Sri Veerabadhra Swamy Temple | kunwarjiguda | Jafferguda | Talla Gadda | Gudimalkapur | Hyderabad | Telangana
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం సుమారు 250 సం || కంటే ముందు నుంచే ఈ ఆలయం ఉన్నట్టు సమాచారం.ఈ ఆలయం అంతా రాతితో నిర్మించారు. కింద బండలను రాతితోనే ఉండడం గమనించవచ్చు. ఈ దేవాలయం రోడ్ నుంచి సుమారు 15 మెట్ల కిందకి ఉంటుంది.
ఈ ఆలయం హైదరాబాద్ లోని మెహిందీపట్నం గుడిమల్కాపూర్ కున్వర్జీ గూడ జఫ్ఫర్ గూడ అనే గ్రామాలకి మధ్యలో ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయం పార్కింగ్ కూడా చాలా పెద్దగానే ఉంటుంది. ఆలయం వెనుక పక్కన పార్కింగ్ సౌకర్యం కలదు.
ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ వీరభద్ర స్వామి. ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి తో పాటు ఇతర ఉప ఆలయాలు కూడా దర్శించవచ్చు.
ఈ ఆలయంలో శ్రీ హనుమాన్ ఆలయం, 3 శివాలయాలు , భధ్రకాళీ అమ్మవారి ఆలయం కూడా ఉన్నది. దసరా సమయంలో ఈ ఆలయంలో అమ్మవారికి వేశేష పూజలు జరుగుతాయి. శ్రీ ఆంజనేయ స్వామి జయంతి రోజున విశేష పూజలూ జరుగుతాయి. శ్రీ రామ నవమి రోజున స్వామి పూజ చేసి సీతారామ కళ్యాణం కూడా జరుగుతుంది.
ఆలయ దర్శన సమయం :
ఉదయం : 06:00 నుంచి 12:30
మధ్యాన్నం : 12:30 నుంచి 04:30 బ్రేక్
సాయంత్రం : 04:30 నుంచి 08:00
#Sri Veerabadhra Swamy Temple #kunwarjiguda #Jafferguda #Talla Gadda #Gudimalkapur #Hyderabad #Telangana

Comments
Post a Comment