Sri Beerappa Swamy Temple | Earraboda | Upperpally | Attapur | Hyderabad

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ దేవాలయం కొంచం పెద్దగానే ఉంటుంది. ఇక్కడ ఉన్న స్వామి కర్ణాటక లో చాలా ప్రసిద్ది చెందిన స్వామి బీరప్ప స్వామి. 

ఈ ఆలయం హైదరాబాద్ లోని అత్తాపూర్ ఉప్పెర్పల్లి అనే గ్రామానికి కొద్ది దూరంలోనే ఎర్రబోడ అనే గ్రామం లో ఈ దేవాలయం కలదు. ఈ దేవాలయానికి కొంచం పెద్దగానే పార్కింగ్ సౌకర్యం కలదు. ద్వి చక్ర , త్రీ చక్ర , కార్ వంటి వాహనాలను కూడా పార్క్ చేయవచ్చు. వయోవృద్దుల కోసం ప్రత్యేక ప్రవేశ ద్వారం కలదు. 

ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ బీరప్ప స్వామి పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయం లో ప్రతి సం || శివరాత్రి కి ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఈ దేవాలయంలో మొదట పెద్ద ధ్వజ స్తంభం ని దర్శించుకొని తరువాత శ్రీ బీరప్ప స్వామిని దర్శించుకోవాలి. ఈ ఆలయం కొంచం శివాలయాన్ని పోలి ఉంటుంది. 

ఆలయ దర్శన సమయం : 

ఉదయం : 06:00 నుంచి 12:30

మధ్యాన్నం : 12:30 నుంచి 04:30 బ్రేక్ 

సాయంత్రం : 04:30 నుంచి 08:00 


#Sri Beerappa Swamy Temple  #Earraboda  #Upperpally  #Attapur  #Hyderabad 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana