్రి భజన కార్యక్రమాలు చేసి జాగరణ కూడా చేస్తారు.  ఈ ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామి కూడా కొలువై ఉన్నారు. ప్రతి శనివారం రోజున స్వామి కి తమల ఆకుల తో ప్రత్యేక అలంకరణ చేసి అర్చనా చేస్తారు. ఈ ఆలయంలో ఇతర ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. అందులో మొదటగా శ్రీ మహాగణపతి విగ్రహం , శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్య స్వామి కూడా కొలువై ఉన్నారు. ఈ ఆలయానికి పార్కింగ్ చాలా చిన్నగా ఉంటుంది. అందుకు గల ప్రధాన కారణం ఈ ఆలయం ప్రధాన రహదారి మీదనే ఉంటుంది.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 06:00 నుంచి 12:00...

Shabarimalla ayyappa swamy Temple | Bhavani Nagar | Banjarahills | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం బయటి నుంచి చూస్తే చిన్నగా కనిపించిన లోపల మాత్రం కొంచం పెద్దగానే ఉంటుంది. ఈ ఆలయం వెనుక శ్రీ కృష్ణా గోశాలా కూడా ఉన్నది. ఈ దేవాలయం పూర్తిగా కేరళ లోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయాన్ని పోలి ఉంటుంది.  ఈ ఆలయం హైదరాబాద్ లోని బంజారాహిల్ల్స్ లో భవాని నగర్ వద్ద కలదు. ఈ ఆలయం లోపల ఇతర ఉప ఆలయాలు కూడా ఉన్నాయి.  ఈ ఆలయంలో ప్రత్యేకంగ శ్రీ ఆయప్ప స్వామి దీక్ష మాలాధారులు భక్తులు డిసెంబర్ నెల మరియు జనవరి నెలలో  భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలయంలో శ్రీ గణపతి స్వామి ఆలయం , శివాలయం , దుర్గా దేవి ఆలయం , నవగ్రహ ఆలయం, నాగదేవత ఆలయం , శ్రీ ఆంజనేయ స్వామి ఆలయలు కూడా ఉన్నాయి.  ఇక్కడ జరిగే అయ్యప్ప స్వామి పడి పూజా ఒక్కసారి ఐన చూడవలసిందే. అంతా వైభవంగా జరుగుతుంది. సాయంత్ర సమయంలో ఈ ఆలయంలో పూజా తప్పకుండ దర్శించాలి.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 06:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్  సాయంత్రం : 04:30 నుంచి 08:30  #Shabarimalla ayyappa swamy Temple  #Bhavani Nagar  #Banjarahills  #Hyderabad 

Sri Hanuman Alayam | Nandi Nagar | Banjara Hills | Hyderabad

Image
  ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం పూర్తిగా రాతితో నిర్మించారు. ఈ ఆలయం ముందు కొంచం చిన్న పార్కింగ్ సౌకర్యం కలదూ.  ఈ ఆలయన్ని ఇక్కడి భక్తులు శ్రీ హనుమాన్ ఆలయంగా పిలుస్తారు. ఈ ఆలయం హైదరాబాద్ లోని జి‌.యస్. నగర్ మరియు నంది నగర్ కి మధ్యలో ఉంటుంది. బంజారాహిల్ల్స్ gvk దగ్గర నుంచి కూడా ఈ ఆలయానికి రోడ్ మార్గం కలదు.  ఈ దేవాలయంలో ప్రతి సం || శ్రీ గణపతి ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి. గణపతి నవరాత్రులు వైభవంగా చేసి ప్రతి రోజు ఉచిత సామూహిక అన్నదాన ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారు.  శ్రీ ఆంజనేయ జయంతి , శ్రీ రామ నవమి రోజున భక్తులు విశేషంగా ఈ ఆలయాన్ని దర్శిస్తారు. ఆ రోజున సుమారు 5000 నుంచి 10000 మంది వరకు ఉచిత సామూహిక అన్నదానం జరుగుతుంది. ఇక్కడ స్వామి పూర్తి సిందూరం రంగులో దర్శనం ఇస్తారు. శ్రీ రామ నవమి రోజున శ్రీ సీతా రాముల కళ్యాణం కూడా జరుగుతుంది.  ఈ ఆలయం హిల్ మెన్ స్కూల్ కి పక్కనే ఉంటుంది. ఈ ఆలయం చాలా లోపలికి ఉండడం వల్ల సరియైన అభివృద్ది జరగడం లేదు.  ఆలయ దర్శన సమయం :  ఉదయం : 06:00 నుంచి 12:00  మధ్యాన్నం : 12:...