Sri Balaji Hanuman Mandir | 9no Road | Kishan Bagh | Attapur | Hyderabad

 


ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం కొంచం చిన్నగా ఉంటుంది. ఈ ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామి తో పాటుగా శ్రీ బాలాజి ఆలయం కూడా ఉంటుంది. 

ఈ ఆలయం హైదరాబాద్ లోని అత్తాపూర్ వద్ద గల కిషన్ బాఘ్ అనే గ్రామం మరియు 9 నెంబర్ రోడ్ కి మార్గ మధ్యలో ఈ దేవాలయం కలదు. ఈ ఆలయం ఇతర మతస్థుల రోడ్ ప్రాంతంలో ఉండడం వల్ల కొన్ని సార్లు ఈ ఆలయం మీద దాడులు కూడా జరిగిన కూడా ఈ ఆలయం తట్టుకొని నిలబడడం చాలా గొప్ప విషయం. 

ఈ ఆలయంలో ప్రధాన దేవత మూర్తి శ్రీ ఆంజనేయ స్వామి మరియు శ్రీ బాలాజి స్వామి కొలువై ఉన్నారు. ప్రతి సం || ఈ ఆలయంలో శ్రీ ఆంజనేయ జయంతి మరియు శ్రీ రామ నవమి చాలా పెద్ద ఎత్తున్న వేడుకలు నిర్వహిస్తారు. రాత్రి సమయంలో ఇక్కడ భజన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. 

ఈ దేవాలయం ప్రధాన రహదారి మీద ఉండడం వల్ల సరియైన పార్కింగ్ సౌకర్యం లేదు. శ్రీ రామ నవమి రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ ఆలయంలో సామూహిక ఉచిత అన్నదాన ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. ఇక్కడ శ్రీ ఆంజనేయ స్వామి ఎదురుగా హోమగుండం కూడా ఉన్నది. ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం కావడం వల్ల ఇప్పుడు కొంచం పునః నిర్మాణం కూడా చేశారు. 

ఆలయ దర్శన సమయం : 

ఉదయం : 06:00  నుంచి 12:00 

మధ్యాన్నం : 12:00 నుంచి 05:00 బ్రేక్ 

సాయంత్రం : 05:00 నుంచి 08:00 


#Sri Balaji Hanuman Mandir  #9no Road  #Kishan Bagh  #Attapur  #Hyderabad 

Comments

Popular posts from this blog

Ayyappa Swamy Temple | Shankarpally | Hyderabad | Hindu Temples Guide

Sri Indreshwara Swamy Temple | Indresham Village | Hyderabad | Telangana

Shree Kaleshwara Mukteeshwara Swamy Devasthanam | Kaleshwaram Temple | Telangana