Sri Shiva Devalayam | Attapur Village | Rajendhra Nagar | Hyderabad

 


ఈ దేవాలయం చాలా పురాతన దేవాలయం. పూర్వం ఈ దేవాలయం చాలా చిన్నగా ఉండేధి. కానీ భక్తులు అందరూ కలిసి ఈ దేవాలయాన్ని పునః నిర్మించుకొని పెద్దగా కట్టుకున్నారు. ఈ దేవాలయం కొంచం చిన్నగా ఉంటుంది. 

 ఈ ఆలయం హైదరాబాద్ లోని రాజేంధ్ర నగర్ మండలం అత్తాపూర్ విలేజ్ లోపల ఈ దేవాలయం ఉన్నది. ఈ ఆలయం ప్రధాన రహదారి మీదనే ఉండడం వల్ల చాలా సునాయసంగానే కనిపిస్తుంది. ఈ ఆలయానికి సరియైన పార్కింగ్ సౌకర్యం లేదు. 

ఈ దేవాలయంలో ఇతర ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. మొదట శ్రీ మహా గణపతి స్వామి మన సదాశివ పక్కనే ఉంటారు. తరువాత నంది విగ్రహం కూడా దర్శించవచ్చు. అటు తరువాత శివాలయ దర్శనం చేసుకొని బయటికి వచ్చేటప్పుడు శ్రీ సుబ్రమణ్య స్వామి దర్శనం చేసుకోవచ్చు. 

ఈ దేవాలయంలో మరియొక్క ప్రధాన ఉప ఆలయం కూడా ఉన్నది. శ్రీ దుర్గా దేవి ఆలయం. ఈ ఆలయంలో ఆషాఢ మాసంలో బోనాలు సమర్పిస్తారు. ఆశ్వయుజ మాసంలో దేవి నవరాత్రుల ఉత్సవాలు జరిపి పదవ  రోజున అమ్మవారి ప్రత్యేక అభిషేకాలు చేసి హోమం చేసి కుంకుమార్చనలు కూడా చేస్తారు. ఈ ఆలయం ప్రత్యేక రోజులలో చాలా బాగా అలంకరణ చేస్తారు. అప్పుడు తప్పకుండా ఈ ఆలయ దర్శనం చేయాలి. 

ఆలయ దర్శన సమయం : 

ఉదయం : 06:00 నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్ 

సాయంత్రం : 05:00 నుంచి 08:00 వరకు 


 #Sri Shiva Devalayam   #Attapur Village  #Rajendhra Nagar  #Hyderabad 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana