Sri Mahankali Eallamma Temple | Kantha Reddy Nagar | Attapur | Hyderabad
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం ఇక్కడ చాలా సం || నుంచే ఉన్నది. ఈ దేవాలయం ఇక్కడ సుమారు 35 సం || కంటే ముందు నుంచే ఉన్నట్టు సమాచారం. అప్పుడు ఇక్కడ అమ్మవారి ఆలయం చాలా చిన్నగా ఉండేధి.
ఈ ఆలయం హైదరాబాద్ లోని అత్తాపూర్ వద్ద గల కాంత రెడ్డి నగర్ కాలనీ కి మధ్యలో ఉంటుంది. ఈ ఆలయాన్ని ఇక్కడి భక్తులు ఈ గ్రామ దేవతా గా కొలుస్తారు.
ఈ దేవాలయంలో అమ్మవారు శ్రీ మహంకాళి ఎల్లమ్మ దేవతగా పూజలు అందుకుంటుంది. ప్రతి సం ఈ ఆలయంలో ఆషాఢ మాసంలో అమ్మవారికి భారీ సంఖ్యలో బోనాలు సమర్పిస్తారు. సాయంత్రం పోతరాజులు నృత్యలతో రంగా ప్రవేశం చేసి గ్రామంలోని అసుర శక్తులని సంహరించి పూర్వం జంతు బలులు ఇచ్చే వారు కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ కోడి , మేక వంటి జంతువులని బలి ఇస్తారు.
ఆశ్వయుజ మాసంలో ఇక్కడ అమ్మవారి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు చాలా బాగా నిర్వహిస్తారు. 9 రోజులు పూజలు చేసి 10 వ రోజు దసరా పండుగ జరుపుతారు. ఈ ఆలయం కొంచం చిన్నగా ఉంటుంది.
ఈ ఆలయనికి చేరుకోవడానికి చాలా మార్గాలు ఉన్నది. ఎల్లమ్మ ఆలయం అని గూగుల్ మాప్ లో సర్చ్ చేస్తే ఈ దేవాలయం వస్తుంది. ఆలయం పేరు కింద కంతా రెడ్డి నగర్ కాలనీ అని గమనించాలి. లేని యెడల వేరే ఆలయానికి వెళ్ళే అవకాశం ఉన్నది.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:00
మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్
సాయంత్రం : 05:00 నుంచి 08:00 వరకు
#Sri Mahankali Eallamma Temple #Kantha Reddy Nagar #Attapur #Hyderabad

Comments
Post a Comment