Sri Sri Sri Eedhamma Temple | Radha Krishan Colony | Hyderaguda | Attapur | Hyderabad
ఈ దేవాలయం కొంచం పురాతనమైన దేవాలయం. ఈ ఆలయం కొంచం చిన్నగా ఉంటుంది. ఇక్కడ ప్రధాన దేవత మూర్తి శ్రీ శ్రీ శ్రీ ఈధమ్మ అమ్మవారు. ఈ అమ్మవారు ఇక్కడ గ్రామానికి గ్రామ దేవత. ప్రణవ భక్త సమాజం వారి ఆధ్వర్యంలో ఈ దేవాలయం నడపబడుతున్నది.
ఈ ఆలయం హైదరాబాద్ లోని అత్తాపూర్ వద్ద నుంచి రాధా కృష్ణా కాలనీ కి హైదర్ గూడ కి మధ్యలో ఈ దేవాలయం ఉంటుంది. ఈ దేవాలయం చిన్నగా ఉంటుంది. కానీ చాలా శక్తివంతమైన గ్రామ దేవత. ఈ ఆలయానికి కేవలం ద్వి చక్ర వాహన పార్కింగ్ సౌకర్యం మాత్రమే ఉన్నది.
ఈ ఆలయంలో ప్రతి సం || ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాల పండుగ చాలా పెద్ద ఎత్తున్న నిర్వహిస్తారు. ఇక్కడ నివసించే మహిలలో అమ్మవారికి బోనాలని చక్కగా అలంకరణ చేసి పోతరాజుల నృత్యలతో డప్పు వాయిద్యాలతో శివసత్తుల పూనకాలతో చాలా బాగా జరుగుతుంది.
తిరిగి ఆశ్వయుజ మాసంలో అమ్మవారికి దసరా సమయంలో ఈ ఆలయంలో చాలా రద్దీ ఉంటుంది. అమ్మవారికి దేవి నవరాత్రులు పూజలు నిర్వహించి 10వ రోజున దసరా చాలా పెద్ద ఎత్తున్న జరుగుతుంది.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:30
మధ్యాన్నం : 12:30 నుంచి 05:00 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 08:00
#Sri Sri Sri Eedhamma Temple #Radha Krishan Colony #Hyderaguda #Attapur #Hyderabad

Comments
Post a Comment