Sri Hanuman Alayam | Nandi Nagar | Banjara Hills | Hyderabad

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం పూర్తిగా రాతితో నిర్మించారు. ఈ ఆలయం ముందు కొంచం చిన్న పార్కింగ్ సౌకర్యం కలదూ. 

ఈ ఆలయన్ని ఇక్కడి భక్తులు శ్రీ హనుమాన్ ఆలయంగా పిలుస్తారు. ఈ ఆలయం హైదరాబాద్ లోని జి‌.యస్. నగర్ మరియు నంది నగర్ కి మధ్యలో ఉంటుంది. బంజారాహిల్ల్స్ gvk దగ్గర నుంచి కూడా ఈ ఆలయానికి రోడ్ మార్గం కలదు. 

ఈ దేవాలయంలో ప్రతి సం || శ్రీ గణపతి ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి. గణపతి నవరాత్రులు వైభవంగా చేసి ప్రతి రోజు ఉచిత సామూహిక అన్నదాన ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారు. 

శ్రీ ఆంజనేయ జయంతి , శ్రీ రామ నవమి రోజున భక్తులు విశేషంగా ఈ ఆలయాన్ని దర్శిస్తారు. ఆ రోజున సుమారు 5000 నుంచి 10000 మంది వరకు ఉచిత సామూహిక అన్నదానం జరుగుతుంది. ఇక్కడ స్వామి పూర్తి సిందూరం రంగులో దర్శనం ఇస్తారు. శ్రీ రామ నవమి రోజున శ్రీ సీతా రాముల కళ్యాణం కూడా జరుగుతుంది. 

ఈ ఆలయం హిల్ మెన్ స్కూల్ కి పక్కనే ఉంటుంది. ఈ ఆలయం చాలా లోపలికి ఉండడం వల్ల సరియైన అభివృద్ది జరగడం లేదు. 

ఆలయ దర్శన సమయం : 

ఉదయం : 06:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 04:30 బ్రేక్ 

సాయంత్రం : 04:30 నుంచి 08:00 


#Sri Hanuman Alayam  #Nandi Nagar  #Banjara Hills  #Hyderabad 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana