Sri Mahankali Temple | Gowliguda | Hyderabad | Telangana
ఈ ఆలయం చాలా పురాతన ఆలయం. ఈ ఆలయం సుమారు 200 సం|| కంటే పురాతనమైనది. అప్పుడు ఈ దేవాలయం చాలా చిన్నగా ఉండేధి. భక్తులు అందరూ కలిసి ఈ ఆలయాన్ని పునఃనిర్మించుకున్నారు.
ఈ ఆలయం హైదరాబాద్ లోని ప్రధాన బస్ స్టేషన్ ఐన MGBS మరియు అఫ్జల్ గంజ్ కి మధ్యలో ఈ దేవాలయం ఉంటుంది. ఈ ఆలయం కొంచం చిన్నగానే ఉన్న కూడా ఇక్కడ ప్రాంతం లో ఈ ఆలయం చాలా ప్రసిద్ది చెందినది.
ఈ ఆలయంలో ప్రధానంగా శ్రీ మహంకాళి అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. ఈ దేలయంలో ఇతర ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. మొదట గణపతి , గొడలమీద శ్రీ మహాలక్ష్మీ దేవి, ఉత్సవ మూర్తులు కలవు. ప్రతి సం || ఆషాఢ మాసంలో బోనాల పండుగ చాలా పెద్ద ఎత్తున్న నిర్వహిస్తారు. మహిళా భక్తులు అమ్మవారికీ ఉదయం నుంచి సాయంత్రం వరకు బోనాలు సమర్పించి సాయంత్రం లేదా మరుసటి రోజు సాయంత్రం ఘటలా ఊరేగింపు జరిపి పోతరాజుల నృత్యాలు , చాలా పెద్ద ఎత్తున్న నిర్వహిస్తారు. అప్పుడు చాలా మంది భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఈ ఆలయాన్ని సందర్శించడానికి వస్తారు.
అశ్వయుజ మాసంలో అమ్మవారికి దసరా ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. 9 రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరణ చేసి 10వ రోజు దసరా ఉత్సవాలు జరుపుతారు.
ఆలయ దర్శన సమయం :
ఉదయం 06:00 నుంచి 12:30
మధ్యాన్నం : 12:30 నుంచి 04:30 బ్రేక్
సాయంత్రం : 04:30 నుంచి 08:30 వరకు
#Sri Mahankali Temple #Gowliguda #Hyderabad

Comments
Post a Comment